అన్వేషించండి

Kuldeep ODI Record: లంకను కూల్చిన కుల్‌దీప్ - చీఫ్ సెలక్టర్ రికార్డ్ బ్రేక్

భారత వెటరన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ మరోసారి మెరిశాడు. పాకిస్తాన్‌పై ఐదు వికెట్లు తీసిన ఈ చైనామన్ స్పిన్నర్ లంకతో మ్యాచ్‌లో కూడా నాలుగు వికెట్లతో చెలరేగాడు.

Kuldeep ODI Record: కమ్‌బ్యాక్‌లో  అత్యద్భుత ప్రదర్శనలతో రెచ్చిపోతున్న టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఆకాశమే  హద్దుగా చెలరేగుతున్నాడు.  ఆసియా కప్‌తో పాటు ప్రపంచకప్ జట్టులోనూ చోటు దక్కించుకున్న కుల్‌‌దీప్..   పాకిస్తాన్, శ్రీలంకలతో జరిగిన మ్యాచ్‌‌లలో  మెరుగైన ప్రదర్శనలు చేశాడు.   పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో  పిచ్  స్పిన్‌కు పెద్దగా అనుకూలించకపోయినా  ఐదువికెట్లతో సత్తా చాటిన  అతడు.. తాజాగా లంకతోనూ  నాలుగు వికెట్లు తీసి  భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా  కుల్‌దీప్ పలు కీలక రికార్డులను బ్రేక్ చేశాడు. అందులో  ఒకటి  ఆలిండియా  సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ పేరు మీదే ఉన్నది కావడం గమనార్హం. 

లంకతో మ్యాచ్‌లో పతిరాన వికెట్ తీయడం ద్వారా కుల్‌దీప్ వన్డేలలో 150 వికెట్ల ఘనతను సాధించాడు.  తద్వారా  అతడు భారత్ తరఫున వన్డేలలో అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు.  మొదటి స్థానంలో మహ్మద్ షమీ ఉన్నాడు.  భారత్ తరఫున స్పిన్నర్ల  పరంగా చూసుకుంటే ఈ ఘనత అందుకున్న తొలి బౌలర్ కుల్దీపే కావడం గమానర్హం. టెస్టులలో 600 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే వంటి దిగ్గజానికి కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు.  ఆ రికార్డుల జాబితాను ఇక్కడ చూద్దాం. 

భారత్ తరఫున వన్డేలలో వేగంగా 150 వికెట్లు సాధించిన బౌలర్లు.. (టాప్-5) 

- మహ్మద్ షమీ  : 80 మ్యాచ్‌లలో 150 వికెట్లు
- కుల్‌దీప్ యాదవ్ :  88
- అజిత్ అగార్కర్ : 97 
- జహీర్ ఖాన్ : 103 
- అనిల్ కుంబ్లే : 106 

అంతర్జాతీయ స్థాయిలో ఈ ఘనత అందుకున్న స్పిన్నర్లు.. 

- సక్లయిన్ ముస్తాక్ : 78 మ్యాచ్‌లలో 150 వికెట్లు
- రషీద్ ఖాన్ : 80
- అజంతా మెండిస్ : 84
- కుల్‌దీప్ యాదవ్ - 88 
- ఇమ్రాన్ తాహిర్ - 89 

జడేజాకూ ఓ రికార్డు.. 

కుల్‌దీప్‌తో పాటు  రవీంద్ర జడేజా కూడా ఈ మ్యాచ్‌లో ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. లంకతో మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన జడ్డూ.. ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో  ఇర్ఫాన్ పఠాన్‌ను అధిగమించాడు. 

 

ఆసియా కప్ (వన్డేలు)లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు : 

- రవీంద్ర జడేజా : 23 వికెట్లు 
- ఇర్ఫాన్ పఠాన్ : 22 
- సచిన్ టెండూల్కర్ : 17 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget