అన్వేషించండి

Ashes Series 2023: బజ్‌బాల్ అయ్యింది అబాసుపాలు - స్టోక్స్‌ను ముంచిన దూకుడు మంత్రం

ENG vs AUS 1st Test: ఏడాదికాలంగా బజ్‌బాల్ మంత్రంతో దూసుకుపోతున్న ఇంగ్లాండ్‌కు ఆస్ట్రేలియా షాకిచ్చింది.

Ashes Series 2023: ‘బజ్‌బాల్’ అబాసుపాలైంది.   దూకుడు మంత్రం ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్‌ను నిండాముంచింది.  తొందరపాటు‌ నిర్ణయానికి  బెన్ స్టోక్స్ సేన భారీ మూల్యం చెల్లించుకుంది.  ‘ఏ జట్టు అయినా మాకు ఎదురేలేదు’ అన్న తలబిరుసుతో  ఆడిన ఆ జట్టుకు కంగారూలు కౌంటర్ ఇచ్చారు.  సర్వ రోగాలకు నివారిణిగా జిందా తిలస్మాత్‌నే వాడతాం అన్న చందంగా ‘ఏ జట్టు అయినా  వ్యూహం మార్చం.. దూకుడుగానే  ఉంటాం’ అన్నట్టుగా వ్యవహరిస్తే షాకులు తప్పవని  ఏడాదికాలానికి బోధపడింది.  

ఓటమికి పునాధి అక్కడే.. 

ఇంగ్లాండ్ ఓటమికి పునాధి పడింది తొలి రోజే అని చెప్పడంలో సందేహమే లేదు.  తొలి రోజు దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్.. 78 ఓవర్లు మాత్రమే ఆడి  393 పరుగులు చేసింది.  అప్పటికీ  సెంచరీ చేసిన జో రూట్ (118 నాటౌట్) క్రీజులోనే ఉన్నా  మరో రెండు వికెట్లు చేతిలో ఉన్నా స్టోక్స్ మాత్రం ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చాడు.  ఆరోజు అందరూ దీనిని ‘బోల్డ్ డిసీషన్’ అన్నారు. కానీ  రెండో రోజుకే  ఇంగ్లాండ్‌కు తామెంత తప్పు చేశామో తెలిసొచ్చింది.   తొలి రోజు  ఆసీస్‌ను   రెండు వికెట్లు తీసి ఒత్తిడిలోకి నెట్టి రెండో రోజు కూడా  ఓ ఆట ఆడుకుందామనేది స్టోక్స్ వ్యూహం. కానీ అది బెడిసికొట్టింది. ఉస్మాన్ ఖవాజా (141) అద్భుతమైన సెంచరీకి తోడు   అలెక్స్ కేరీ (66), ట్రావిస్ హెడ్ (50),  కమిన్స్ (38) లు రాణించి ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లారు. మూడో రోజు లంచ్ వరకూ ఆసీస్ బ్యాటింగ్ సాగింది. 

రెండో ఇన్నింగ్స్‌‌లో కూడా.. 

తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను తమకంటే తక్కువ స్కోరు (386) కే ఆలౌట్ చేసినా  ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో ఆట తీరు మార్చుకోలేదు.  త్వరగా ఆడి భారీ స్కోరు చేసి కంగారూల ఎదుట  భారీ లక్ష్యాన్ని నిలిపాలన్నది స్టోక్స్  సేన ప్లాన్. ఇది కూడా విఫలమైంది.  ఫాస్ట్‌గా ఆడే క్రమంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు  35, 40 పరుగులు చేశారుగానీ ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ సాధించలేకపోయారు. వన్డే తరహాలో ఆడి  త్వరగా పెవిలియన్‌కు చేరారు.    జో రూట్ (46) టాప్ స్కోరర్.  సెకండ్ ఇన్నింగ్స్‌లో  ఇంగ్లాండ్ 273 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక మెరుగైన భాగస్వామ్యం నమోదై ఉంటే ఆసీస్ ముందు లక్ష్యం పెరిగేది.  కానీ దూకుడుగా ఆడే క్రమంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు దెబ్బతిన్నారు. 

 

విజయానికి దగ్గరగా వచ్చి..

ఆసీస్‌ ముందు 280 పరుగుల లక్ష్యాన్ని నిలిపన ఇంగ్లాండ్.. విజయం కోసం బాగానే శ్రమించింది. వాస్తవానికి ఎడ్జ్‌బాస్టన్ పిచ్..  బ్యాటింగ్‌కు స్వర్గధామం.   టెస్టులలో ఇది 4,5 వ రోజుకు పూర్తి బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కానీ ఐదో రోజు  ఉదయం సెషన్ లో వర్షం కురవడం  ఇంగ్లాండ్‌కు కలిసొచ్చింది.  ఆసీస్ తరఫున తొలి  ఇన్నింగ్స్ లో సెంచరీ హీరో  ఉస్మాన్ ఖవాజా  (65) నిలబడ్డా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.   227-8 గా ఉన్న కంగారూల తోకను కట్ చేయడానికి ఇంగ్లాండ్ బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది.  పాట్ కమిన్స్ (73 బంతుల్లో 44, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), నాథన్ లియాన్ (28 బంతుల్లో16 నాటౌట్,  2 ఫోర్లు) లు వికెట్ల ముందు  పాతుకుపోయారు. ఈ ఇద్దరూ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుని ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.  

ఇంగ్లాండ్‌కు టెస్టులలో హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ కలిసి ఈ టెస్టుకు ముందు 13 టెస్టులలో ఏకంగా పది గెలిచి రికార్డులు తిరగరాశారు. ఎడ్జ్‌బాస్టన్ లో కూడా ఆసీస్ కు చుక్కలు తప్పవని అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. తొందరపాటు నిర్ణయం వల్ల బజ్‌బాల్ అబాసుపాలైంది. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Embed widget