అన్వేషించండి
Advertisement
David Warner: వార్నర్‌కు గార్డ్ ఆఫ్ ఆనర్ ,దిగ్గజ ఆటగాడికి గ్రాండ్ వెల్కమ్
David Warner: స్వదేశంలో చివరి టెస్ట్ ఆడుతున్న డేవిడ్ వార్నర్‌కు పాకిస్థాన్ ప్లేయర్లు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చి గౌరవించారు.
స్వదేశంలో చివరి టెస్ట్ ఆడుతున్న డేవిడ్ వార్నర్(David Warner)కు పాకిస్థాన్(Pakistan) ప్లేయర్లు గార్డ్ ఆఫ్ ఆనర్(Guard of Honour) ఇచ్చి గౌరవించారు. ఆస్ట్రేలియా(Australi) జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించిన ఈ స్టార్ ఓపెనర్‌కు పాక్ ఆటగాళ్లు, కంగారు జట్టులోని సహచర ఆటగాళ్లు అభినందనలు తెలిపారు. పాక్ ఆటగాళ్లు చెరో వైపున నిలబడి వార్నర్‌కు చప్పట్లతో స్వాగతం పలికారు. వార్నర్ బ్యాటింగ్‌కు వచ్చేముందు మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా వార్నర్‌ను ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. కెప్టెన్ మసూద్, వికెట్ కీపర్ రిజ్వాన్ సహా ప్రతి ఒక్కరూ వార్నర్‌కు అభినందనలు తెలిపారు. తొలి రోజు ఆట ముగిసేసమయానికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ ఆరు పరుగులతో... ఉస్మాన్ ఖవాజా పరుగులేమీ లేకుండా క్రీజులో ఉన్నారు.
పాక్ గౌరవప్రదమైన స్కోరు
ఆసీస్‌తో జరుగుతున్న నామమాత్రమైన మూడో టెస్ట్‌లో పాకిస్తాన్ (Pakistan Cricket Team) తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌటైంది. లోయర్ అర్డర్ అద్భుతంగా పుంజుకోవడంతో క్లిష్టమైన దశనుంచి పాక్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. రిజ్వాన్ 88 పరుగులు, అఘా సల్మాన్ 53 పరుగులు, ఆమిర్ జమాల్ 82 పరుగులు చేసి పాక్‌కు మంచి స్కోరు అందించారు. టాస్ గెలిచిన పర్యాటక పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ (Pakistan First Batting) ఎంచుకోగా ఆదిలోనే పాక్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్‌ను మిచెల్ స్టార్క్.. సయీమ్ ఆయుబ్‌ను జోష్ హాజిల్‌వుడ్ డకౌట్ చేసి పెవిలియన్‌కు పంపారు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే పాక్ రెండు వికెట్లు కోల్పోయింది. షాన్ మసూద్ (35), బాబర్ ఆజమ్ (26) కాసేపు ఆసీస్ బౌలర్ల (Australia Bowlers)ను నిలువరించారు. ఆతర్వాత స్వల్ప వ్యవధిలో వీరిద్దరితో పాటు సౌద్ షకీల్ (5) ఔట్ కావడంతో పాక్ 95 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత రిజ్వాన్ 88, అఘా సల్మాన్ 53, ఆమిర్ జమాల్ 82 పరుగులు చేసి పాక్‌కు 313 పరుగుల స్కోరు అందించారు.
ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Australia Captain Pat Cummins) మరోసారి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో (5/61) చెలరేగి పాక్ వెన్నువిరచగా.. స్టార్క్ (2/75), హాజిల్‌వుడ్ (1/65), లయోన్ (1/74), మార్ష్ (1/27) కూడా రాణించారు.
వార్నర్‌కు చివరి టెస్ట్
ఇప్పటికే టెస్ట్ క్రికెట్(Test Cricket)కు వీడ్కోలు పలికిన డేవిడ్ భాయ్ ఇప్పుడు వన్డే(ODI cricket)లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించేశాడు. భారత్(Bharat)పై వన్డే ప్రపంచకప్(ODI World Cup2023 ) గెలిచిన ఈ మధుర క్షణాలే తన వన్డే కెరీర్‌కు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నట్లు వార్నర్ తెలిపాడు. తన నిర్ణయం వల్ల కొత్త వారికి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరమైతే మాత్రం తాను పునరాగమనం చేస్తానని వార్నర్ చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా రివ్యూ
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion