IPL Fastest Centuries: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్ క్రిస్ గేల్. అయితే 40 బంతుల్లోనే రెండు సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ మాత్రం వైభవ్ సూర్యవంశీనే.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ లీగ్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను చూపించింది. పరుగుల వరదకు అధిక అవకాశం ఉండటంలో ఐపీఎల్ అంటే బ్యాటర్ల గేమ్ అని అర్థం మారిపోయింది. బ్యాట్స్‌మెన్‌లు తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో రికార్డులు సృష్టిస్తున్నారు. IPLలో సెంచరీ చేయడం గొప్ప విషయంగా భావించేవారు. తరువాత మెరుపు సెంచరీలు చేస్తున్న కొద్దీ సాధారణ సెంచరీలు ఎవరికీ గుర్తుండటం లేదు. కేవలం ఐదారు ఓవర్ల బంతుల్లోనే సెంచరీలు చేసి కొందరు బ్యాటర్లు చరిత్ర సృష్టించారు. ఈ సీజన్లోనూ పలువురు బ్యాటర్లు సెంచరీలు బాదేశారు. అయితే IPL చరిత్రలో అత్యంత వేగవంతమైన 5 సెంచరీలు చేసిన ఆటగాళ్ల గురించి ఇక్కడ వివరాలు తెలుసుకోండి.
క్రిస్ గేల్ - 30 బంతుల్లో సెంచరీ (2013)
IPL చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ పేరిట ఉంది. 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతూ యూనివర్సల్ బాస్ గేల్ పూణే వారియర్స్ పై కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు. M. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ ఇన్నింగ్స్‌లో క్రిస్ గేల్ 66 బంతుల్లోనే 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. IPL చరిత్రలో ఇప్పటికీ ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. గేల్ ఈ తుఫాను ఇన్నింగ్స్‌లో 17 సిక్సర్లు, 13 ఫోర్లు ఉన్నాయి.
వైభవ్ సూర్యవంశీ .. 35 బంతుల్లో సెంచరీ
రాజస్తాన్ రాయల్స్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే శతకం (38 బంతుల్లో 101 పరుగులు) బాదడం ద్వారా టీ20 చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన సెంచరీ వీరుడిగా నిలిచాడు. 7 ఫోర్లు, 11 సిక్సర్లు బాదాడు. 2025లో గుజరాత్ టైటాన్స్‌పై 14 ఏళ్ల చిచ్చరపిడుగు ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ.
వైభవ్ సూర్యవంశీ .. 36 బంతుల్లో సెంచరీ
రాజస్తాన్ రాయల్స్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ 37 బంతుల్లో 103 పరుగులు (36 బంతుల్లోనే 100 పరుగులు) చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. ఇది ఐపీఎల్ చరిత్రలో మూడవ ఫాస్టెస్ట్ సెంచరీ. 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మీద 15 ఏళ్ల వైభవ్ ఈ మెరుపు సెంచరీ చేశాడు. 40 కంటే తక్కువ బంతుల్లో 2 ఐపీఎల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్.
యూసుఫ్ పఠాన్ - 37 బంతుల్లో సెంచరీ (2010)
రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్ 2010లో కేవలం 37 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. బ్రబోర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూసుఫ్ పఠాన్ 8 సిక్సర్లు, 9 ఫోర్లు కొట్టాడు. అతడి బ్యాటింగ్‌కు ముంబై బౌలర్లు పూర్తిగా ఒత్తిడికి గురయ్యారు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఉన్నప్పటికీ రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ గెలవలేదు. ఇప్పటికీ IPLలో అత్యంత గొప్ప ఇన్నింగ్స్‌లలో ఈ సెంచరీ ఒకటిగా నిలిచింది.
హెన్రిచ్ క్లాసెన్ 37 బంతుల్లో సెంచరీ (2025)
2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 37 బంతుల్లో సాధించిన సెంచరీ ఐపీఎల్ చరిత్రలో నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీ. క్లాసెన్ కెరీర్‌లో అత్యంత వేగవంతమైన శతకం ఇది. కేకేఆర్ మీద 9 సిక్సర్లు, 7 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఇది లీగ్ చరిత్రలోనే నాల్గవ అత్యంత వేగవంతమైన శతకంగా యూసుఫ్ పఠాన్‌తో కలిసి సంయుక్తంగా నిలిచాడు. గతంలో 2023లో క్లాసెన్ 51 బంతుల్లో చేసిన సెంచరీ రికార్డును మెరుగుపరుచుకున్నాడు.
డేవిడ్ మిల్లర్ - 38 బంతుల్లో సెంచరీ (2013)
దక్షిణాఫ్రికాకు చెందిన బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ IPL 2013లో కింగ్స్ XI పంజాబ్ తరపున ఆడుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై కేవలం 38 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొహాలీలోని IS బింద్రా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మిల్లర్ 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిల్లర్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ వల్ల పంజాబ్ 191 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది.
Before You Go
Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
ట్రెండింగ్ వార్తలు




















