By: ABP Desam | Updated at : 26 Apr 2022 01:33 PM (IST)
Edited By: RamaLakshmibai
Budh Gochar 2022
జ్యోతిషశాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో బుధు గ్రహానికి ప్రత్యేక స్థానముంది. జాతకంలో బుధుడు మంచిస్థానంలో ఉంటే ఆ సమయం వారికి కలిసొస్తుంది. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కానీ బుధుడు బలహీనంగా ఉంటే సమస్యల వలయంలో చిక్కుకుంటారు. బుధుడు 25 ఏప్రిల్ నుంచి జూలై 2 వరకూ వృషభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత మిథునంలో సంచరిస్తాడు. ఈ ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది.
Also Read: మీన రాశిలో గురు గ్రహం సంచారం వల్ల ఈ ఐదు రాశువారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు
బుధుడి సంచారం ఈ రాశుల వారికి కలిసొస్తుంది
వృషభం
బుధుడి సంచారం ఈ రాశిలోనే కావడం వల్ల మీ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. స్థిరాస్తులు కొనాలనే ఆలోచన ఉన్నట్టైతే ఇదే మంచి సమయం...ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
కర్కాటకం
బుధుడి సంచారం కర్కాటక రాశివారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగులకు జీతం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, స్నహితులతో సంతోషంగా ఉంటారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. పెట్టుబడులకు ఇదే అనుకూల సమయం.
సింహం
బుధుడి సంచారం సింహరాశివారికి కలిసొస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో శాంతి, సామరస్యం ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు మంచి టైమ్ ఇదే.
కన్య
ఈ రాశివారికి బుధుడి సంచారం వల్ల కొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతారు. మీపై అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించండి. మీ కుటుంబంతో సంబంధాలు క్షీణించొచ్చు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి.
వృశ్చికం
ఈ రాశి వ్యాపారులకు బుధుడు సంచరించే 68 రోజులు అద్భుతంగా ఉంది. ఈ కాలంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీరు కొత్త వెంచర్లలో పెట్టుబడి పెట్టొచ్చు. ఆరోగ్య పరంగా ఈ సమయం అప్రమత్తంగా ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకుండా ఉండాలి.
ధనస్సు
వృషభంలో బుధుడి ప్రయాణం వల్ల ధనస్సు రాశివారు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ఇదే సరైన సమయం. ఈ కాలంలో విద్యార్థులు ఏకాగ్రతతో చదువుతారు. అనారోగ్య సమస్యలు మాత్రం వేధిస్తాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయొద్దు.
మకరం
విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వ్యాపారులు లాభపడతారు. వివాహితులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి..అనవసర వివాదాల్లో చిక్కుకోవద్దు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
మీనం
బుధుడి సంచారం వల్ల మీనరాశివారికి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో గొడవ పడకండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు అవసరమైన చెకప్ లు చేసుకోవాలి.
Also Read: రాహువు రివర్సయ్యాడు, ఈ రాశులవారు కష్టాల నుంచి బయటపడి ఆర్థికంగా బలపడతారు
నవగ్రహ శ్లోకంలో బుధుడి శ్లోకం
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ |
సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ||
తాత్పర్యం: కదంబ వృక్షపు మొగ్గలా ఆకుపచ్చని రంగు కలవాడు. తన ఆకారంతో ఎవరితో సాటిలేనివాడు. సత్వ గుణం కలిగిన బుధుడికి నేను నమస్కరిస్తున్నాను.
నోట్: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి. కొన్ని పుస్తకాలు, పండితుల సూచనల ఆధారంగా రాసిన వివరాలివి...వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read:శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమే
Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Today Panchang 28 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శనిని ప్రశన్నం చేసుకునే శాంతిమంత్రం
Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!
Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట
Astrology: ఆగస్టులో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!