అన్వేషించండి

AUS Vs PAK: అడిలైడ్‌లో ఆస్ట్రేలియాని ఎగరేసిన పాకిస్తాన్ - చిత్తుగా ఓడిన కంగారూలు!

Australia Vs Pakistan: ఆస్ట్రేలియాకు పాకిస్తాన్ భారీ షాక్ ఇచ్చింది. అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ జట్టు... ఆస్ట్రేలియాను ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది.

Pakistan Beats Australia: పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాకు పెద్ద షాక్ ఇచ్చింది. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. మూడు వన్డేలో సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్... ఆస్ట్రేలియాను ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా హరీస్ రౌఫ్‌కే దక్కింది. అనంతరం పాకిస్తాన్ 26.3 ఓవర్లలో వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు సయీమ్ ఆయూబ్ (82: 71 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు), అబ్దుల్లా షఫీక్ (64 నాటౌట్: 69 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు.

కుప్పకూలిన ఆస్ట్రేలియా...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (13: 10 బంతుల్లో, మూడు ఫోర్లు), మాథ్యూ షార్ట్ (19: 15 బంతుల్లో, మూడు ఫోర్లు) వేగంగా ఆడే ప్రయత్నంలో ఆలౌట్ అయ్యారు. వీరిద్దరినీ షహీన్ అఫ్రిది పెవిలియన్ బాట పట్టించాడు. మూడో వికెట్‌కు జోష్ ఇంగ్లిస్ (18: 25 బంతుల్లో, రెండు ఫోర్లు), స్టీవ్ స్మిత్ (35: 48 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) 38 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే ప్రయత్నం చేశారు.

జోస్ ఇంగ్లిస్ అవుటయ్యాక ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఎవరూ సరిగ్గా నిలబడలేదు. స్టీవ్ స్మిత్ మినహా జట్టులో ఎవరూ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. ఆస్ట్రేలియా మిడిలార్డర్‌ను హరీస్ రౌఫ్ కుప్పకూల్చాడు. పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. షహీన్ అఫ్రిది మూడు వికెట్లు తీసుకున్నాడు. నసీం షా, హస్నెయిన్‌లకు చెరో వికెట్ దక్కింది.

Also Read: కెప్టెన్‌తో గొడవ- మ్యాచ్ మధ్యలోనే కోపంతో వెళ్లిపోయిన విండీస్‌ బౌలర్‌

వావ్ అనిపించిన ఓపెనర్లు
పాకిస్తాన్ ఓపెనర్లు సయీమ్ ఆయూబ్ (82: 71 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు), అబ్దుల్లా షఫీక్ (64: 69 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వీరు చాలా వేగంగా ఆడారు. ముఖ్యంగా సయీమ్ ఆయూబ్ సిక్సర్లతో చెలరేగాడు. వీరు మొదటి వికెట్‌కు 20.2 ఓవర్లలోనే 137 పరుగులు జోడించారు. అనంతరం ఆయూబ్ అవుటైనా బాబర్ ఆజమ్‌తో (15 నాటౌట్: 20 బంతుల్లో, ఒక సిక్సర్) కలిసి అబ్దుల్లా షఫీక్ మ్యాచ్‌ను ముగించారు.

పాకిస్తాన్ తుది జట్టు
అబ్దుల్లా షఫీక్, సైమ్ అయూబ్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), కమ్రాన్ గులామ్, అఘా సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్

ఆస్ట్రేలియా తుది జట్టు
మాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, స్టీవెన్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆరోన్ హార్డీ, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

Also Read: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget