అన్వేషించండి

Hanuma Vihari: హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ

Andhra Cricket Association: టీమ్‌ఇండియా టెస్టు క్రికెటర్‌ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్‌ సంఘం షోకాజ్‌ నోటీసు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Andhra Cricket Issues Show Cause Notice To Hanuma Vihari: టీమ్‌ఇండియా(Team india) టెస్టు క్రికెటర్‌ హనుమ విహారి(Hanuma Vihari)కి ఆంధ్ర క్రికెట్‌ సంఘం( Andhra Cricket Association) షోకాజ్‌ నోటీసు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం తర్వాత ఈ నెల 25న విహారికి ఈ మెయిల్‌ ద్వారా నోటీసు పంపించారు. దీనిపై ఇంకా విహారి స్పందించలేదని ఏసీఏ వర్గాలు చెప్పాయి. విహారికి షోకాజ్‌ నోటీసు పంపించామని విహారి ఇంకా స్పందించలేదని ఏసీఏ అధికారి ఒకరు తెలిపారు. దేశవాళీ క్రికెట్లో ఆంధ్ర జట్టు వృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన విహారి విలువ మాకు తెలుసని ఏసీఏ ప్రతినిధి తెలిపాడు. కానీ ఆ నోటీసుకు బదులిచ్చానని విహారి పేర్కొన్నాడు. తన పట్ల అన్యాయంగా వ్యవహరించారని, రాబోయే దేశవాళీ సీజన్‌లో ఇతర రాష్ట్ర జట్టుకు ఆడేందుకు నిరభ్యంతర పత్రం అడిగానని అతను వెల్లడించాడు. ఏసీఏ స్పందన కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు. 


అసలేం జరిగిందంటే ..
భవిష్యత్తులో ఆంధ్ర క్రికెట్‌ జట్టు తరఫున ఆడబోనని సీనియర్‌ బ్యాటర్ హనుమ విహారి తెలిపారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఉండలేనని సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.  మధ్యప్రదేశ్‌తో క్వార్టర్‌ ఫైనల్‌లో నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయిన అనంతరం విహారి ఈ నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఒక రాజకీయ నాయకుడి కుమారుడి కోసం తనను కెప్టెన్‌ నుంచి తప్పించినా జట్టు పట్ల, ఆట పట్ల ప్రేమతో ఇన్నాళ్లు ఆటను కొనసాగించానని పేర్కొన్నారు. ఇకపై ఆంధ్ర తరఫున ఆడబోనని తేల్చిచెప్పారు. రంజీ మ్యాచ్‌లో భాగంగా బెంగాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 17వ ఆటగాడిపై అరిచానని తెలిపారు. ఆ ఆటగాడు రాజకీయ నాయకుడైన తన తండ్రికి చెప్పడంతో ఆయన తనపైనా చర్యలు తీసుకోవాలని ACAపై ఒత్తిడి తీసుకొచ్చారని వెల్లడించారు. తన వైపున తప్పు లేకపోయినా కెప్టెన్‌ నుంచి తప్పించారని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా సదరు ఆటగాడిని తాను ఏమి అనలేదని వివరించారు. గతేడాది మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కుడి చేతికి గాయమైనా జట్టు కోసం ఎడమ చేతితోనే బ్యాటింగ్‌ చేశానని గుర్తు చేశారు. అంతే కాదు ఈ విషయం తనతో పాటూ ఉన్న ప్లేయర్ అందరికీ తెలుసు అంటూ వారి సంతకాలు ఉన్న పేపర్ కూడా పోస్ట్ చేశాడు. 


 ఈ పోస్ట్ అతి తక్కువ సమయంలోనే వైరల్ గా మారడంతో ఈ విషయంపై  ఇన్‌స్టాలోనే పృథ్వీ రాజ్ అనే మరో క్రికెటర్  కౌంటర్ పెట్టాడు.    ‘మీరు ఆ కామెంట్ బాక్స్‌లో వెతుకుతున్న ఆ ప్లేయర్‌ ను నేనే. మీరు విన్నదంతా అబద్దం. గేమ్ కంటే ఎవరూ పెద్దవారు కాదు. ఆట నా ఆత్మగౌరవం కంటే పెద్దదేమీ లేదు. వ్యక్తిగత దాడులు, నిందాపూర్వక భాష అది ఇక్కడే కాదు ఏ వేదికమీదనైనా అంగీకారయోగ్యం కాదు. ఆ రోజు ఏం జరిగిందో జట్టులోని ప్రతి ఒక్కరికీ తెలుసు. నువ్వు ఇంతకు మించి ఏమీ పీకలేవు మిస్టర్ సో కాల్డ్ చాంపియన్’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అంతే కాదు ‘ఒక వేళ నీవు కావాలనుకుంటే ఈ సింపథీ గేమ్ ఆడుకో’ అని రాశాడు. ఇంతకీ పృధ్వీరాజ్ ఇంకా ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేయలేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Assembly: కేసీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
సీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
Mana Mitra: వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు  - ఆ బిల్లులు  కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు - ఆ బిల్లులు కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
Telangana Latest News: తెలంగాణలో బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం  - కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం !
తెలంగాణలో బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం - కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం !
Andhra Pradesh Latest News: నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Malala returned to Pak after 13 years | పాకిస్తాన్ కు వచ్చిన మలాలా | ABP DesamTamilisai arrested by police | తమిళసైని అడ్డుకున్న పోలీసులు | ABP DesamCadaver Dogs for SLBC Rescue | SLBC రెస్క్యూ ఆపరేషన్‌కు కేరళ కుక్కల సహాయం | ABP DesamJr NTR Family in Chakalipalem | కోనసీమలో సందడి చేసిన Jr NTR కుటుంబం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Assembly: కేసీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
సీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
Mana Mitra: వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు  - ఆ బిల్లులు  కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు - ఆ బిల్లులు కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
Telangana Latest News: తెలంగాణలో బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం  - కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం !
తెలంగాణలో బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం - కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం !
Andhra Pradesh Latest News: నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
Telangana Latest News: తెలంగాణలోని లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు బ్రేక్- నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
తెలంగాణలోని లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు బ్రేక్- నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
Viral News: ఆయ్..మా గోదారోళ్లకు మర్యాదలు బాగా ఎక్కువేనండి - అత్తకి కోటి బహుమతి ఇచ్చిన కోడలు -కట్నం కాదండోయ్ !
ఆయ్..మా గోదారోళ్లకు మర్యాదలు బాగా ఎక్కువేనండి - అత్తకి కోటి బహుమతి ఇచ్చిన కోడలు -కట్నం కాదండోయ్ !
Shami controversy:  షమీ మంచి నీళ్లు తాగడం నేరం కాదు -  క్రికెటర్‌కు బాసటగా ముస్లిం మత పెద్దలు
షమీ మంచి నీళ్లు తాగడం నేరం కాదు - క్రికెటర్‌కు బాసటగా ముస్లిం మత పెద్దలు
Viral News: డ్రగ్స్ ఇచ్చి అపస్మారక స్థితికి వెళ్లాక రేప్ చేస్తాడు - ఈ చైనీయుడు బ్రిటన్ చరిత్రలోనే వరస్ట్ రేపిస్ట్
డ్రగ్స్ ఇచ్చి అపస్మారక స్థితికి వెళ్లాక రేప్ చేస్తాడు - ఈ చైనీయుడు బ్రిటన్ చరిత్రలోనే వరస్ట్ రేపిస్ట్
Embed widget