Chinese Badminton Player Death: బ్యాడ్మింటన్ ఆడతూ 17 ఏళ్ళ యువకుడు మృతి, చైనాలో విషాదం
Badminton Player Death: ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో ఘొరం జరిగింది. బ్యాడ్మింటన్ ఆడతుండగానే జాతీయ జట్టులోని 17 సంవత్సరాల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Chinese Badminton Player Dies After Collapsing On Court: బ్యాడ్మింటన్(Badminton) ఆడుతూ యువ ఆటగాడు ఆకస్మికంగా మరణించడం క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పటివరకూ బ్యాడ్మింటన్ కోర్టులో కొదమ సింహంలా తలపడిన యువ ఆటగాళ్లు ఒక్కసారిగా కుప్పకూలి కన్నుమూయడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఇండోనేషియాలో(Indonesia) ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్(badminton tournament) హోరాహోరీగా జరుగుతోంది. ఈ ఛాంపియన్‌షిప్ గెలిచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని బ్యాడ్మింటన్ క్రీడాకారులు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో జపాన్‌కు చెందిన కజుమాతో చైనాకు చెందిన జాంగ్ జిజీ( Zhang Zhijie) తలపడ్డాడు. ఇరువురు హోరాహోరిగా తపడుతున్నారు. తొలి గేమ్‌లో ఇరువురి స్కోరు 11-11 వద్ద సమంగా ఉన్న సమయంలో జాంగ్ జిజీ ఒక్కసారిగా కోర్టులోనే కుప్పకూలిపోయాడు. సర్వీస్‌ను అందుకునే క్రమంలో జిజీ కుప్పకూలడంతో ఏం జరుగుతుందో అక్కడేవ్వరికీ అర్థం కాలేదు. కొన్ని క్షణాల తర్వాత కోలుకున్న నిర్వాహకులు జాంగ్ జిజీని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే జిజీ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రకటనతో నిర్వాహకులు షాక్‌గు గురయ్యారు. అప్పటివరకూ విరోచితంగా పోరాడిన జిజీ... ఒక్కసారిగా మరణించడంతో నిర్వాహకులు సహా అక్కడున్న వారంతా నిశ్చేష్టులయ్యారు.
क्या ये कोरोना इफेक्ट है?
— Raghvendra Pandey🇮🇳 (@bhaiyaji25) July 2, 2024
17 वर्षीय चाइनीस टेनिस खिलाड़ी खेलते-खेलते अचानक कार्डियक अटैक से हुई मौत।
खिलाड़ी रेफरी और दर्शक देखते रह गए... pic.twitter.com/TTy4ZwwTqa
అంతటా శోకమే
ఈ ప్రకటనతో చైనాతో సహా క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని ఆశలు పెట్టుకున్న క్రీడాకారుడు తనకు ఎంతో నచ్చిన ఆట ఆడుతూ కోర్టులోనే ప్రాణాలు కోల్పోవడంతో చైనా శోక సంద్రంలో మునిగిపోయింది. జాంగ్ జిజీ మరణంపై చైనా బ్యాడ్మింటన్ అసోసియేన్ సహా ప్రముఖ క్రీడాకారులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎన్నో ఆశలతో బ్యాడ్మింటన్‌లో దూసుకుపోతున్న ఓ దిగ్గజ క్రీడాకారుడిని కోల్పోయామంటూ... భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఆవేదన వ్యక్తం చేశారు. జిజీ మరణ వార్తతో తన హృదయం ముక్కలైందని... తాను తీవ్ర షాక్‌లో ఉన్నానని సింధు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తున్న ఇండోనేషియా బ్యాడ్మింటన్ అసోసియేన్ కూడా జిజీ మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆసియా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కూడా జిజీ కన్నుమూతపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. చిన్నతనం నుంచి బ్యాడ్మింటన్ ఆడుతున్న జిజీ 17 ఏళ్ల వయసులోనే అనంత లోకాలకు వెళ్లడం తమను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని పలువురు బ్యాడ్మింటన్ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరం క్రితమే చైనా జాతీయ జట్టులో చేరి.. భవిష్యత్తుగా భరోసా ఇస్తున్న జాంగ్ జిజీ అకస్మాత్తుగా మరణించడం తమను దిగ్ర్భాంతికి గురి చేసిందని చైనా స్టార్ ప్లేయర్లు తెలిపారు. జిజీ మృతి బ్యాడ్మింటన్ అభిమానులకు ఆవేదనను మిగిల్చింది.