అన్వేషించండి

బిగ్ బ్యాష్ లీగ్ లో మరో కాంట్రవర్సీ, రూల్స్ తెలుసుకోండి..!

BBLలో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. దీని వల్ల క్రికెట్ రూల్స్ తెలుస్తున్నాయి..!

Big Bash League: బిగ్ బ్యాష్ లీగ్ లో మరో కాంట్రవర్సీ. ఎంసీసీ చట్టాలను తిరగేయాల్సిన పరిస్థితి 2 రోజుల్లోనే మరోసారి వచ్చింది. ఈసారి నాన్ స్ట్రైకర్ రనౌట్ ( మన్కడింగ్ ) రూల్స్ అందరికీ క్లియర్ గా తెలిసొచ్చాయి. 

మరో మ్యాచ్.. మరో బిగ్ బ్యాష్ లీగ్ మ్యాచ్. ఎంతటి క్రికెటింగ్ పండితులకైనా, అనుక్షణం క్రికెట్ ను ఫాలో అయ్యే కల్ట్ ఫ్యాన్స్ కు అయినా సరే తెలియని రూల్స్ ఈ బిగ్ బ్యాష్ లీగ్ లోని కొన్ని మ్యాచెస్ ద్వారా అందరికీ తెలుస్తున్నాయి. 2 రోజుల క్రితం బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్స్ మధ్య జరిగిన మ్యాచ్ గుర్తుందిగా.... బౌండరీ లైన్ దగ్గర మైకేల్ నీసర్ పట్టిన క్యాచ్ ఎంతటి వివాదాన్ని సృష్టించిందో... అప్పుడు ఏకంగా క్రికెట్ చట్టాలను అందరూ తిరగేశారు. అసలు బౌండరీ లైన్ క్యాచింగ్ గురించి ఎంసీసీ చట్టాలు ఏం చెప్తున్నాయో తెలుసుకున్నారు. చాలా మందికి ఆ చట్టం అర్థరహితంగా అనిపించినా సరే.... ఆ రోజు క్యాచ్ పట్టిన తీరు కరెక్టే అని తేలింది. 

ఇప్పుడు నిన్న మరో మ్యాచ్. అదే బిగ్ బ్యాష్ లీగ్ లో. మెల్ బోర్న్ స్టార్స్, మెల్ బోర్న్ రెనెగేడ్స్ మధ్య జరిగింది. 2018లో ఐపీఎల్ లో జోస్ బట్లర్ ను అశ్విన్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో రనౌట్ ( మన్కడింగ్ )  చేసినప్పటి నుంచి అనేక సార్లు అలాంటి ఉదంతాలు రిపీట్ అయ్యాయి. ఎప్పటికి అప్పుడు ఫెయిర్ ప్లే అవునో కాదో అని చర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ అలా ఔట్ చేయడం... ఎప్పుడూ చట్టం ప్రకారం కరెక్టే. ఇప్పుడు నిన్నటి మ్యాచ్ లో అసలు నాన్ స్ట్రైకర్ ను ఎలా రనౌట్ చేయాలో, అంతకన్నా ముఖ్యంగా ఎలా రనౌట్ చేయకూడదో చాలా మంది క్రికెటర్లకు క్లారిటీ వచ్చి ఉంటుంది.... లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా దయ వల్ల. 

మెల్ బోర్న్ రెనెగేడ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. వారి ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ను మెల్ బోర్న్ స్టార్స్ కెప్టెన్, లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా వేసేందుకు వచ్చాడు. ఐదో బాల్ దాదాపు వేసేయబోయాడు. కానీ నాన్ స్ట్రైకర్ టామ్ రోజర్స్ క్రీజు వదిలి బాగా ముందుకు వెళ్లడం గమనించి రనౌట్ చేశాడు. అంపైర్లకు అప్పీల్ చేశాడు. రోజర్స్ నిజంగానే క్రీజు బయటే ఉన్నాడు. కానీ ఈ సిట్యుయేషన్ లో అంపైర్ తన సమయస్ఫూర్తి, రూల్స్ పట్ల అవగాహన ప్రదర్శించాడు. ఓసారి థర్డ్ అంపైర్ కు రిఫర్ చేశాడు. థర్డ్ అంపైర్ సింపుల్ గా నాటౌట్ అని తేల్చేశాడు. ఎందుకంటారా...? అక్కడే ఎంసీసీ చట్టాల గురించి మీరు తెలుసుకోవాలి.

ఈ కింద వీడియోలో చూడండి. ఆడం జంపా... తను సాధారణంగా ఎలా బౌలింగ్ చేస్తాడో.... అలానే బాల్ వేయడానికి వచ్చాడు. తన చేయి... తన నార్మల్ బాల్ రిలీజ్ పాయింట్ దాకా, అంటే దాదాపు నిట్టనిలువుగా వచ్చేసింది. సాధారణంగా అయితే అది బాల్ విసిరే పాయింట్ అన్నమాట. అలాంటి పొజిషన్ నుంచి వెనక్కి వచ్చి రనౌట్ చేసి అప్పీల్ చేశాడు. కానీ ఎంసీసీ చట్టాల్లో రనౌట్ గురించి ఏముందో తెలుసా..? 

38.3 చట్టం ప్రకారం.... నాన్ స్ట్రైకర్ క్రీజు దాటి బయటకు వెళ్తే రనౌట్ చేసే హక్కు బౌలర్ కు ఎప్పుడూ ఉంటుంది. కానీ నార్మల్ గా బాల్ రిలీజ్ చేసే పాయింట్ కన్నా ముందే బౌలర్ అలా రనౌట్ చేసే వీలుంటుంది. రిలీజ్ పాయింట్ దాకా వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లి స్టంప్స్ ను పడగొడితే అది కచ్చితంగా నాటౌటే. 

ఈ నార్మల్ రిలీజ్ పాయింట్ అనేది బౌలర్ యాక్షన్ బట్టి మారుతూ ఉంటుంది అన్నమాట. పర్టిక్యులర్ పాయింట్ కానీ, యాంగిల్ కానీ ఏముండదు. సో అలా ఆడం జంపా తన రిలీజ్ పాయింట్ నుంచి వెనక్కి వచ్చి స్టంప్స్ పడగొట్టాడు కాబట్టి అంపైర్ నాటౌట్ గా ప్రకటించారు. విశేషం ఏంటంటే... ఈ నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న టామ్ రోజర్స్... తర్వాత బౌలింగ్ లో 5 వికెట్లతో చెలరేగి తన జట్టు మెల్ బోర్న్ రెనెగేడ్స్ ను గెలిపించాడు. 

ఆడం జంపా.... తన హోం గ్రౌండ్ లోని ఫ్యాన్స్ నుంచి, అంతెందుకు స్వయానా తన జట్టు కోచ్ డేవిడ్ హస్సీ నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. జంపా ఆ రనౌట్ ప్రయత్నం చేయగానే స్టేడియంలో ఫ్యాన్స్ అంతా అప్పటికప్పుడే తీవ్రంగా 'బూ' చేశారు. దీని వెనుక చిన్న హిస్టరీ కూడా ఉంది. ఎందుకంటే ఓవరాల్ గా చూసుకుంటే ఆసీస్ ప్లేయర్స్ కానీ, ఫ్యాన్స్ కానీ చాలా మంది... ఈ విధమైన రనౌట్ కు వ్యతిరేకం. చట్టప్రకారం కరెక్టే అయినా సరే క్రీడాస్ఫూర్తికి విరుద్ధం అని భావిస్తారు. కొన్నాళ్ల క్రితం ఆసీస్, సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్టులో.... కంగారూల పేసర్ మిచెల్ స్టార్క్... ప్రోటీస్ బ్యాటర్ థియోనిస్ డీ బ్రూన్ ను ఇలా ఔట్ చేసే అవకాశం ఉన్నా చేయలేదు. కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. అది జరిగిన కొన్ని రోజులకే జంపా ఇలా చేయడం ఫ్యాన్స్ కు ఏమాత్రం గిట్టలేదు.

ఇక మెల్ బోర్న్ స్టార్స్ కోచ్ డేవిడ్ హస్సీ కూడా మ్యాచ్ తర్వాత దీని గురించి మాట్లాడాడు. ఒకవేళ అది ఔట్ ఇచ్చి ఉన్నా సరే అప్పీల్ ను తాము వెనక్కి తీసుకునేవాళ్లమని చెప్పాడు. తన అభిప్రాయాన్ని చెప్పాడు. తప్పు లేదు. కానీ ఓ జట్టుగా నడుచుకోవాల్సిన తీరులో ఆయన వ్యవహరించలేదని క్రికెట్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఓ కోచ్... తన ఆటగాడ్ని, అందులోనూ కెప్టెన్ నే బహిరంగంగా తప్పుబట్టడం కరెక్ట్ కాదంటున్నారు.

సో ఓవరాల్ గా 2 రోజుల గ్యాప్ లో బిగ్ బ్యాష్ లీగ్ దయవల్ల ఎవరికీ పెద్దగా తెలియని 2 క్రికెట్ రూల్స్ వివరంగా తెలుసుకునే వీలు కలిగింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget