అన్వేషించండి
Advertisement
Year Ender 2023: దిగ్గజాలకు తప్పని ఎదురుదెబ్బలు , బాబర్, పుజారాలకు కలిసిరాని 2023
Year Ender 2023: ఈ ఏడాది చాలా మంది క్రికెటర్లకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అందులో టీమిండియా టెస్ట్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా... పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఉన్నారు.
మరో సంవత్సరంలో కాలగర్భంలో కలిసిపోతుంది. ఈ ఏడాది చాలా మంది క్రికెటర్లకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అందులో టీమిండియా టెస్ట్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా... పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఉన్నారు. యుజ్వేంద్ర చాహల్‌కు కూడా ఈ ఏడాది గొప్పగా కలిసిరాలేదు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో సహా పలువురు దిగ్గజ ఆటగాళ్లు 2013లో ఏడాది పొడవునా ఆధిపత్యం చెలాయించారు. ఈ దిగ్గజ ఆటగాళ్లతో పాటు ఎందరో యువ ఆటగాళ్లు కూడా సత్తా చాటారు. పేస్ బౌలర్ మహ్మద్ షమీ.. వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. అయితే ఈ ఏడాది బాగా రాని స్టార్లు కూడా ఉన్నారు. 2013 ఏడాదిలో దిగ్గజ ఆటగాళ్ల వైఫల్యాన్ని ఓసారి పరిశీలిద్దాం...
ఛతేశ్వర్ పుజారా: సుదీర్ఘ ఫార్మట్‌లో భారత్ తురుపుముక్క ఛతేశ్వర్ పుజారాకు ఈ ఏడాది పెద్దగా కలిసిరాలేదు. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు కూడా పుజారా దూరమయ్యాడు. 2013 అస్సలు పుజారాకు కలిసిరాలేదు. పుజారా ఈ ఏడాది ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. తొలి టెస్టులో పుజారా కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. తర్వాతి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అజేయంగా 31 పరుగులు చేశాడు. ఒక టెస్ట్ మ్యాచ్‌లో 1, 59 పరుగులు చేశాడు. తర్వాతి టెస్టులో 42 పరుగులు చేశాడు. అయిదు టెస్టు మ్యాచుల్లోనూ పెద్దగా రాణించని పుజారాకు తర్వాతి టెస్టుల్లో అసలు జట్టులో స్థానమే దక్కలేదు. అయితే ఈ ఏడాది మళ్లీ రాణించి టెస్టు జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని పుజారా పట్టుదలగా ఉన్నాడు.
బాబర్ ఆజం: పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు బాబర్ ఆజం ఈ ఏడాది కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రపంచ కప్ 2023లో బాబర్ నేతృత్వంలోని పాకిస్థాన్ తీవ్రంగా నిరాశపరిచింది. బాబర్ వ్యక్తిగత ప్రదర్శన కూడా పెద్దగా బాలేదు. వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై 9, ఆస్ట్రేలియాపై 18, శ్రీలంకపై 10 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌లపై బాబర్ హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆసియా కప్‌లోనూ పాక్ జట్టు విఫలమైంది. ఈ వరుస వైఫల్యాలతో బాబర్ ఆజమ్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ ఏడాది మళ్లీ రాణించాలని కసిగా ఉన్నాడు.
యుజ్వేంద్ర చాహల్ : టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు. 2023 ప్రపంచకప్‌లో టీమిండియా జట్టులో చాహల్‌కు స్థానం దక్కలేదు. చాహల్ 2023 జనవరిలో భారత్ తరఫున తన చివరి వన్డే ఆడాడు. చివరి టీ20 ఆగస్టు 2023న ఆడాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కూడా చాహల్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌లో చాహల్ బాగానే రాణిస్తున్నాడు. ఇప్పుడు భవిష్యత్తులో రాణించడంపై చాహల్ దృష్టి సారించాడు.
2023వ సంవత్సరంలో ఆశ్చర్యకరంగా యూఏఈ ఆటగాడు మహ్మద్ వసీమ్ అత్యధిక పరుగులు చేశాడు. మహ్మద్ వసీం మొత్తం 21 ఇన్నింగ్స్‌లలో 40.30 సగటు, 163.15 స్ట్రైక్ రేట్‌తో 806 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మహ్మద్ వసీం అత్యధిక స్కోరు 91 పరుగులు. టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్... ఈ ఏడాది ఇప్పటివరకు 17 టీ 20 మ్యాచ్‌లు ఆడిన 16 ఇన్నింగ్స్‌లలో 45.21 సగటు, 152.89 స్ట్రైక్ రేట్‌తో 633 పరుగులు చేశాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion