(Source: ECI/ABP News/ABP Majha)
IND VS PAK: కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్ - పాక్‌పై సూపర్ 50 - ఎంత కొట్టారంటే?
IND VS PAK first innings highlightsఆసియా కప్ సూపర్- 4 లో భారత్- పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
ఆసియా కప్ సూపర్- 4లో భారత్- పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (60: 44 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థశతకంతో రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో షాదబ్ ఖాన్ 2 వికెట్లతో రాణించాడు.
అదిరే ఆరంభం
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్, రాహుల్ అదిరే ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మొదటి మ్యాచులో ఇబ్బందిపెట్టిన పాక్ యువ బౌలర్ నసీమ్ షా బౌలింగ్ ను ఆటాడుకున్నారు. అయితే రౌఫ్ వేసిన ఆరో ఓవర్లో భారీ షాట్ కొట్టబోయి రోహిత్ (28) ఔటయ్యాడు. ఆ వెంటనే రాహుల్ (28) కూాడా స్పిన్నర్ షాదాబ్ ఖాన్ వేసిన తొలి బంతికే క్యాచ్ ఔటయ్యాడు.
వెంటవెంటనే వికెట్లు
అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్య తొలి బంతినే బౌండరీకి తరలించాడు. అయితే స్పిన్నర్లు బౌలింగ్ కి వచ్చాక స్కోరు వేగం తగ్గింది. కోహ్లీ అడపాదడపా బౌండరీలు కొడుతున్నా అనుకున్నంత వేగంగా పరుగులు రాలేదు. పది ఓవర్లు ముగిసేసరికి సూర్యకుమార్(13) వికెట్ కోల్పోయి 93 పరుగులు చేసింది. కోహ్లీకి జతకలిసిన పంత్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన హార్దిక్ 2 బంతులు మాత్రమే ఆడి డకౌట్ గా వెనుదిరిగాడు.
కోహ్లీ అర్థశతకం
అయితే ఓవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో కోహ్లీ నిలకడగా ఆడి స్కోరు వేగం మందగించకుండా చూశాడు. దీపక్ హుడాతో కలిసి అప్పుడప్పుడూ బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. 18వ ఓవర్లో సిక్స్ తో అర్థశతకం పూర్తిచేసుకున్నాడు. అయితే అదే ఓవర్లో హుడా(16) వికెట్ ను కోల్పోయింది. చివరి ఓవర్లో కోహ్లీ(60) ఔటయ్యాడు. రవి బిష్ణోయ్ చివరి 2 బంతుల్లో 2 బౌండరీలు కొట్టాడు.
Innings Break!
— BCCI (@BCCI) September 4, 2022
54-run partnership from the openers and a well made 60 from Virat Kohli propels #TeamIndia to a total of 181/7 on the board.
Scorecard - https://t.co/Yn2xZGTWHT #INDvPAK #AsiaCup2022 pic.twitter.com/0gyWwHHIv1