అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

AUS Vs AFG: కళ్లన్నీ అఫ్ఘానిస్థాన్‌పైనే , రేపే ఆస్ట్రేలియాతో మ్యాచ్‌

ODI World Cup 2023: టీమిండియాతోపాటు  దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌ చేరుకున్నాయి. ఇక మిగిలినవి రెండు స్థానాలు. రెండు స్థానాల కోసం నాలుగు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి.

భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే టీమిండియాతోపాటు  దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌ చేరుకున్నాయి. ఇక మిగిలినవి రెండు స్థానాలు. ఈ రెండు స్థానాల కోసం నాలుగు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి.  ఇప్పటికే దాదాపుగా సెమీస్‌ చేసుకున్న ఆస్ట్రేలియా... అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ విజయం సాధించి ఎలాంటి సమీకరణాలపై ఆధారపడకుండా సెమీస్‌ చేరాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఈ ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న అఫ్గాన్‌ కూడా సెమీస్‌పై కన్నేసింది. ఇప్పటికే మాజీ ప్రపంచ ఛాంపియన్లు ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌, శ్రీలంకలకు షాక్‌ ఇచ్చిన అఫ్గాన్‌... రేపు జరగనున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు షాక్ ఇవ్వాలని చూస్తోంది. 
 
ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి తర్వాత కివీస్‌ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన అఫ్గాన్‌ పుంజుకున్న తీరు అద్భుతం. వరుసగా పాకిస్థాన్‌, శ్రీలంక, నెదర్లాండ్స్‌ను మట్టికరిపించి సెమీస్‌ రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం 7 మ్యాచుల్లో నాలుగు విజయాలు, మూడు ఓటములతో 8 పాయింట్లను సాధించింది. న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌తో పోలిస్తే సెమీస్‌ అవకాశాలు అఫ్గాన్‌కే ఎక్కువగా ఉన్నాయి. కానీ, తన చివరి రెండు మ్యాచ్‌ల్లో బలమైన జట్లతో తలపడాల్సి ఉండటమే అఫ్గాన్‌కు కాస్త ఇబ్బందికరం. రేపు కీలకమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను  ఓడిస్తే అఫ్గాన్‌కు అవకాశాలు ఉంటాయి. దీంతో  ఇప్పటికే సంచలన విజయాలు సాధించిన అఫ్గాన్‌... ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ అలాంటి ప్రదర్శననే పునరావృతం చేసి సెమీస్‌ చేరాలని పట్టుదలగా ఉంది.  బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉన్న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆసిస్‌-అఫ్గాన్‌ తలపడనున్నాయి. ఆఫ్ఘానిస్తాన్ స్పిన్‌ను బలమైన బ్యాటింగ్ లైనప్‌ ఉన్న ఆస్ట్రేలియా ఎలా ఎదుర్కొంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ ప్రపంచకప్‌లో లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా కూడా ఏడు మ్యాచ్‌లలో 19 వికెట్లు తీసి అద్భుతంగా రాణిస్తున్నాడు.
 
ఆస్ట్రేలియా సెమీఫైనల్‌ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో ఒక్క విజయం చాలు. ఆస్ట్రేలియాను ఇప్పటికీ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌ ఆందోళనకు గురిచేస్తోంది. కానీ వరుసగా ఐదు విజయాలు సాధించడంతో కంగారులు ఆత్మవిశ్వాసంతో  ఉన్నారు. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్‌ కలిసి ఈ ఏడు మ్యాచ్‌లలో  కేవలం మూడు అర్ధసెంచరీలు చేశారు. ఇదే కంగారులను కంగారు పెడుతోంది. అఫ్గానిస్థాన్‌పై భారీ ఇన్నింగ్స్‌లు ఆడి సెమీస్‌కు ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని లబుషేన్‌, స్మిత్‌ చూస్తున్నారు. ఇంగ్లండ్‌పై 83 బంతుల్లో 71 పరుగులు చేసి లబుషేన్‌ పర్వాలేదనిపించాడు. డేవిడ్ వార్నర్ 7 మ్యాచ్‌ల్లో 61.14 సగటుతో 428 పరుగులు చేసి భీకర ఫామ్‌లో ఉండడం ఆసిస్‌కు కలిసి రానుంది. ట్రావిస్ హెడ్ కూడా ఇప్పటికే ఒక సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. వీరిద్దరూ నిలబడితే అఫ్గాన్‌కు తిప్పలు తప్పవు. మిచెల్ మార్ష్ తిరిగి జట్టులో చేరడంతో కంగారుల బ్యాటింగ్‌ మరింత బలోపేతం అయింది. 
 
గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ఆఫ్ఘాన్‌ సెమీఫైనల్ కలను సజీవంగా ఉంచుకుంది. కానీ ఆస్ట్రేలియాను అధిగమించడం అఫ్గాన్‌కు పెద్ద సవాలే. కానీ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (282 పరుగులు), రహమత్ షా (264), అజ్మతుల్లా ఒమ్రాజాయ్ (234), రహ్మానుల్లా గుర్బాజ్ (234), ఇబ్రహీం జద్రాన్ (232) బ్యాట్‌తో నిలకడగా రాణిస్తున్నారు. రషీద్ ఖాన్ 7 వికెట్లు తీసి పర్వాలేదనిపిస్తున్నాడు. 
 
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్‌), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, అష్టన్ అగర్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్ ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.
 
 
ఆఫ్ఘానిస్తాన్ జట్టు: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమ్రాజాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మద్, ఫ్ఫజ్ ఉర్ రహ్మద్ , అబ్దుల్ రెహమాన్, నవీన్ ఉల్ హక్.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
IPL Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కొత్త కెప్టెన్!
ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్ - లక్నో ఫ్రాంచైజీకి కొత్త కెప్టెన్!
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Embed widget