అన్వేషించండి

David Warner: నా సెంటిమెంట్ క్యాప్‌ ఇచ్చేయండి ప్లీజ్, బ్యాగీ గ్రీన్ కోసం వార్నర్ అభ్యర్థన

David Warner: ఫేర్‌వెల్ టెస్టుకు ముందు ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కెరీర్లో చివరి టెస్టు ఆడే ముందు తనకెంతో ఇష్టమైన బ్యాగీగ్రీన్ క్యాప్ పోగొట్టుకున్నాడు.

Aus vs Pak:   వీడ్కోలు టెస్టు ముంగిట ఆసీస్‌ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ (David Warner)కు  షాక్‌ తగిలింది. ఈ విషయంపై వార్నర్ ఉద్వేగభరిత విజ్ఞప్తి చేశారు. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను షేర్ చేశారు. మెల్ బోర్న్ నుంచి సిడ్నీకి వెళ్తున్న క్రమంలో తన లగేజ్ నుంచి బ్యాక్‌ప్యాక్‌ మిస్ అయిందని, అందులోని బ్యాగీ గ్రీన్ క్యాప్ (Baggy Green cap) తనకెంతో విలువైందని, తిరిగి ఇస్తే సంతోషిస్తానని ఆ వీడియోలో చెప్పాడు. తన లాస్ట్ మ్యాచ్ లో అది ధరించి బ్యాటింగ్ కు వెళ్లాలనుకుంటున్నానని వార్నర్ అన్నారు. తన బ్యాక్‌పాక్‌ కావాలని ఎవరైనా తీసిఉంటే వారికి నా దగ్గర ఉన్న ఇంకో బ్యాక్‌పాక్‌ ఇస్తానని, కానీ, ఆ క్యాప్ మాత్రం వీలైనంత త్వరగా ఇచ్చేయాలని వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో విజ్ఞప్తి చేశారు.

తాను కోల్పోయిన బ్యాక్‌ప్యాక్ కోసం ఎంతో ప్రయత్నించిన తర్వాత చివరి ప్రయత్నంగా ఈ వీడియో రిలీజ్ చేస్తున్నట్లు వార్నర్ అందులో చెప్పాడు. అదితనకు  చాలా సెంటిమెంట్ అన్నాడు. ఒకవేళ మీకు నిజంగా తన  బ్యాక్‌ప్యాకే కావాలనుకుంటే తన దగ్గర మరొకటి ఉంది. అది ఇస్తాననీ,  మీకు ఎలాంటి సమస్య కూడా ఎదురవకుండా చూసుకుంటానని, బాగ్ లో ఉన్న ఆ బ్యాగీ గ్రీన్ మాత్రం తనకు కావాలని అభ్యర్థించాడు. ఏదన్నా ఉంటే  దయచేసి క్రికెట్ ఆస్ట్రేలియా లేదంటే తన  సోషల్ మీడియా ద్వారా సమాచారం ఇవ్వమని అభ్యర్ధించాడు . ఆస్ట్రేలియా ప్లేయర్స్ లగేజీని మోసుకెళ్లే కాంటాస్ ఎయిర్‌లైన్ తోపాటు మెల్‌బోర్న్ లో తాము బస చేసిన సౌత్‌బ్యాంక్ హోటల్ యాజమాన్యంతోనూ తాను మాట్లాడినట్లు వార్నర్ తెలిపాడు. 

స్టెయిన్‌ అంటేనే భయం: వార్నర్‌
 ముందంతా టెస్టు క్రికెట్‌ నుంచి మాత్రమే తప్పుకోనున్నట్టు ప్రకటించిన డేవిడ్‌ వార్నర్‌ (David Warner) అకస్మాత్తుగా వన్డేల నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. జనవరి 3 (ఈరోజు ) నుంచి సిడ్నీ(Sydney) వేదికగా పాకిస్తాన్‌(Pakistan)తో జరుగబోయే పింక్‌ టెస్టుకు ముందు వార్నర్‌ మాట్లాడుతూ తన కెరియర్లో భయపెట్టిన, అత్యంత కఠినమైన బౌలర్‌ ఎవరన్నది వెల్లడించాడు. ఇన్ని సంవత్సరాల కెరియర్లో ఎంతోమంది దిగ్గజ బౌలర్లను ఎదుర్కున్నఈ ఆసీస్‌ స్టార్ ఓపెనర్‌.. సౌతాఫ్రికా(South Africa) మాజీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ (Dale Stein ) తనను బాగా భయపెట్టాడని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా 2016-17లో దక్షిణాఫ్రికా ఆసీస్‌(Ausis) పర్యటనకు వచ్చినప్పుడు స్టెయిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం తనకు కత్తిమీద సాములా అనిపించిందని గుర్తు చేసుకున్నాడు. ప్రత్యేకించి ఆ టెస్టులో 45 నిమిషాల సెషన్‌ అయితే తమకు చుక్కలు చూపించిందని, . ఆ సందర్భంలో మార్ష్‌ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని చెప్పాడు.
వార్నర్‌కు చివరి టెస్ట్‌
 ఇప్పటికే టెస్ట్‌ క్రికెట్‌(Test Cricket)కు వీడ్కోలు పలికిన డేవిడ్‌ భాయ్‌ ఇప్పుడు వన్డే(ODI cricket)లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించేశాడు. భారత్‌(Bharat)పై వన్డే ప్రపంచకప్‌(ODI World Cup2023 ) గెలిచిన ఈ మధుర క్షణాలే తన వన్డే కెరీర్‌కు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నట్లు వార్నర్‌ తెలిపాడు. తన నిర్ణయం వల్ల కొత్త వారికి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరమైతే మాత్రం తాను పునరాగమనం చేస్తానని వార్నర్‌ చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget