అన్వేషించండి

Sports Year Ender 2024: ఈ ఏడాది క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు వీళ్లే- లిస్టులో షాకింగ్ ప్లేయర్లు

2024 క్రికెట్ అభిమానులకు మరిచిపోలేనిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలామంది క్రికెటర్లు పాక్షికంగా లేక పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి, ఫ్యాన్స్ కు షాకిచ్చారు.

Flash Back 2024: ఈ ఏడాది క్రికెటర్లు ఎన్నో రికార్డులతో అభిమానుల మనసు దోచారు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ గెలిచి భారత అభిమానులను సంబరాల్లో ముంచెత్తారు. అయితే ఆ టోర్నీ ముగింపులోనే భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20లకు వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొని అభిమానులను విషాదంలో ముంచెత్తారు. ఇలా ఈ ఏడాది చాలా మంది క్రికెటర్లు ఆటకు పాక్షికంగా లేదా, పూర్తిగా వీడ్కోలు పలికారు. అలాంటి వారి జాబితా పరిశీలిస్తే.. 2024లో రిటైర్ అయిన ఆటగాళ్లు..

రోహిత్ శర్మ: భారత కెప్టెన్ ఈ ఏడాది టీ20ల నుంచి రిటైరైనట్లు ప్రకటించాడు. అయితే వన్డేలు, టెస్టులకు మాత్రం అందుబాటులో ఉంటానని వెల్లడించాడు.
విరాట్ కోహ్లీ: రోహిత్ బాటలోనే కోహ్లీ కూడా పొట్టి ఫార్మాటల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టులకు, వన్డేలు ఆడతానని తెలిపాడు. 

రవీంద్ర జడేజా: జడ్డూగా ముద్దుగా పిలుచుకునే రవీంద్ర జడేజా కూడా సీనియర్లు రోహిత్, కోహ్లీ బాటలోనే టీ20లకు వీడ్కోలు పలికాడు. వన్డేలు, టెస్టులకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. 
డీన్ ఎల్గర్: సౌతాఫ్రికా కీలక ఆటగాడు డీన్ ఎల్గర్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 
డేవిడ్ వార్నర్: అభిమానులు ముద్దుగా డేవిడ్ భాయ్ అని పిలుచుకునే వార్నర్.. ఐపీఎల్ ద్వారా భారతీయుల మనసు దోచాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 
హెన్రిచ్ క్లాసెన్: విధ్వంసక టీ20 ప్లేయర్ అయిన ఈ ప్రొటీస్ ప్లేయర్.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 
దినేశ్ కార్తీక్: దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కాలం నుంచి క్రికెట్ ఆడుతున్న ఈ వెటరన్ ప్లేయర్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 
సౌరభ్ తివారీ: టాలెంట్ కు తగ్గ అవకాశాలు దక్కించుకోలేని జార్ఖండ్ డైనమేట్ తివారి.. ఇంటర్నేషనల్ క్రికెట్ కు టాటా చెప్పాడు. 
వరుణ్ ఆరోన్: పేస్ సంచనలం వరుణ్ ఆరోన్ కూడా భారత జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 
నీల్ వాగ్నర్: న్యూజిలాండ్ పేసర్ అయిన వాగ్నర్.. మూడు ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. 
కొలిన్ మున్రో: కివీస్ ప్లేయర్ కొలిన్ మున్రో అంతర్జాతీయ క్రికెట్ కు టాటా చెప్పాడు. 
కేదార్ జాదవ్: భారత క్రికెటర్ కేదార్ జాదవ్ మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. 
డేవిడ్ వైస్: నమీబియాకు చెందిన డేవిడ్ వైస్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 
సైబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ట్: నెదర్లాండ్స్ కి చెందిన సైబ్రాండ్ మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. 
జేమ్స్ అండర్సన్: ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. చాలా కాలం కిందటే పరిమిత ఓవర్ల క్రికెట్ కు టాటా చెప్పిన అండర్సన్.. తాజా నిర్ణయంతో అంతర్జాతీయ క్రికెట్ కు దూరమయ్యాడు.
శిఖర్ ధావన్: అభిమానులు ముద్దుగా గబ్బర్ అని పిలుచుకునే శిఖర్ ధావన్ కూడా మూడు ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. 
డేవిడ్ మలన్: ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ మలన్ మూడు ఫార్మాట్ల నుంచి రిటైరయ్యాడు. 
షానన్ గాబ్రియేల్: వెస్టిండీస్‌కు చెందిన షానన్ గాబ్రియెల్ మూడు ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికాడు. 
వృద్ధిమాన్ సాహా: భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా మూడు ఫార్మాట్‌లకు టాటా చెప్పాడు. 
మాథ్యూ వేడ్: ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మాథ్యూ వేడ్ మూడు ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యాడు. 
మహ్మదుల్లా: బంగ్లాదేశ్‌కు చెందిన వెటరన్ బ్యాటర్ మహ్మదుల్లా అంతర్జాతీయ టీ20 నుంచి రిటైరయ్యాడు. 
షకీబ్ అల్ హసన్: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ టెస్టు, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 
మొయిన్ అలీ: ఇంగ్లండ్‌కు చెందిన మొయిన్ అలీ మూడు ఫార్మాట్ల నుంచి రిటైరయ్యాడు.
బరీందర్ సరన్: భారత ఆల్రౌండర్ బరీందర్ సరన్ మూడు ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికాడు. 
విల్ పుకోవ్స్కీ: ఆస్ట్రేలియా బ్యాటర్ విల్ పుకోవ్స్కీ మూడు ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యాడు. 
మహ్మద్ అమీర్: పాకిస్థాన్ పేసర్ మహ్మద్ అమీర్ మూడు ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. 
ఇమాద్ వసీం: పాకిస్థాన్ ఆల్ రౌండర్ ఇమాద్ వసీం మూడు ఫార్మాట్ల నుంచి రిటైరయ్యాడు. 
మహ్మద్ ఇర్ఫాన్: పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ మూడు ఫార్మాట్ల కు వీడ్కోలు పలికాడు.

Also Read: Syed Mushtaq Ali Trophy : సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ విజేత ముంబై- రెండోసారి కప్పును సొంతం, ఫైనల్లో ఎంపీ చిత్తు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
Embed widget