Vinayaka Chavithi Pooja Time 2022: వినాయక చవితి పూజ ముహూర్తం వివరాలు, ఎలాంటి విగ్రహం కొనుగోలు చేయాలో తెలుసా!
Ganesh Chaturthi 2022 Pooja Timings : ఏబీపీ దేశం ఫాలోవర్స్ కి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు పూజ ఏ సమయానికి చేయాలి..పూజ ముహూర్తం ఇక్కడ తెలుసుకోండి...
Ganesh Chaturthi 2022 Pooja Timings
శ్లోకం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే!
శ్లోకం
వక్రతుండ మహాకాయ..కోటి సూర్య సమప్రభ...
నిర్విఘ్నం కురుమే దేవ..సర్వకార్యేషు సర్వదా...
విజయానికి మారు పేరు వినాయకుడు. ఏ పనైనా విఘ్నేశ్వరుడిని తలుచుకుని ప్రారంభిస్తే విజయవంతం అవుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఏ పని తలపెట్టినా, ఎంత పెద్ద పూజ, యజ్ఞయాగాలు చేసినా లంబోదరుడి ప్రార్థన లేకుండా మొదలుకాదు. తద్వారా వినాయకుడే దగ్గరుండి ఎలాంటి తప్పిదాలు, కార్యహాని లేకుండా చేస్తాడని పురాణాలు చెబుతున్నాయ్. నిత్యం పిల్లలతో వినాయకుడి శ్లోకాలు చదివించినా, వినిపించినా ఉత్తమ ఫలితాలు పొందుతారని చెబుతారు.
Also Read: అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..
వినాయకచవితి ముహూర్తం
ఏటా వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షంలో నాలుగో తిథి అయిన చవితి రోజు వస్తుంది. చవితి నుంచి చతుర్థశి వరకూ ప్రత్యేక పూజలందుకున్న గణనాథుడిని ఆ తర్వాత వైభవంగా గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఈ ఏడాది ఆగస్టు 31 బుధవారం వినాయకచవితి వచ్చింది...
- ఆగస్టు 30 మంగళవారం మధ్యాహ్నం దాదాపు 2 గంటల 29 నిముషాలకు చవితి ఘడియలు ప్రారంభమయ్యాయి
- ఆగస్టు 31 బుధవారం మధ్యాహ్నం 2 గంటలవరకూ చవితి ఉంది..తదుపతి పంచమి ప్రారంభమవుతుంది
- సాధారణంగా సూర్యోదయమే లెక్క కాబట్టి..వినాయకచవితి ఎప్పుడు జరుపుకోవాలన్నది ఎలాంటి సందేహం లేదు.
- ఆగస్టు 31 బుధవారం రోజు వర్జ్యం ఉదయం 7.55 నుంచి 9.31 వరకు ఉంది
- ఇదే రోజు దుర్ముహూర్త కూడా ఉదయం 11.35 నుంచి 12.23 వరకు ఉంది
- అందుకే బుధవారం వినాయకపూజ చేసేవారు వర్జ్యం,దుర్ముహూర్తం ఘడియలు లేకుండా చూసుకోవాలి.
- ఉదయం 7.55 లోపు లేదంటే... తొమ్మిదిన్నర దాటిన తర్వాత పూజ చేసుకోవడం మంచిది
- మళ్లీ పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్య కూడా ( దుర్ముహూర్తం సమయం) పూజ ప్రారంభించవద్దు
- మీరు పూజ ప్రారంభించిన తర్వాత వర్జ్యం, దుర్ముహూర్తం ఉన్నా పర్వాలేదు...ప్రారంభసమయమే పరిగణలోకి తీసుకోవాలి.
Also Read: పడమర-దక్షిణం వైపు తిరిగి భోజనం చేస్తే ఏం జరుగుతుంది... తినడానికి కూడా రూల్స్ ఉన్నాయా..!
తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు
- వినాయక విగ్రహాన్ని కొనుగోలుచేసేవారు తొండం ఎడమ వైపున ఉండేలా చూసుకోవాలి
- రసాయనాల్లో ముంచితీసిన వినాయకుడిని కాకుండా మట్టి విగ్రహం వినియోగించడం మంచిది
- పార్వతీ తనయుడు నైవేద్య ప్రియుడు..అందుకే మండపాల్లో ఉండే స్వామివారికి నిత్యం నైవేద్యం సమర్పించినట్టే ఇంట్లో మీరు ఎన్నిరోజులు ఉంచితే అన్ని రోజులూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా వినాయకుడికి ఇష్టమైన వంటకాలైన కుడుములు, మోదకం, లడ్డు సహా పలు పిండివంటలు నైవేద్యం పెట్టాలి
- విగ్రహ నిమజ్జనం కోసం కచ్చితంగా నదులు, సముద్రాల వద్దకే వెళ్లాల్సిన అవసరం లేదు. నదిలో కలిసే పిల్లకాలువలో నిమజ్జనం చేయొచ్చు
- శుభ్రంచేసిన బకెట్లో నింపిన నీళ్లలో కూడా వినాయకుడిని నిమజ్జం చేసి ఆ నీటిని చెట్లకు పోయాలి.
శ్రీ గణేశ ద్వాదశ నామం - Sri Ganesha Dwadasa nama Stotram
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ||
అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో య స్సురాసురైః |
సర్వవిఘ్న హర స్తస్మైగణాధిపతయే నమః ||
గణానమధిపశ్చండో గజవక్త్ర స్త్రిలోచనః |
ప్రసన్నోభవ మే నిత్యంవరదాతర్వినాయక ||
సుముఖశ్చైకదంతశ్చ కపిలోగజకర్ణకః |
లంబోదరశ్చ వికటో విఘ్ననాశో వినాయకః ||
ధూమ్రకేతుః గణాధ్యక్షో భాలచంద్రో గజాననః |
ద్వాదశైతాని నామాని గణేశస్య చయః పఠేత్ ||
విద్యార్థీ లభతేవిద్యాం, ధనార్థీ విపులం ధనమ్ |
ఇష్టకామం తు కామార్థీ , ధర్మార్థీ మోక్షమక్షయమ్ ||
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సంకటేచైవ విఘ్నస్తస్య నజాయతే ||
ఇతి ముద్గలోక్తం శ్రీగణేశ ద్వాదశనామస్తోత్రం సంపూర్ణమ్ ||