News
News
X

Athiya Shetty and KL Rahul: కేఎల్‌ రాహుల్‌ ప్రేయసి ఆమే..! టీమ్‌ఇండియాలో మరో ప్రేమకథ..! బాలీవుడ్‌ నటితో రాహుల్‌ ప్రేమాయణం!

టీమ్‌ఇండియాలో మరో ప్రేమకథ మొదలైంది. కేఎల్‌ రాహుల్‌ బాలీవుడ్ నటి అతియా శెట్టిని ప్రేమిస్తున్నానని స్పష్టం చేశాడు. బర్త్‌డే గ్రీటింగ్స్‌ ద్వారా ఈ విషయం చెప్పేశాడు.

FOLLOW US: 
 
భారత ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తన ప్రేమ గురించి చెప్పేశాడు! బాలీవుడ్‌ నటి, మోడల్‌ అతియా శెట్టిని ప్రేమిస్తున్నట్టు బహిరంగంగా వ్యక్తపరిచాడు. దాంతో టీమ్‌ఇండియాలో మరో ప్రేమ జంట కహానీ మొదలైంది!

నవంబర్‌ 5 అతియాశెట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు రాహుల్‌ శుభాకాంక్షలు తెలియజేశాడు. 'హ్యాపీ బర్త్‌డే మై లవ్‌ (ఎమోజీ) అతియా శెట్టి' అని సోషల్‌ మీడియాలో కామెంట్‌ పెట్టాడు. గతంలో ఎన్నడూ అతడు ఇలా బహిరంగంగా తన ప్రేమను వ్యక్తం చేయలేదు. అప్పుడప్పుడు ఆమెతో కలిసి దిగిన చిత్రాలు మాత్రం పంచుకొనేవాడు.

News Reels

కేఎల్‌ రాహుల్‌ తన ప్రేమ గురించి చెప్పడంతో క్రికెటర్లు, బాలీవుడ్‌ తారలు అభినందనల వర్షం కురిపించారు. రాహుల్‌ పోస్టుకు లైకులు కురిపించారు. ముఖ్యంగా అతియా తండ్రి సునీల్‌ శెట్టి, సోదరుడు అహన్‌ శెట్టి హార్ట్‌ ఎమోజీలతో స్పందించారు. అనుష్క శర్మ, సయామీ ఖేర్, సానియా మీర్జా, సికందర్‌ ఖేర్‌ లైకులు కొట్టారు. రోహిత్‌ శర్మ సతీమణి రితికా 'అక్కడొక బనానా చిప్‌ ఎమోజీ ఉంటే బాగుండేది అనుకున్నా' అని కామెంట్‌ పెట్టింది. పంజాబ్‌ కింగ్స్‌ క్రికెటర్‌ మన్‌దీప్‌ సింగ్‌ 'హ్యాపీబర్త్‌డే బాబీజీ అతియాశెట్టి' అని వ్యాఖ్యానించాడు.

ప్రస్తుతం అతియాశెట్టి దుబాయ్‌లోనే ఉంది. టీమ్‌ఇండియా క్రికెటర్ల కుటుంబ సభ్యులతో పాటే ఉంటోంది. తన భాగస్వామిగా అతియా పేరును రాహుల్‌ బీసీసీఐ వద్ద నమోదు చేయించాడని ఆలస్యంగా తెలిసింది. స్కాట్లాండ్‌పై బౌండరీలు, సిక్సర్ల వరద పారించేటప్పుడు స్టాండ్స్‌లో అతియా ఎగిరి గంతులేసింది.

View this post on Instagram
 
A post shared by KL Rahul👑 (@rahulkl)

అతియా, రాహుల్‌ చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు! కలిసి చాలా చోట్లకు వెళ్లారు. ఎన్నో పార్టీలకు అటెండ్‌ అయ్యారు. కానీ అధికారికంగా మాత్రం చెప్పేవాళ్లు కాదు. కొన్ని ఇంటర్వ్యూల్లో రాహుల్‌ను ఎవరినైనా ప్రేమించారా అని అడగ్గా తెలివిగా తప్పించుకొనేవాడు. ఇప్పటికైతే క్రికెట్‌తోనే ప్రేమలో పడ్డా అనేవాడు. చాలా సందర్భాల్లో అతియా శెట్టి.. రాహుల్‌తో కలిసిన చిత్రాలను ఇన్‌స్టాలో పెట్టేది. అందులో వారిద్దరూ ఎంతో చనువుగా కనిపించేవారు. ఈ మధ్యే నుమీ పారిస్‌ కళ్లద్దాల యాడ్‌లో కలిసి నటించారు. తాజాగా తెలిసిన విషయం ఏంటంటే వారిద్దరూ ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కోసం మాంచెస్టర్లోనే ఉన్నారట.

Also Read: T20 WC Standings: ఆఫ్ఘన్ పైనే భారం వేశాం.. సెమీస్‌కు ఆ దారి మాత్రమే!

Also Read: IND vs SCO, Match Highlights: 6.3 ఓవర్లలో టార్గెట్ ఫినిష్.. అదరగొట్టిన టీమిండియా!

Also Read: NZ vs NAM, Match Highlights: సెమీస్ వైపు న్యూజిలాండ్.. నమీబియాపై భారీ విజయం

Also Read: Virat Kohli Birthday: 'కోహ్లీ.. నీ గురించి లోకానికి అరిచి చెప్పాలని ఉంది..' విరాట్‌కు అనుష్క స్పెషల్ విషెస్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 06 Nov 2021 04:06 PM (IST) Tags: Sania Mirza bollywood KL Rahul Cricketers Team India Anushka Sharma Athiya Shetty love story

సంబంధిత కథనాలు

FIFA World Cup 2022: క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న ఫ్రాన్స్ - పోలండ్‌పై 3-1తో విజయం!

FIFA World Cup 2022: క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న ఫ్రాన్స్ - పోలండ్‌పై 3-1తో విజయం!

IND Vs BAN 1st ODI: ఇంతకంటే ఘోర ఓటమి ఇంకెప్పుడూ రాదేమో - ఒక్క వికెట్ తేడాతో బంగ్లా విజయం!

IND Vs BAN 1st ODI: ఇంతకంటే ఘోర ఓటమి ఇంకెప్పుడూ రాదేమో - ఒక్క వికెట్ తేడాతో బంగ్లా విజయం!

ARG Vs AUS: 1000వ మ్యాచ్‌లో మెస్సీ గోల్ - ఆస్ట్రేలియాపై 2-1తో అర్జెంటీనా విజయం!

ARG Vs AUS: 1000వ మ్యాచ్‌లో మెస్సీ గోల్ - ఆస్ట్రేలియాపై 2-1తో అర్జెంటీనా విజయం!

IND vs BAN 1st ODI: ఐదు వికెట్లతో మెరిసిన షకీబ్- ఓ మోస్తరు స్కోరుకే ఆలౌట్ అయిన టీమిండియా

IND vs BAN 1st ODI: ఐదు వికెట్లతో మెరిసిన షకీబ్- ఓ మోస్తరు స్కోరుకే ఆలౌట్ అయిన టీమిండియా

Viral Video: పాత బంతిని షైన్ చేసేందుకు కొత్త టెక్నిక్ కనిపెట్టిన జో రూట్- మీరు చూశారా!

Viral Video: పాత బంతిని షైన్ చేసేందుకు కొత్త టెక్నిక్ కనిపెట్టిన జో రూట్- మీరు చూశారా!

టాప్ స్టోరీస్

వార్డెన్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి- పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

వార్డెన్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి- పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

Gujarat Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన ప్రధాని మోదీ

Gujarat Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన ప్రధాని మోదీ

Draupadi Murmu Tirumala Visit: తిరుమలేశుడిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Draupadi Murmu Tirumala Visit: తిరుమలేశుడిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు అయ్యప్ప భక్తులు మృతి, 15 మందికి గాయాలు

Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు అయ్యప్ప భక్తులు మృతి, 15 మందికి గాయాలు