అన్వేషించండి

Netherlands vs South Africa: హ్యాట్రిక్‌ విజయాలపై ప్రొటీస్‌ కన్ను- నేడు నెదర్లాండ్‌తో మ్యాచ్

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మరో విజయంపై కన్నేసింది. ధర్మశాల వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌ దిశగా మరో అడుగు ముందుకేయాలని భావిస్తోంది.

ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపు మీదున్న దక్షిణాఫ్రికా మరో విజయంపై కన్నేసింది. ధర్మశాల వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌ దిశగా మరో అడుగు ముందుకేయాలని భావిస్తోంది. భీకర ఫామ్‌లో ఉన్న బవుమా సేనకు.. గట్టిపోటీ ఇవ్వాలని నెదర్లాండ్స్‌ పట్టుదలగా ఉంది. కానీ డికాక్‌ వరుస సెంచరీలతో ఊపు మీదున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో ముగ్గురు దక్షిణాఫ్రికా బ్యాటర్లు సెంచరీలు చేశారు. ఈ పరిస్థితుల్లో అన్ని విభాగాల్లో బలంగా ఉన్న ప్రొటీస్‌ను నెదర్లాండ్స్‌ అడ్డుకోవడం అంత తేలికేమీ కాదు. కానీ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు అఫ్ఘానిస్థాన్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనూ అలాంటి ప్రదర్శనే చేసి సఫారీలకు షాక్‌ ఇవ్వాలని నెదర్లాండ్స్ భావిస్తోంది. గతంలో బలహీనమైన జట్లతో ఓడిపోయి ప్రపంచ కప్‌ నుంచి నిష్క్రమించిన చరిత్ర దక్షిణాఫ్రికాకు ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌ను తాము తేలిగ్గా తీసుకోవడం లేదని ప్రొటీస్‌ జట్టు కెప్టెన్‌ బవుమా ఇప్పటికే వెల్లడించాడు. కాబట్టి దక్షిణాఫ్రికా భారీ విజయంపై కన్నేసింది.
 
ఈ ఏడాదిలో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌ రెండు వన్డేలు ఆడాయి. ఈ రెండు వన్డేల్లోనూ ప్రొటీస్‌ విజయం సాధించింది. రెండుసార్లు ఏకపక్ష విజయాలే సాధించింది. కానీ తమదైన రోజున ఎంత పెద్ద జట్టునైనా ఓడించే సత్తా నెదర్లాండ్స్‌కు ఉంది. కాబట్టి దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌ను అంత తేలిగ్గా తీసుకోదు. గత అయిదు వన్డేల్లో దక్షిణాఫ్రికా విజయాలు సాధించింది. ప్రతిమ్యాచ్‌లోనూ మొదట బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 300 కంటే ఎక్కువ పరుగులు చేసింది. రెండుసార్లు 400 పరుగుల మార్క్‌ను కూడా దాటింది. ఈ ప్రపంచకప్‌లో సఫారీ జట్టుకు బలమైన బ్యాటింగ్ లైనప్‌ ఉంది. 2023 ప్రారంభం నుంచి సఫారీ పది మంది బ్యాటర్లు 50 కంటే ఎక్కువ సగటుతో పరుగులు చేస్తున్నారు. టెంబా బావుమా, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. క్వింటన్ డి కాక్ కూడా భీకర ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచకప్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ సెంచరీలు చేసి ఊపు మీదున్నాడు. డికాక్‌ మరోసారి చెలరేగితే నెదర్లాండ్స్‌కు చుక్కలు కనపడడం ఖాయం. 2021 నుంచి డికాక్‌ పేస్, స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తూ బౌలర్లను ఒత్తిడిలో ఉంచుతున్నాడు. ఇది పవర్‌ప్లేలో మాత్రమే కాకుండా మిడిల్ ఓవర్లలోనూ ధాటిగా  పరుగులు సాధిస్తున్నాడు. 
 
ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయినా నెదర్లాండ్స్‌ మంచి పోరాటాన్ని ప్రదర్శించింది. బాస్ డి లీడే బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. స్కాట్లాండ్‌పై ఐదు వికెట్లు తీసిన డి లీడే నెదర్లాండ్స్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. లీడే మరోసారి మెరవాలని నెదర్లాండ్స్‌ భావిస్తోంది. లీడే పాకిస్తాన్‌పై 67 పరుగులు చేశాడు. 
 
దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్ డి కాక్, టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్,  ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహారాజ్ , లుంగీ ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ, జెరాల్డ్ కోయెట్జీ 
 
నెదర్లాండ్స్ జట్టు: విక్రమ్‌జిత్ సింగ్,  మాక్స్ ఓ'డౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే,  తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్ ), సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్,  రోలోఫ్ వాన్ డెర్ లోగాన్‌వాన్, బీక్, ర్యాన్ క్లైన్, ఆర్యన్ దత్,  పాల్ వాన్ మీకెరెన్

టాప్ హెడ్ లైన్స్

Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
Indian Spin Magic, SL Allout: భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
Mohammad Kaif Slams Rishabh Pant: పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget