News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Weekly Horoscope Telugu: మీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఈ వారం జరగబోతోంది, ఆగస్టు 15 నుంచి 21 వరకు రాశిఫలాలు

Weekly Horoscope 15 To 21 August:ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీజాతకం,గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Weekly Horoscope  15 To 21 August 2022

మేషం 
మేష రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. ఏ పని మొదలెట్టినా పూర్తిచేసి తీరుతారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఖర్చులు పెరుగుతాయి కానీ అవసరానికి డబ్బు చేతికందుతుంది. వ్యాపారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. నిర్ణయాల్లో స్థిరత్వం ఉండదు.

వృషభం 
ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. అనుకున్న పనిని అనుకున్నట్టు పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆస్తుల కొనుగోలులో ఉన్న సందిగ్ధం తొలగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారాల్లో లాభాలుంటాయి. అనవసరమైన విషయాలకోసం ఎక్కువ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. గొడవలకు దూరంగా ఉండండి. వారం మధ్యలో ఖర్చులుంటాయి. గత అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకుంటారు.

మిథునం 
ఈ వారం మీకు మిశ్రమఫలితాలున్నాయి. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. మీ మంచితనం, సహనమే మీకు శ్రీ రామరక్ష. విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు జోరందుకుంటాయి. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయ వర్గాలవారికి మంచి సమయం. ఈ వారం అనారోగ్య సమస్యలు, ఆందోళనలు ఉన్నాయి జాగ్రత్త.

Also Read:  రాశిమారిన అంగారకుడు, ఈ రాశులవారికి ఆరోగ్యం, ఆదాయం, ఆనందం

కర్కాటకం 
ఈ వారం మీ టైం బావుంటుంది. అనుకున్న పనులు పూర్తిచేయాలన్న పట్టుదలతో ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగుపడుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. అనవసర మొహమాటానికి పోవద్దు..చెప్పాలనుకున్న విషయం సూటిగా చెప్పాలి. మీ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. కళారంగం వారికి ఆశలు నెరవేరుతాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు.

సింహం 
మొదలెట్టిన పనులు పూర్తిచేస్తారు. ఫ్యూచర్ కోసం కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. మీ రంగంలో మీరు మంచి ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వాహనం కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలొస్తాయి. రాజకీయవర్గాల వారికి శుభసమయం. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. 

కన్య 
చేపట్టిన పనుల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి. అదనపు ఆదాయవనరులు ప్లాన్ చేసుకుంటారు. జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన ఎదురుకావచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి.వ్యాపారాల్లో మీరు అనుకున్న టార్గెట్ చేరుకుంటారు. ఉద్యోగాల్లో మీదే పైచేయి. ఆత్మీయులతో విభేదాలు రావొచ్చు. ప్రశాంతంగా ఆలోచించాలి. వారం చివరిలో కొన్ని ఇబ్బందులుంటాయి. అపార్థాలకు ఛాన్సివ్వకండి. బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు.

 Also Read:  వృషభ రాశిలో కుజుడి సంచారం, ఈ 5 రాశులవారికి అన్నీ సవాళ్లే!

తుల 
ఎంత పెద్ద నిర్ణయాన్ని అయినా ఆలోచించి తీసుకోవాలి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆస్తుల కొనుగోలు వ్యవహారాలు ముందుకు సాగుతాయి. వ్యాపారంలో మీ అంచనాలు ఫలిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగుతారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. కళారంగం వారికి అనుకూల సమయం. 

వృశ్చికం
ఈ రాశివారికి మంచి టైం నడుస్తోంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇల్లు, వాహనం కొనుగోలు ప్రయత్నాలు సక్సెస్ ఫుల్ గా సాగుతాయి. ఆదాయం బావుంటుంది, స్థిరాస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు.  కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు విలువనివ్వండి. రాజకీయవర్గాలకు మరింత ఆదరణ లభిస్తుంది. 

ధనుస్సు 
కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇదే మంచి సమయం. ఉద్యోగులు, వ్యాపారులు గుడ్ న్యూస్ వింటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. విద్యార్థులు లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులుంటాయి.

Also Read: ఈ 5 రాశుల అబ్బాయిలను పెళ్లిచేసుకున్న అమ్మాయిలు అదృష్టవంతులు

మకరం
ఈ రాశివారికి ఈ వారం గ్రహబలం తక్కువగా ఉంది. అనుకున్న పనులు  ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. వ్యాపారులు ఆచితూచి ముందుకు సాగడం మంచిది. రాజకీయవర్గాల కృషి ఫలించక నిరాశ చెందుతారు. ఓ వార్త మీకు బాధని కలిగిస్తుంది.

కుంభం
ఈ వారం మీకు అనకూలంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు టైం కలిసొస్తుంది. వ్యాపారులకు లాభాలొస్తాయి. ఉద్యోగాల్లో మార్పులుంటాయి. పారిశ్రామివర్గాల వారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు.అనవసర ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. 

మీనం 
ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. ఆస్తి వివాదాలు తొలగిపోయి లబ్ది పొందుతారు. ఉద్యోగులు ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారాలు లాభిసాటిగా సాగుతాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలుంటాయి.అనారోగ్య సమస్యలు, కుటుంబ ఒత్తిడులు ఉంటాయి జాగ్రత్త. బాధ్యతలు పెరుగుతాయి. 

Published at : 15 Aug 2022 06:26 AM (IST) Tags: Weekly Horoscope 15 To 21 August astrology predictions weekly horoscope saptahik rashifal 15 to 21 august 2022

ఇవి కూడా చూడండి

Karthika Masam Ending Poli Swargam 2023 Date: కార్తీకమాసం ఎప్పటితో పూర్తవుతుంది - ఆఖరి రోజు చదువుకోవాల్సిన కథ ఇదే!

Karthika Masam Ending Poli Swargam 2023 Date: కార్తీకమాసం ఎప్పటితో పూర్తవుతుంది - ఆఖరి రోజు చదువుకోవాల్సిన కథ ఇదే!

Karthika Masam 2023:ఈ పత్రాలు త్రిశూలానికి సంకేతం - అందుకే శివపూజలో ప్రత్యేకం!

Karthika Masam 2023:ఈ పత్రాలు త్రిశూలానికి సంకేతం - అందుకే శివపూజలో ప్రత్యేకం!

Ashtadasa Maha Puranas: అష్టాదశ పురాణాలు ఏవి - ఏ పురాణంలో ఏముంది!

Ashtadasa Maha Puranas: అష్టాదశ పురాణాలు ఏవి  - ఏ పురాణంలో ఏముంది!

Horoscope Today November 28, 2023: ఈ రాశివారికి ఆదాయం, పనిభారం రెండూ పెరుగుతాయి - నవంబరు 28 రాశిఫలాలు

Horoscope Today November 28, 2023: ఈ రాశివారికి ఆదాయం, పనిభారం రెండూ పెరుగుతాయి - నవంబరు 28 రాశిఫలాలు

Lakshmi Puja : దరిద్రుడిని కూడా ధనవంతుడిని చేసే పూజ ఇది - ఇలా చేస్తే కాసుల వర్షం కురుస్తుంది

Lakshmi Puja : దరిద్రుడిని కూడా ధనవంతుడిని చేసే పూజ ఇది - ఇలా చేస్తే కాసుల వర్షం కురుస్తుంది

టాప్ స్టోరీస్

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల

Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి

Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి

Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !

Telangana Elections 2023 :  కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు