అన్వేషించండి

Asia Cup 2023, BAN vs SL: బంగ్లాకు మరో డూ ఆర్ డై - ఓడితే అంతే సంగతులు - రికార్డు విజయంపై కన్నేసిన లంక

ఆసియా కప్ - 2023లో భాగంగా మూడు రోజుల క్రితమే మొదలైన సూపర్ - 4 దశలో నేడు బంగ్లాదేశ్ మరోసారి కీలక మ్యాచ్ ఆడనుంది. ఇవాళ ఆ జట్టు శ్రీలంకను ఢీకొననుంది.

Asia Cup 2023, BAN vs SL: ఆసియా కప్ - 2023 గ్రూప్ స్టేజ్‌లో తొలి మ్యాచ్‌లో ఓడినా అఫ్గానిస్తాన్‌తో తదుపరి మ్యాచ్‌లో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన బంగ్లాదేశ్.. నేడు  కూడా అదే  మ్యాజిక్ కోసం వేచి చూస్తోంది.   అఫ్గానిస్తాన్‌ను ఓడించడంతో  సూపర్ - 4కు అర్హత సాధించిన  బంగ్లాదేశ్.. నేడు కూడా అటువంటి డూ ఆర్ డై మ్యాచ్‌లో శ్రీలంకను ఢీకొననుంది. సూపర్- 4లో భాగంగా తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్.. నేడు శ్రీలంకతో జరిగే పోరులో తప్పక గెలవాల్సిన పరిస్థితి.  మరోవైపు లంక ఈ మ్యాచ్‌లో గెలిస్తే వన్డేలలో ఆ జట్టు పేరిట ఓ అరుదైన రికార్డు సొంతమవుతుంది.  ఆ వివరాలు ఇక్కడ చూద్దాం. 

బంగ్లా పులులకు సవాల్.. 

సూపర్-4లో  ఒక్క జట్టు.. ప్రత్యర్థి (3) జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాలి. గ్రూప్ టాపర్‌గా ఉన్న జట్లు ఫైనల్ ఆడతాయి. ఈ లెక్కన  ఇదివరకే పాకిస్తాన్‌తో ఓడిన బంగ్లాదేశ్.. నేడు శ్రీలంకతో మ్యాచ్‌లో కూడా ఓడితే ఇక అంతే సంగతులు.  భారత్‌తో మ్యాచ్‌లో గెలిచినా అప్పటికీ  సమీకరణాలు, నెట్ రన్ రేట్ వంటి చాలా విషయాలు ఇమిడిఉంటాయి. అలా కాకూడదనుకుంటే మాత్రం  లంకను ఓడించి తీరాలి.  అయితే లంకను ఓడించడం, అదీ స్వదేశంలో అంత వీజీ కాదన్న  సంగతి బంగ్లాకూ తెలుసు.  ప్రధాన  బౌలర్లు లేకపోయినా  శ్రీలంక అందుబాటులో ఉన్న బౌలర్లతోనే అద్భుతాలు చేస్తోంది. వీళ్లను షకిబ్ అల్ హసన్ నేతృత్వంలోని   బంగ్లా టీమ్ ఏ మేరకు అడ్డుకుంటుందనేది ఆసక్తికరం. 

ఆసియా కప్‌లో బంగ్లా తరఫున  తొలి రెండు మ్యాచ్‌లలో  ఆడి ఇప్పటివరకూ టోర్నీ టాప్ స్కోరర్ (193)గా ఉన్న నజ్ముల్ హోసేన్ శాంతో పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు గాయపడ్డాడు.  ఇది బంగ్లాకు పెద్ద ఎదురుదెబ్బ. అతడి స్థానంలో లిటన్ దాస్ జట్టులోకి తిరిగొచ్చినా  పాకిస్తాన్ ‌తో మ్యాచ్ లో అతడు తేలిపోయాడు.  అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసిన మెహిది హసన్ మిరాజ్.. పాక్‌తో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ఓపెనర్ మహ్మద్ నయీం వరుసగా విఫలమవుతున్నాడు.  షకిబ్, ముష్ఫీకర్‌లు గత మ్యాచ్‌లలో రాణించడం ఒక్కటే బంగ్లా బ్యాటింగ్‌కు సానుకూలాంశం. మరి వీళ్లు లంక బౌలింగ్ దళాన్ని ఎలా ఎదుర్కుంటారో చూడాలి.

రికార్డు విజయంపై లంక కన్ను.. 

గ్రూప్ స్టేజ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లను గెలుచుకున్న శ్రీలంక  ఇప్పుడు మరోసారి బంగ్లాతో తలపడనుంది. గ్రూప్ దశలో  బంగ్లాను 164 పరుగులకే కూల్చి  అలవోక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లంక విజయం సాధిస్తే  ఆస్ట్రేలియా తర్వాత వన్డేలలో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలుస్తుంది.  ఇటీవలే అఫ్గాన్‌తో మ్యాచ్ గెలవడం ఆ జట్టుకు 50 ఓవర్ల ఫార్మాట్‌లో వరుసగా 12వ విజయం.  నేటి మ్యాచ్‌లో బంగ్లాను ఓడిస్తే ఆ జట్టు ఖాతాలో 13వ విజయం వచ్చి చేరుతుంది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాల  రికార్డు ఆస్ట్రేలియా (21) పేరిట ఉంది. బంగ్లాను ఓడిస్తే లంక రెండో స్థానానికి చేరుతుంది. 

ఇక ఆసియా కప్  - 20‌23లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిచిన లంక.. వాళ్ల ప్రధాన బౌలర్లు లేకపోయినా అద్భుతంగా రాణిస్తోంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌ను, నాలుగు రోజుల క్రితం  అఫ్గానిస్తాన్‌ను కట్టడిచేయడంలో  లంక బౌలర్లు సత్ఫలితాలు సాధించారు. మతీషా పతిరాన, మహీశ్ తీక్షణతో పాటు  సీనియర్ పేసర్ కసున్ రజిత, కెప్టెన్ దసున్ శనకలు బౌలింగ్ భారాన్ని మోస్తున్నారు.గత రెండు మ్యాచ్‌లలో బరిలోకి దిగిన జట్టుతోనే లంక నేటి మ్యాచ్‌లో ఆడే అవకాశాలున్నాయి.  స్వదేశంలో ఆడుతుండటం లంకకు  ప్లస్ కానుంది. 

పిచ్, వాతావరణం :  కొలంబోలోని ప్రేమదాస స్టేడియం నేటి మ్యాచ్‌కు వేదిక కానుంది.  పల్లెకెలెతో పోల్చితే  కొలంబోలో  పిచ్ మరింత స్లోగా ఉంటుంది. గడిచిన ఐదేండ్లలో ఇక్కడ హయ్యస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు సగటు 267 గా ఉంది.  స్పిన్‌కు సహకరించే పిచ్‌పై ఇరుజట్లూ ఎలా ఆడతాయో చూడాలి.   అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. నేడు  కొలంబోలో వర్షం పడే అవకాశాలు 68శాతం ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.  

తుది జట్లు  (అంచనా) : 

శ్రీలంక :  పతుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నె, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, దసున్ శనక (కెప్టెన్), దునిత్ వెల్లలగె, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరాన 

బంగ్లాదేశ్ : మహ్మద్ నయీం, లిటన్ దాస్, అఫిఫ్ హోసెన్, షకిబ్ అల్ హసన్ (కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫీకర్ రహీమ్, షమీమ్ హోసెన్, మెహిది హసన్ మిరాజ్, టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహ్ముద్ 

లైవ్ చూడండిలా.. 

- భారత కాలమానం  ప్రకారం శనివారం మధ్యాహ్నం  3 గంటల నుంచి మ్యాచ్ మొదలవుతుంది. ఈ మ్యాచ్‌ను టెలివిజన్‌లో స్టార్ నెట్‌వర్క్స్‌తో పాటు  మొబైల్స్‌లో అయితే డిస్నీ హాట్ స్టార్‌లలో ఉచితంగా చూడొచ్చు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget