AFG vs AUS: ఓడినా... గెలుపు అఫ్గాన్‌దే , ప్రధాన తేడా మ్యాక్స్‌వెల్ అంతే
ODI World Cup 2023: కంగారులతో మ్యాచ్‌లో అఫ్గాన్ అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకుంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే మాజీ ప్రపంచ ఛాంపియన్లు ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్థాన్ జట్లను మట్టికరిపించింది.
ODI World Cup 2023: ఆస్ట్రేలియా(Australia) విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్( Maxwells) తుపాను ఇన్నింగ్స్‌లో అఫ్గాన్ పోరాటం కొట్టుకుపోయింది కానీ..కంగారులతో మ్యాచ్‌లో అఫ్గాన్(Afghanistan) అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకుంది. ఈ ప్రపంచకప్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్లు ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్థాన్ జట్లను మట్టికరిపించి.. ఆస్ట్రేలియాను కూడా ఓడించినంత పని చేసింది. అనుభవలేమితో గెలవాల్సిన మ్యాచ్‌లో అఫ్గాన్ ఓడిపోయింది కానీ... రషీద్(Rashid)కు తోడుగా మరో బౌలర్ ఉండి ఉన్నా మ్యాక్స్‌వెల్ క్యాచ్‌ను ముజీబ్ అందుకున్నా ఫలితం వేరేలా ఉండేదే. అసలు ఆస్ట్రేలియా అప్గాన్‌తో మ్యాచ్ ఆడుతుంటే ఇంత ఉత్కంఠగా క్రికెట్ ప్రపంచం చూస్తుందని ఎవరైనా కల కన్నారా... ఆ విషయంలో అఫ్గాన్‌ను ఎంత పొగిడినా తక్కువే. పక్కా ప్రణాళికతో ఈ ప్రపంచకప్‌లో అగ్ర జట్లకు షాక్ ఇచ్చిన అప్గాన్... కంగారులను కగాంరు పెట్టంది. ఈ మ్యాచ్‌లో 80 శాతం ఆటంతా అఫ్గాన్‌దే. ప్రపంచకప్ చరిత్రలో తొలి సెంచరీ చేసిన అప్గాన్ ఆటగాడిగా ఇబ్రహీం జద్రాన్ చరిత్ర సృష్టించిన దగ్గరి నుంచి... మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌కు రాకముందు వరకూ అఫ్గానిస్థాన్ ఆటతీరు అగ్ర జట్లకు ఏ మాత్రం తీసిపోదు. ఆరంభంలోనే కంగారు బ్యాటర్లను పెవిలియన్‌కు పంపిన అఫ్గాన్ బౌలర్లు.. మ్యాచ్‌ను కీలక మలుపుతిప్పారు. కానీ మ్యాక్స్‌వెల్ అద్భుత పోరాటంతో కంగారులు గెలిచారు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్‌గా అడుగుపెట్టిన అఫ్ఘానిస్థాన్ సంచలనాలతో క్రికెట్ అభిమానుల మన్ననలు పొందుతోంది. ఎవరూ ఊహించని రీతిలో సెమీస్ రేసులోకి దూసుకొచ్చి అగ్ర జట్లకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆస్ట్రేలియాతో పరాజయం తర్వాత కూడా అఫ్గాన్ ఇంకా సెమీస్ రేసులో ఉందంటే ఈ ప్రపంచకప్‌లో అఫ్గాన్ సృష్టించిన సంచలనాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. కంగారులతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క మ్యాక్స్‌వెల్ మినహా మ్యాచ్ అంతా అఫ్గాన్ ఆధిపత్యమే కొనసాగింది. మొదట బ్యాట్‌తో ఆసిస్ ముందు కఠిన లక్ష్యాన్ని ఉంచిన అఫ్గాన్... 91 పరుగులకే ఏడు వికెట్లు పడగొట్టి కంగారులకు.. ఓటమి కంగారును చవిచూపించింది. మ్యాక్స్‌వెల్ మినహా మరే ఆస్ట్రేలియా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ కూడా అఫ్గాన్ బౌలర్ల ముందు నిలబడలేకపోయారు.
అయితే ఇది పూర్తిగా ఆస్ట్రేలియా విజయమని చెప్పలేం. ఈ గెలుపు మ్యాక్స్‌వెల్‌ది. మ్యాక్స్‌వెల్ సునామీ ఇన్నింగ్స్‌లో కంగారుల లోపాలు కనపడలేదు కానీ ఈ మ్యాచ్‌లో కంగారులు గెలిచారంటే కేవలం మ్యాక్స్‌వెల్ వల్లే. ఎందుకంటే మ్యాక్సీ తప్ప మరే కంగారు బ్యాటర్ కూడా ఈ మ్యాచ్‌లో రాణించలేదు. అఫ్గాన్ బౌలర్లు.. దాదాపుగా అందరి బ్యాటర్లను కట్టడి చేశారు. ఈ మ్యాచ్‌లో హీరో తప్పకుండా మ్యాక్స్‌వెల్. అనుభవం లేకపోవడం కూడా అప్గాన్ విజయావకాశాలను దెబ్బతీసింది. మ్యాక్స్‌వెల్ విధ్వంసం సృష్టిస్తున్నప్పుడు అనుభవలేమీ కొట్టుచ్చినట్లు తెలిసింది. మ్యాక్స్‌వెల్ విధ్వంసం కూడా చాలా క్రమబద్దంగా సాగింది. స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌ను ఆచితూచి ఆడిన మ్యాక్స్‌వెల్.. మిగిలిన బౌలర్లను లక్ష్యంగా చేసుకున్నారు. రషీద్ ఖాన్ 10 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. మిగిలిన బౌలర్లలో ఒక్కరైనా రషీద్‌కు తోడుగా కొంచెం ప్రభావవంతంగా బౌలింగ్ చేసుంటే మ్యాచ్ అఫ్గాన్ వైపు మొగ్గేదమో... ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైన ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నమెంట్‌లో అఫ్గాన్ పోరాటం మాత్రం అసాధారణం. అఫ్ఘానిస్థాన్ అద్భుత ప్రదర్శన న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లను కంగారు పెడుతోందంటే ఆ జట్టు ప్రదర్శన ఎలా సాగుతుందో చెప్పవచ్చు. ఇప్పటికీ అఫ్గాన్‌కు సెమీస్ అవకాశాలు ఉన్నాయి అంటేనే అఫ్గాన్ ఆటతీరు అద్భుతమని చెప్పక తప్పదు.