తులసి మొక్క మీ ఇంట్లో ఈ దిక్కున ఉంటే సిరిసంపదలకు లోటుండదు
మీ ఇంట్లో తులసి మొక్క ఉందా? ఉంటే, ఏ దిక్కున పెట్టారు? తులసి మొక్కకు కూడా వాస్తు వర్తిస్తుంది. ఏ దిక్కున పెడితే మీకు మేలు జరుగుతుందో చూడండి.
తులసి మొక్క పవిత్రమైంది మాత్రమే కాదు, ఔషద మొక్క కూడా. అందుకే ప్రతి హిందూ ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటారు. పూజించుకుంటారు. తులసి ఉన్న ఇల్లు సుఖశాంతులతో, సిరిసంపదలతో తులతూగుతుందని ప్రతీతి. ఎవరి గృహంలో తులసి మొక్క ఉన్నా.. గృహం తీర్థ స్వరూపం అని శాస్త్రం చెబుతోంది. తులసి దళాలతో శివకేశవులను పూజించిన వారికి మోక్షం ప్రాప్తిస్తుందని నమ్మకం. నర్మదా నదిని చూడడం, గంగా స్నానం చేయడం, తులసి వనాన్ని సేవించడం.. ఈ మూడు సమాన ఫలములను ఇస్తాయి. ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక సుద్ధ పౌర్ణమి వరకు చాత్రుమాస్య దీక్ష ఈ సమయంలో తులసి మొక్కను చోటు మార్చి పాత రాదు.
ఇంట్లో తులసి మొక్క ఎక్కడుండాలి?
ఇంట్లో తులసి మొక్క ఉంటే ప్రసరించే గాలి శుద్ధి చెయ్యబడుతుంది. గాలిలోని హానికారక కెమికల్స్ ను శోషణ చేస్తుంది. ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా నిరోధిస్తుంది. తులసి మొక్కను పెంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు రాకుండా తులసి కాపాడుతుంది. ఇంట్లోకి సౌబాగ్యం తెస్తుంది. ధనవృద్ధికి దోహదం చేస్తుంది. కుటుంబ ఆర్థిక స్థితి మెరుగు పడడానికి తులసి మొక్క తప్పకుండా పెంచుకోవాలి. కుటుంబ సభ్యుల రక్షణకు కూడా తులసి మొక్క పెంచడం మంచి ఉపాయం. ఎందుకంటే తులసి దిష్టి నుంచి కూడా ఇంటిని కాపాడుతుంది. తులసి మొక్క ఉన్న ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి.
వాస్తును అనుసరించి తులసి మొక్కను ఇంటిలో సరైన స్థానంలో ఉంచాలి. అప్పుడే తులసి వల్ల కలగాల్సిన అన్ని లాభాలు కలుగుతాయి. తులసి మొక్కను తూర్పు దిక్కున పెట్టుకోవడం అన్నింటికంటే శ్రేష్టంగా చెబుతారు. అక్కడ పెట్టే అవకాశం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్యంలో బాల్కనీ లేదా కిటికిలో పెట్టుకోవచ్చు. మొక్కకి సరిపడేంత వెలుతురు కూడా ఉండే విధంగా జాగ్రత్త పడాలి. పూజ గదిలో కుండిలో ఏర్పాటు చేసుకుని వెలుతురు తగిలేలా జాగ్రత్త పడితే సరిసోతుంది. ప్రతి రోజూ సంధ్యా సమయంలో తులసి దగ్గర దీపం వెలిగించాలి. ఎందుకంటే తులసిని లక్ష్మీ దేవి భౌతిక రూపంగా బావించి కొలుకుంటారు.
కార్తీక మాసంలో తులసి మొక్క నాటుకోవడం మంచిది. ఆకుపచ్చని ఆకులతో ఉండే శ్రీతులసిని ఇంట్లో పెంచుకుంటే అదృష్టం అని నమ్ముతారు. ముదురాకుపచ్చ రంగు ఆకులుండే తులసిని కృష్ణ తులసి అంటారు. ఈ రెండు రకాల తులసి మొక్కలను ఇంట్లో పెంచుకోవచ్చు. తులసి మొక్కలు ఒకటి, మూడు, ఐదు ఇలా బేసి సంఖ్యలో మొక్కులు పెట్టుకోవాలి. తులసి మొక్క పరిసరాలు ఎప్పుడూ శుభ్రంగా అందంగా ఉండేలా చూసుకోవాలి.
తప్పక పాటించాల్సిన కొన్ని నియమాలు
⦿ స్త్రీలు ఎప్పుడూ తులసి దళాలు కొయ్యరాదు
⦿ పురుషులైనా సరే బహుళ పక్షంలోని అష్టమీ, చతుర్దశి, అమావాస్య తిథులలో లేదా పౌర్ణమి నాడు గానీ ఉభయపక్షాలలో ఏకాదశి, ద్వాదశి తిథులలో గానీ ఆది, మంగళ, శుక్రవారాలలో గానీ అసలు తులసి దళాలు కోయకూడదు.
⦿ ద్వాదశి నాడు తులసిని తాక కూడదు. తులసీ దళాలను ఒడిలోకి కొయ్య కూడదు. ఆకులోకి లేదా ఏదైనా పళ్లెంలోకి కొయ్యాలి. తులసి దళాలను నేలమీద నేరుగా ఉంచకూడదు.
⦿ తులసి కోటలోని మట్టిలో ఎక్కువగా పసుపు కుంకుమ, అక్షతలు వెయ్యకూడదు. అలా చేస్తే ఆ మట్టిలో పోషకాలు నశించి మొక్క ఎక్కువ కాలం నిలవదు. పూజలో పసుపు, కుంకుమ వెయ్యాల్సి వస్తే కోట బయట మొదట్లో వేస్తే సరిపోతుంది.