అన్వేషించండి

Tim David Fined: ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్‌కు భారీ జరిమానా.. ముంబైతో మ్యాచ్‌లో అసభ్య ప్రవర్తన! 

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అసభ్యకరమైన సైగ చేసినందుకు ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్‌కు బీసీసీఐ మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించింది.

Tim David Fined for Obscene Gesture in RCB vs MI Match: ఐపీఎల్ లో గెలుపోటములు సహజమే అయినా, ఆటగాళ్ల ప్రవర్తన అనేది చాలా ముఖ్యం. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ప్లేయర్ టిమ్ డేవిడ్ హద్దులు దాటి ప్రవర్తించాడు. ఈ మ్యాచ్ లో అతను డకౌట్ అయినప్పటికీ, డగౌట్ లో కూర్చుని తన టీమ్ ను ఉత్సాహపరిచాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత అతను చేసిన ఒక అభ్యంతరకరమైన సైగ కెమెరాలకు చిక్కింది. గతంలో ముంబై ఇండియన్స్ కు ఆడిన డేవిడ్, ఇప్పుడు అదే టీమ్ పై గెలిచిన జోష్ లో తన ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు.

బీసీసీఐ కొరడా
టిమ్ డేవిడ్ ప్రవర్తన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.6ను ఉల్లంఘించినట్లు మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ నిర్ధారించారు. ఇది అశ్లీలమైన లేదా అభ్యంత‌ర‌కరమైన సైగగా పరిగణిస్తూ, అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జ‌రిమానా వేశారు. టిమ్ డేవిడ్ కూడా తన తప్పును ఒప్పుకోవడంతో వివాదం సర్దుమణిగింది. కానీ స్టార్ ఆటగాళ్లు ఇలాంటి పనులు చేయడం ఫ్యాన్స్ ను కాస్త నిరాశకు గురిచేసింది.

ఉత్కంఠ రేపిన మ్యాచ్..
ఈ మ్యాచ్ ఆద్యంతం నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 166 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సున్నాకే వెనుదిరగగా, దేవదత్ పడిక్కల్ 12 పరుగులకే అవుట్ అయ్యాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా 8 పరుగులకే వెనుదిరగడంతో ఆర్సీబీ 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కృనాల్ పాండ్యా ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. క్రాంప్స్ (కండరాలు పట్టేయడం) ఇబ్బంది పెడుతున్నా లెక్కచేయకుండా 46 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 73 పరుగులు చేసి జట్టును విజయానికి దగ్గరగా తీసుకెళ్లాడు.

భువీ మ్యాజిక్..
బౌలింగ్ లో 4 వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టిన భువనేశ్వర్ కుమార్, బ్యాటింగ్ లోనూ మెరిశాడు. ఆఖరి ఓవర్లో విజయానికి 15 పరుగులు కావాల్సిన సమయంలో భువీ ఒక సిక్సర్ బాది ఒత్తిడి తగ్గించాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా, ఆర్సీబీ ఆ పరుగులు తీసి థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ 4 వికెట్లతో చెలరేగినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో ఆర్సీబీ 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ లీగ్ నుంచి నిష్క్రమించింది.

కీలక మలుపులు..
మ్యాచ్ 18వ ఓవర్లో నమన్ ధీర్, తిలక్ వర్మ మధ్య జరిగిన మిస్ కమ్యూనికేషన్ వల్ల కృనాల్ పాండ్యా ఇచ్చిన క్యాచ్ మిస్ అయింది. ఆ ఛాన్స్ ను వాడుకున్న కృనాల్ వరుస సిక్సర్లతో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. చివర్లో టిమ్ డేవిడ్ సున్నాకే అవుట్ అయినా, భువీ ఫినిషింగ్ టచ్ తో బెంగళూరు గెలిచింది. ఓవరాల్ గా ఈ మ్యాచ్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా సాగింది. ఇటు ఆట పరంగా, అటు వివాదాల పరంగా ఈ సండే మ్యాచ్ క్రికెట్ లవర్స్ కు మంచి మసాలా అందించింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget