By: ABP Desam | Updated at : 03 Mar 2022 06:33 AM (IST)
Edited By: RamaLakshmibai
Spirituality- Nara Narayaṇa
ఇంద్రియ లోలత వలన మనిషిలో ఆసక్తి కలుగుతుంది
ఆసక్తి కోరికలకు దారి తీస్తుంది
కోరికలు తీరనప్పుడు కోపం పుడుతుంది
కోపం వ్యామోహానికి బాటలు వేస్తుంది
స్మృతి నశిస్తే బుద్ధినాశం కల్గుతుంది
బుద్ధినాశం వలన మానవ మనుగడ పతనమవుతుంది
అందుకే అహంకారం ధర్మనాశనానికి మూలమని గుర్తించాలి. అహం నశిస్తేనే ఇహం బోధపడుతుంది. ఇహమే దృశ్య ప్రపంచం. మాయను వదిలితే సత్యం బోధపడుతుంది. అందుకే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అహం నుంచి పుట్టాయని గుర్తించి అహాన్ని అంతం చేసుకోవాలి. మనో నైర్మల్యం ఆచార శుద్ధికి దారి తీస్తుంది. ఆచారశుద్ది ఆధ్యాత్మికబుద్ధికి, ఆనందస్థితికి మూలం. ఇందుకు నిదర్శనం నరనారాయణులు. వీరు సనాతన మహర్షులు, తపోనిధులు, ఆచారశీలతకు, ఆధ్యాత్మికనీతికి, ధార్మికరీతికి సాక్ష్యాలు. నిజానికి ఒకే ఒక్క వైష్ణవ తేజం నర నారాయణులు. ఒకప్పుడు వీరు సోదరులు, ఇంకొకప్పుడు మిత్రులు, మరొకప్పుడు గురుశిష్యులు. "పరమాత్మ ఇందుగలడందు లేడను సందేహము వలదుశ్రీ హరి సర్వోపగతుడు. ఎందెందు వెదకూ చిన అందందే గలడు" అంటూ తండ్రికి చెప్పి, స్తంభం నుంచి నరసింహావతారమూర్తి ఆవిర్భావానికి ప్రహ్లాదుడు తెరదీశాడు. దుష్ట దానవుడైన హిరణ్యకశిపుని సంహరించాడు. అవతార లక్ష్యం నెరవేరింది కాని స్వామి భయంకరాకృతికి లోకాలు భయపడిపోయాయ్. అప్పుడు సదాశివుడు శరభరూపంలో నరుడు - సింహాన్ని రెండుగా మార్చి నారసింహ రూపాన్ని చేశాడు. ఈ నరసింహములనే రెండు రూపాలే అనంతర జన్మలో నర నారాయణులుగ జన్మించారు.
Also Read: శివాలయంలో ఉండే నవగ్రహాలకే పవర్ ఎక్కువ ఉంటుందా
నరనారాయణుల పుట్టుక
బ్రహ్మ సృష్టికి సహకరించేందుకు కొందరు ప్రజాపతులు సహాయం చేస్తుంటారు. వీరిలో ఒకరు ధర్మ ప్రజాపతి. ఆ ధర్మ ప్రజాపతి తన సోదరుడు దక్ష ప్రజాపతి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీరి జన్మించిన కవల పిల్లలే నరుడు, నారాయణుడు. వీరిద్దరూ సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తి అవతారమే అని పురాణాలు పేర్కొంటున్నాయి. నర నారాయణులు ఇద్దరూ హిమాలయాల సమీపంలో ఓ వనంలో తపస్సులో మునిగిపోయారు. ఆ వనమంతా రేగుచెట్లు ఉండడంతో వాటినే ఆహారంగా తీసుకుంటూ తపస్సు సాగించారు. రేగుపండుకి బదరీఫలం అన్న పేరు ఉంది కాబట్టి, ఇక్కడ తపస్సు ఆచరించిన నరనారాయణులకి బదరీనాథుడన్న పేరు స్థిరపడింది.
నరనారాయణుల ఘోర తపస్సు గురించి ఎన్నో కథలు
Also Read: శ్రీ వేంకటేశ్వరుడికి శనివారం అంటే ఎందుకు ఇష్టం
నరనారాయణుల క్షేత్రాల్లెన్నో ఉన్నాయి
ఇంతటి ప్రశస్తి కలిగిన నరనారాయణలను పూజిస్తే అంతా శుభమే జరుగుతుందని విశ్వసిస్తారు. నరనారాయణుల ప్రతిమలు లేని పక్షంలో కృష్ణుడు, బదరీనాథుడు, విష్ణుమూర్తి, నరసింహస్వామి... వీరిలో ఎవరిని భర్తిశ్రద్ధలతో పూజించా నరనారాయణుల అనుగ్రహం లభించినట్టే.
Vaikunta Ekadasi December 2023: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!
Horoscope Today November 29, 2023: ఈ రాశులవారు ఒత్తిడి తగ్గించుకోకుంటే కష్టమే, నవంబరు 29 రాశిఫలాలు
Karthika Masam Ending Poli Swargam 2023 Date: కార్తీకమాసం ఎప్పటితో పూర్తవుతుంది - ఆఖరి రోజు చదువుకోవాల్సిన కథ ఇదే!
Karthika Masam 2023:ఈ పత్రాలు త్రిశూలానికి సంకేతం - అందుకే శివపూజలో ప్రత్యేకం!
Ashtadasa Maha Puranas: అష్టాదశ పురాణాలు ఏవి - ఏ పురాణంలో ఏముంది!
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి
/body>