అన్వేషించండి

Ind vs Aus Semi Final: కంగారూలను టీమిండియా కుమ్మేస్తుందా? శర్మా జీ రివేంజ్ పగ తీర్చుకోవాల్సిన టైమొచ్చింది

Champions Trophy 2025 | టీమిండియా కీలకమైన నాకౌట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్ లో నెగ్గి గత పరాభవాలకు ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు భావిస్తోంది.

ICC Champions Trophy 2025 | 19 నవంబర్ 2023 ఆ రోజు టీమిండియా జరిగిన పరాభవం. ఎప్పటికీ భారత క్రికెట్ ప్రేమికులు మర్చిపోలేనిది. ఫైనల్ వరకూ ప్రతి ఒక్కరూ ఇరగదీశారు. మహ్మద్ షమీ వికెట్ల వేట... కెప్టెన్ రోహిత్ శర్మ సెల్ఫ్ లెస్ ఇన్నింగ్స్... ఛేజింగ్ మాస్టర్, రన్ మేషిన్ విరాట్ ఫామ్ లోకి వచ్చిన ఆనందం.. లక్షా 30వేల భారత అభిమానులు సాక్షిగా.. ఓ ఆసీస్ సైలెన్సర్ మనల్ని సైలెంట్ చేశాడు. అది చాలదన్నట్లు ఓ ‘హెడ్’ మాస్టర్ మన పెట్టిన లక్ష్యాన్ని హల్వా తిన్నట్లు ఊదేశాడు. రిజల్ట్ భారత్ వరల్డ్ కప్ కల చెదిరిపోయింది. 2011 తర్వాత మళ్లీ మనదే వరల్డ్ కప్ అని బలంగా నమ్మిన అభిమానులను ఆ రోజు ఆసీస్ ప్లేయర్లు ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్ సైలెంట్ చేస్తే... రెండేళ్ల తర్వాత అంత కాకపోయినా అంతకంత పగ తీర్చుకోవటానికి మనోళ్లకు అవకాశం వచ్చింది.

మినీ వరల్డ్ కప్ అని పిలుచుకునే ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో మార్చి 4న మళ్లీ ఇండియా, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఓడిన వాడు ఇంటికి గెలిచిన వాడు ఫైనల్ కి పోతాడు. కనుక డూ ఆర్ డై లాంటి ఈ మ్యాచ్ లో భారత్ ఏం చేస్తుందనే టెన్షన్...రోహిత్ శర్మ సైన్యం కచ్చితంగా బదులు తీర్చుకోవాలనే కసి స్పష్టంగా కనిపిస్తుంది. 2011 వన్డే వరల్డ్ కప్ లో ఇదే విధంగా టీమిండియా సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ కు వెళ్లిన అక్కడ లంకకు షాక్ ఇచ్చి వరల్డ్ కప్ ను ముద్దాడింది. అచ్చం అలానే ఈసారి కూడా ఛాన్స్ వచ్చింది. మళ్లీ సెమీస్ లో ఆస్ట్రేలియాను ఓడిస్తే...ఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ల్లో ఓ టీమ్ ను ఢీకొట్టి మినీ వరల్డ్ కప్ ను కొట్టేసే ఛాన్స్ వచ్చింది. మరి దుబాయ్ మన దొరబాబులు ఏం చేస్తారో చూడాలి.

హెడ్ మాస్టర్ ని ఆపగలిగితేనే..
టీమిండియా ఐసీసీ టోర్నీల కలను చెదరగొడుతున్న ఓ ఆసీస్ బ్యాటర్ ఉన్నాడు. ఆతడి పేరు ట్రావిస్ హెడ్. సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడేప్పుడు ముద్దుగా హెడ్ మాస్టర్ అని పిలుచుకునే ఈ ఆస్ట్రేలియన్ బ్యాటర్ గడిచిన రెండేళ్ల కాలంలో భారత్ నుంచి 2 ఐసీసీ టోర్నీలు లాగేశాడు. 2023 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్.. లండన్ లో భారత్, ఆస్ట్రేలియాకు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ అడ్డం పడి మన విక్టరీని లాగేసుకున్నాడు. ఏకంగా 163 పరుగులు బాది భారత్ పై ఆస్ట్రేలియాకు 209 పరుగుల విక్టరీతో పాటు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీని అందించాడు.

మళ్లీ అదే హెడ్ 2023 వన్డే వరల్డ్ కప్ లోనూ మన కలల్ని ఆశల్ని చిదిమేశాడు. మనోళ్లే కుయ్యో మొర్రో అంటూ 240 పరుగులు చేస్తే ఈ హెడ్మాస్టర్ ఫైనల్లో మనోళ్లను ఎడాపెడా కుమ్మేశాడు. 137పరుగులు బాది గ్రౌండ్ లో ఉన్న లక్షా 20 వేల అభిమానులను సైలెంట్ చేయటంతో పాటు వన్డే వరల్డ్ కప్ నూ లాగేసుకున్నాడు మన చేతుల్లో నుంచి. ఇప్పుడు అలాంటోడు మళ్లీ వస్తే అన్నట్లుంది పరిస్థితి. ఐసీసీ టోర్నీ ఫైనల్లో రెండుసార్లు మనకి తలనొప్పిలా మారిన హెడ్డు ఈ సారి సెమీస్ లో నే తగులుతున్నాడు టీమిండియా ఫ్యాన్స్ అదే ఆలోచనల్లో ఉన్నారు. వీలైనంత త్వరగా మన బౌలర్లు హెడ్ ని అవుట్ చేస్తే సగం భారం దిగిపోయినట్లే.

Also Read: Ind vs Aus Semi Final: 14 ఏళ్లుగా ఆసీస్‌కు తిరుగులేదు, టీమిండియా ఈసారైనా ఆ రికార్డు బద్ధలు కొడుతుందా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Droupdi Murmu: రాష్ట్రపతి ముర్ముకు తప్పిన ప్రమాదం, ల్యాండింగ్ సమయంలో కుంగిన హెలిప్యాడ్
రాష్ట్రపతి ముర్ముకు తప్పిన ప్రమాదం, ల్యాండింగ్ సమయంలో కుంగిన హెలిప్యాడ్
Chandrababu UAE Tour Schedule: నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు.. విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు
నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు.. విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు
Prabhas Hanu Raghavapudi Movie: బెంగాలీలోనూ ప్రభాస్ - హను సినిమా రిలీజ్... రేపే టైటిల్ రివీల్!
బెంగాలీలోనూ ప్రభాస్ - హను సినిమా రిలీజ్... రేపే టైటిల్ రివీల్!
Most Expensive Car: తరతరాల సంపాదనా సరిపోదు! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఏది, దాని ధర ఎంత
తరతరాల సంపాదనా సరిపోదు! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఏది, దాని ధర ఎంత
Advertisement

వీడియోలు

6 Ball Over Behind Story | 6 బాల్ ఓవర్ కోసం ఇంగ్లండ్-ఆసీస్ మధ్య దశాబ్దాల ఫైట్‌ జరిగిందా? | ABP Desam
గంభీర్-గిల్ వల్లే అంతా! ఇలా అయితే సిరీస్ కూడా కష్టమే!
స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ సింగ్.. ఇద్దరికీ ఎంత తేడా?
ఇండియా మ్యాచ్.. రూ.60కే టికెట్
గంభీర్ వల్లే టీమిండియా ఓడింది: అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Droupdi Murmu: రాష్ట్రపతి ముర్ముకు తప్పిన ప్రమాదం, ల్యాండింగ్ సమయంలో కుంగిన హెలిప్యాడ్
రాష్ట్రపతి ముర్ముకు తప్పిన ప్రమాదం, ల్యాండింగ్ సమయంలో కుంగిన హెలిప్యాడ్
Chandrababu UAE Tour Schedule: నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు.. విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు
నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు.. విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు
Prabhas Hanu Raghavapudi Movie: బెంగాలీలోనూ ప్రభాస్ - హను సినిమా రిలీజ్... రేపే టైటిల్ రివీల్!
బెంగాలీలోనూ ప్రభాస్ - హను సినిమా రిలీజ్... రేపే టైటిల్ రివీల్!
Most Expensive Car: తరతరాల సంపాదనా సరిపోదు! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఏది, దాని ధర ఎంత
తరతరాల సంపాదనా సరిపోదు! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఏది, దాని ధర ఎంత
Bigg Boss Telugu Today Promo : దొంగతనం చేస్తోన్న దివ్య, తనూజ, సుమన్ శెట్టి.. ప్రామిస్ చేయమని అడిగిన దివ్వెల మాధురి
దొంగతనం చేస్తోన్న దివ్య, తనూజ, సుమన్ శెట్టి.. ప్రామిస్ చేయమని అడిగిన దివ్వెల మాధురి
శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు: స్పర్శ దర్శనం, ప్రత్యేక మార్పుల గురించి మల్లన్న భక్తులకు ముఖ్య సూచనలు!
శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు: స్పర్శ దర్శనం, ప్రత్యేక మార్పుల గురించి మల్లన్న భక్తులకు ముఖ్య సూచనలు!
Stock Market Holiday: నేడు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా.. లేక హాలిడే ఇచ్చారా? ఈరోజు ఎందుకంత స్పెషల్
నేడు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా.. లేక హాలిడే ఇచ్చారా? ఈరోజు ఎందుకంత స్పెషల్
Ocean’s Deepest Secrets : మనిషికి తెలియని రహస్య ప్రపంచం.. అసలు సముద్రంలో ఏముంది? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు
మనిషికి తెలియని రహస్య ప్రపంచం.. అసలు సముద్రంలో ఏముంది? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు
Embed widget