Asia Cup: ఆసియా కప్‌లో చేతులెత్తేసిన పాకిస్తాన్ - యూఏఈతో మ్యాచ్‌కు డుమ్మా - టోర్నీ బహిష్కరించినట్లే !
Pakistan boycott Asia Cup: షేక్ హ్యాండ్ ఇవ్వలేదని అలిగిన పాకిస్తాన్ ఆసియా కప్ నుంచి బహిష్కరించినట్లుగా కనిపిస్తోంది. యూఏఈతో మ్యాచ్‌కు ఆటగాళ్లు హాజరుకాలేదు.

Pakistan boycott Asia Cup group clash against UAE: ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత జరిగిన ‘నో హ్యాండ్‌షేక్’ వివాదం చివరికి పాకిస్తాన్ టోర్నీ నుంచి వెళ్లిపోయేలా చేస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆసియాకప్ లో భాగంగా యూఏఈతో జరగాల్సిన మ్యాచ్ కు ఆటగాళ్లు హాజరు కాలేదు. హోటళ్లకే పరిమితమయ్యారు. అయితే బహిష్కరించినట్లుగా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
It is confirmed that PCB took the decision to not play today’s match and with this decision Pakistan is out of the tournament. UAE missed the opportunity to beat the pakistan in asia cup #AsiaCup2025 #AsiaCup #UAE #UAEvsPAK #bcci #Modi #Pakistan pic.twitter.com/gS9mv6jNbN
— ɳ เ ร ɦ α (@itsnisha03) September 17, 2025
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు UAEలో T20 ఫార్మాట్‌లో జరుగుతోంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, UAE, ఒమన్, హాంకాం జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ Aలో భారత్, పాకిస్తాన్, UAE, ఒమన్ ఉన్నాయి. సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మ్యాచ్ తర్వాత, భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తోపాటు టీమ్ మొత్తం పాక్ ప్లేయర్లతో హ్యాండ్‌షేక్ చేయకపోవడం వివాదాస్పదమైంది. ఇది ICC కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినట్లు PCB ఆరోపించింది.
@TheRealPCB have decided to quit Asia Cup 2025 and not play against UAE
— Zafiur Rahman (@zafiur) September 17, 2025
With this, India (@BCCI)& UAE (@EmiratesCricket) qualify for Super 4s stage.
Moral : Naach Na Jaane Angan Tedha
Get Ready For Social Media Excuses Now And 6-0 Myth By Pakistanis #AsiaCup2025 #AsiaCup
మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్ నే కరచాలనం చేయవద్దన్నారని PCB ఆగ్రహం వ్యక్తం చేసింది. PCB ICCకు ఫార్మల్ కంప్లైంట్ చేసి, పైక్రాఫ్ట్‌ను మొత్తం టోర్నీ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఇక్కడే విషయం మరింత తీవ్రమైంది . PCB డిమాండ్‌ను ఆమోదించకపోతే UAEతో గ్రూప్ A మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని స్పష్టం చేసింది. దానికి తగ్గట్లుగానే పాకిస్తాన్ ఆటగాళ్లు స్టేడియానికి రాలేదు. మ్యాచ్ జరగకపోతే UAE సూపర్ 4కు అర్హత సాధిస్తుంది. పాక్ ఎలిమినేట్ అవుతుంది.
పాక్ మ్యాచ్ ఆడకపోవడం వల్ల భారీగా ఆర్థిక నష్టానికి గురి కానుంది. ఒక వేళ ఈ గ్రూప్ మ్యాచ్ ఆడితే.. పాకిస్తాన్ యూఏఈ కన్నా బలంగా ఉంది కానుక విజయం సాదించే అవకాశం ఉంది. ఆ తర్వాత మరోసారి పాకిస్తాన్ .. భారత్ తో తలపడాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని ఎవాయిడ్ చేయడానికైనా బహిష్కరించాల్సిందేనని పాక్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.




















