అన్వేషించండి

Boxing Day Test: బాక్సింగ్‌ డే టెస్టు ప్రాధాన్యం ఏంటి? ఏటా డిసెంబర్‌ 26నే ఎందుకు ఆడతారు?

బాక్సింగ్‌ డే టెస్టులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అభిమానులు వీటి కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఫుట్‌బాల్‌ సహా ఇతర ఈవెంట్లలోనూ బాక్సింగ్‌డే నాడు మ్యాచులు నిర్వహిస్తుంటారు.

Boxing Day Test: అంతర్జాతీయ క్రికెట్లో బాక్సింగ్‌ డే టెస్టులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అభిమానులు వీటి కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఫుట్‌బాల్‌ సహా ఇతర ఈవెంట్లలోనూ బాక్సింగ్‌డే నాడు మ్యాచులు నిర్వహిస్తుంటారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో ఈ రోజున క్రికెట్‌ మ్యాచులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సారీ 2 టెస్టులు
ఎప్పటిలాగే ఈ ఏడాదీ బాక్సింగ్‌ డే నాడు రెండు టెస్టు మ్యాచులు మొదలవుతున్నాయి. యాషెస్‌ సిరీసులో భాగంగా మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మూడో టెస్టులో తలపడుతున్నాయి. ఇక సెంచూరియన్‌ మైదానంలో మూడు టెస్టుల సిరీసులో భారత్‌, దక్షిణాఫ్రికా మొదటి మ్యాచ్‌ ఆడుతున్నాయి.

ఎలా వచ్చింది?
వాస్తవంగా బాక్సింగ్‌ డే, క్రీడలకు ఎలాంటి సంబంధం లేదు. అయితే మతం, సంస్కృతి పరంగా దీనికి సంబంధం ఉంది. ఇంగ్లాండ్‌లో 1800లో విక్టోరియా మహారాణి సింహాసనాన్ని అధిష్ఠించిన రోజుకు బాక్సింగ్‌ డే అని పేరొచ్చింది. ఇదే సమయంలో క్రిస్‌మస్‌ తర్వాతి రోజు పేదవారికి ధనికులు బాక్సుల్లో బహుమతులు ఇచ్చేవారు. శతాబ్దాల కిందట పనివారికి డిసెంబర్‌ 26న సెలవు ఇచ్చేవారు. ఆధునిక కాలంలో బాక్సింగ్‌ డే నాడు బ్యాంకులకు సెలవులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇక తల్లిదండ్రులు తమ పిల్లలకు బాక్సుల్లో బహుమతులు ఇవ్వడం పరిపాటి. క్రిస్‌మస్‌ పర్వదినాల్లో ఐరోపాలో చర్చిలు బాక్సుల్లో డబ్బులు సేకరించేవి. బాక్సింగ్‌డే రోజు ఆ మొత్తాన్ని విరాళంగా ఇచ్చేవి.

ఇంకా ఏ క్రీడల్లో?
క్రికెట్లోనే కాకుండా ఇతర క్రీడల్లోనూ బాక్సింగ్‌ డే మ్యాచులకు ఎంతో క్రేజ్‌ ఉంటుంది. ఇంగ్లాండ్‌లో ఫుట్‌బాల్‌ మ్యాచులు ఆడటం ఆనవాయితీ. ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచులు ఆడించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ వారం ఆర్సెనల్‌, చెల్సీ, మాంచెస్టర్‌ సిటీ, లీసెస్టర్‌ సిటీ ప్రీమియర్‌ లీగులో పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికాలో ఏటా బాక్సింగ్‌డే నాడు చివరి టెస్టు ఆడతారు. కొత్త ఏడాదిలో న్యూ ఇయర్‌ టెస్టు మొదలు పెడతారు.

Also Read: 83 Film Update: ప్రపంచకప్‌ గెలిచిన రోజు పస్తులతో పడుకున్న కపిల్‌ డెవిల్స్‌..! ఎందుకో తెలుసా?

Also Read: Virat Kohli Captaincy Row: కోహ్లీ, గంగూలీలో ఎవరిది అబద్ధమంటే.. రవిశాస్త్రి కామెంట్స్‌!

Also Read: Thaggedhe Le: ‘నీ అంత బాగా చేయలేదు బన్నీ’ అన్న జడ్డూ.. ఎందుకంటే?

Also Read: IND vs SA: ద్రవిడ్‌ అనుభవం 'బూస్టు' అంటున్న టీమ్‌ఇండియా ఇద్దరు మిత్రులు!

Also Read: Harbhajan Singh Retirement: బంతి పక్కన పెట్టేసిన భజ్జీ.. క్రికెట్ నుంచి పూర్తిగా వీడ్కోలు!

Also Read: Harbhajan Singh retirement: 711 వికెట్లు తీయడమంటే 'దబిడి దిబిడే'.. భజ్జీపై ద్రవిడ్‌, కోహ్లీ ప్రశంసలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Virat Kohli News: వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
UI Movie Leaked Online: రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్
రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్ చేసేశారు
Embed widget