IPL 2026 లీగ్ స్టేజ్ మే 24 తో ముగుస్తుంది. దీని తర్వాత ప్లేఆఫ్స్ ప్రారంభమవుతాయి.
IPL 2026 Playoffs Scenario: రసవత్తరంగా మారిన ఐపీఎల్ ఫ్లే ఆఫ్ రేసు.. 4 స్థానాల కోసం 8 జట్ల మధ్య పోటీ
IPL 2026 Playoff Scenarios Explained: ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నుండి నిష్క్రమించాయి. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడానికి 8 జట్లు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

IPL 2026 లీగ్ స్టేజ్ మే 24తో ముగియనుంది. దాదాపు 2 వారాల ముందే ప్లేఆఫ్స్ నుంచి 2 జట్లు తప్పుకున్నాయి. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ రేసు నుండి వైదొలిగిన మొదటి రెండు జట్లుగా నిలిచాయి. మొదటి నాలుగు స్థానాల కోసం ఇప్పుడు 8 జట్ల మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది.
ప్లేఆఫ్స్ రేసుకు ముందు పాయింట్స్ టేబుల్ తెలుసుకోండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), గుజరాత్ టైటాన్స్.. ఈ మూడు జట్లు 14 పాయింట్లతో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ 12 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో కొనసాగుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వరుసగా ఏడు మరియు ఎనిమిదో స్థానాల్లో ఉన్నాయి.
8 జట్ల మధ్య ప్లేఆఫ్స్ పోరు
RCB- 11 మ్యాచ్‌ల తర్వాత RCBకి 14 పాయింట్లు ఉన్నాయి. ఇంకా 3 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. బెంగళూరు గరిష్టంగా 20 పాయింట్లకు చేరుకోవచ్చు. తదుపరి 3 మ్యాచ్‌లలో ఒకటి గెలిచినా బెంగళూరు ప్లేఆఫ్స్ స్థానం దాదాపు ఖాయమవుతుంది. అయితే బెంగళూరు తన నెట్ రన్ రేట్ ఇలాగే ఉండేలా చూసుకోవాలి.
SRH- ఆర్‌సీబీ తరహాలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా గరిష్టంగా 20 పాయింట్లు సాధించే ఛాన్స్ ఉంది. +0.737 నెట్ రన్ రేట్‌తో ఉన్న హైదరాబాద్ మరో మ్యాచ్ గెలిస్తే, వారి ప్లేఆఫ్ క్వాలిఫికేషన్ కూడా దాదాపు ఖాయమైనట్లే.
GT- వరుసగా 4 మ్యాచ్‌లు గెలిచి గుజరాత్ ప్లేఆఫ్ క్వాలిఫికేషన్‌కు చాలా దగ్గరగా వచ్చింది. గుజరాత్ తన మూడు మ్యాచ్‌లను గెలిచి టాప్-2లో నిలిచే అవకాశం కూడా ఉంది. గుజరాత్‌కు ప్రస్తుతం ఉన్న +0.228 నెట్ రన్ రేట్‌తో కొంత సమస్య ఉంది. తరువాత 3 మ్యాచ్‌లలో 2 గెలిస్తే గుజరాత్ ఇతరులపై ఆధారపడకుండానే ప్లేఆఫ్స్‌కు చేరుకోవచ్చు.
PBKS- పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లు కలిగి ఉంది. తదుపరి 3 మ్యాచ్‌లూ గెలిస్తే పంజాబ్ ప్లేఆఫ్ టికెట్ సాధించడమే కాకుండా పట్టికలో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంటుంది. తదుపరి 3 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు పంజాబ్‌కు టాప్-4లో చోటు కల్పిస్తాయి. వరుసగా నాలుగో మ్యాచులో పంజాబ్ ఓటమిపాలై ప్లే ఆఫ్ ఆవకాశాన్ని మరింత కష్టం చేసుకుంటుంది.
CSK- గత 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు నమోదు చేయడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ రేసులోకి వచ్చింది. సీఎస్కేకు కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందులో రెండింటిలో విజయం సాధిస్తే CSK సులభంగా ప్లేఆఫ్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంటుంది.
RR- రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి కూడా చెన్నై సూపర్ కింగ్స్ లాగే ఉంది. కానీ వారి నెట్ రన్ రేట్ +0.082గా ఉంది. ఇది ముందు వారికి ఇబ్బందిగా మారవచ్చు. రాజస్థాన్ మిగిలిన 3 మ్యాచ్‌లూ గెలిస్తే సులభంగా ప్లేఆఫ్స్‌కు వెళ్లవచ్చు.
DC- ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కాస్త మెరుగైంది. 12 మ్యాచ్‌ల్లో వారి ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. మిగిలిన 2 మ్యాచ్‌లు గెలిచినా వారి గరిష్ట పాయింట్లు 14 మాత్రమే అవుతాయి. మరో ఓటమి ఎదురైతే ఢిల్లీ టోర్నీ నుండి ఎలిమినేషన్ తప్పదు. కాబట్టి ఢిల్లీ 2 మ్యాచ్‌లూ గెలవడమే కాకుండా, నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవడం అత్యవసరం.
KKR- కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రస్తుతం 9 పాయింట్లు ఉన్నాయి. 4 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. తదుపరి నాలుగు మ్యాచ్‌లూ గెలిస్తే వారి మొత్తం పాయింట్లు 17 అవుతాయి, ఇది ప్లేఆఫ్ క్వాలిఫికేషన్‌కు సరిపోతుంది. కానీ 4 మ్యాచ్‌ల్లో మూడు గెలిచినా కేకేఆర్ ప్లేఆఫ్ స్థానం ఖాయం కాదు.
మరిన్ని ఆసక్తికర స్పోర్ట్స్ వార్తల కోసం క్లిక్ చేయండి
Before You Go
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Frequently Asked Questions
IPL 2026 లీగ్ స్టేజ్ ఎప్పుడు ముగుస్తుంది?
ఏ జట్లు ప్లేఆఫ్స్ రేసు నుండి వైదొలిగాయి?
ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ రేసు నుండి వైదొలిగిన మొదటి రెండు జట్లు. మిగిలిన 8 జట్లు పోటీలో ఉన్నాయి.
ప్లేఆఫ్స్ అర్హత సాధించడానికి RCB కి ఏమి అవసరం?
RCB కి ఇంకా 3 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. వాటిలో ఒకటి గెలిస్తే ప్లేఆఫ్ స్థానం దాదాపు ఖాయమవుతుంది. నెట్ రన్ రేట్ కూడా ముఖ్యమే.
SRH ప్లేఆఫ్స్ అవకాశాలు ఏమిటి?
SRH కూడా గరిష్టంగా 20 పాయింట్లు సాధించే అవకాశం ఉంది. మరో మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్ క్వాలిఫికేషన్ దాదాపు ఖాయమైనట్లే.
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే ఏమి చేయాలి?
ఢిల్లీ మిగిలిన 2 మ్యాచ్ లు గెలవాలి, లేకపోతే టోర్నీ నుండి ఎలిమినేట్ అవుతారు. నెట్ రన్ రేట్ మెరుగుపరచుకోవడం కూడా అవసరం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















