Vastu Tips: వృత్తి వ్యాపారాల్లో సక్సెస్ కావాలంటే.. ఈ వాస్తు చిట్కాలు పాటించి చూడండి
Vastu Tips in Telugu: వాస్తు పురాతనమైన శాస్త్రపరిజ్ఞానం. ఇది జీవితాన్ని నడిపే సరైన విధానాలను వివరిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో విజయాలు సాధించడానికి వాస్తు కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుసుకుందాం.
జీవితంలో కెరీర్‌లో విజయాలు సాధించడమనేది చాలా సందర్భాల్లో చాలా ముఖ్యమైన విషయం. కొంత మంది వృత్తి వ్యాపారాల్లొ స్థిరత్వాన్ని సాధించడానికి చాలా కష్టపడుతుంటారు. వాస్తులో ఈ సమస్య పరిష్కారానికి కొన్ని సులవైన చిట్కాలు ఉన్నాయి. జీవితంలోని కొన్ని కోణాలను సంతులన పరచడం ద్వారా వాస్తు చాలా సమస్యలను పరిష్కరిస్తుంది. ఇక్కడ సూచించిన ఈ చిట్కాలు తప్పకుండా వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధించవచ్చు.
- పనిచేసుకునే చోట వెనకవైపు ఉన్న గోడ మన పనిచేసే సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందట. శిఖరాల బొమ్మలు ఉన్న పెయింటింగ్ లేదా ఫోటోను ఆ గోడమీద పెట్టుకోవాలి. ఇది మిమ్మల్ని విజయశిఖరాలను చేర్చుతుంది.
- ఓపెన్ గా ఉండే ప్రదేశంలో రద్దీగా ఉండే ప్రదేశంలో పనిచేస్తుంటే ఏకాగ్రత సాధ్యం కాదు. అలాంటపుడు గాజు చాంబర్ ఏర్పాటు చేసుకోవాలి. ఇది సృజనాత్మక ఆలోచనలను పెంచుతుంది.
- మీ సీట్ నైరుతిలో ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ నిర్వహించే సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి. ఆఫీసులో కాన్ఫెరెన్స్ గది నైరుతిలో నిర్మించుకుంటే మంచి పలితం ఉంటుంది. కాన్ఫరెన్స్ గదిలో ద్వారానికి దూరంగా నైరుతిలో ఉండేలా జాగ్రత్త పడాలి.
- ఆఫీసులో ఆగ్నేయం వైపున మొక్కలు పెంచుకోవాలి. ఇది వ్యాపార వృద్ధికి, సంపదను అందిస్తాయి.
- ఆగ్నేయంలోనే ఒక దీపం లేదా లైట్ ఏర్పాటు చెయ్యాలి. ఇది అదృష్టాన్ని, సమృద్ధిని ఇస్తుంది.
- మీరే మీ ఆఫీసుకు యజమాని అయితే ఈశాన్యంలో మీరు పనిచేసుకునే డెస్క్ ఏర్పాటు చేసుకోవాలి. పనిచేసే డెస్క్ ఎప్పుడూ శుభ్రంగా చెత్త లేకుండా ఉండాలి. ఈ చిన్న చిట్కా అదృష్టాన్ని సమృద్ధిని కలిగిస్తుంది. టేబుల్ మీద టెబుల్ లైట్ ఉంటే అది డెస్క్ మీద ఆగ్నేయంలో ఉంటేట్టు జాగ్రత్త పడాలి.
- ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నట్టయితే మీ డెస్క్ ఉత్తరం లేదా తూర్పువైపున ఉంటే మంచిది. ఇది మీ పనిచేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ కెరీర్ అభివృద్ధి పథంలో ఉంటుంది.
- మీ వెనక ఉన్న గోడమీద వాటర్ ఫాల్, నీళ్లు, సముద్రం ఉన్న పోస్టర్లు ఉంచుకోవద్దు. ఇది మీకు సపోర్ట్ లేకుండా చేస్తుంది.
- ఆఫీసులో విరిగిన ఫర్నిచర్ ఇతర వస్తువులు ఏమున్నా సరే వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఇలాంటి వస్తువులు పరిసరాల్లో నెగెటివ్ ఎనర్జీ వ్యాపింపజేస్తాయి.
- వేడిని ఉత్పత్తి చేసే గాడ్జెట్స్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను ఆగ్నేయంలో అమర్చుకోవడం మంచిది.
- పనిచేసే ప్రదేశంలో వెంటిలేటర్ ఉండేలా జాగ్రత్తపడాలి. గాలీ వెలుతురు ఉండే ప్రదేశంలో సకారాత్మక శక్తి వ్యాపిస్తుంది.
- ఆఫీసులో గ్లాస్ టేబుల్స్ అంత మంచిదికాదు. ఒకవేళ ఆఫీసులో అలాంటివి అమర్చుకుంటే పశ్చిమాన ఇలాంటి టేబుల్ పెట్టాలి. టేబుల్ మీది గ్లాస్ పగిలితే వెంటనే ఆ టెబుల్ తీసెయ్యడం మంచిది.
- ఆఫీసులో ఏదైనా నీటి కుళాయి లీకేజీలు ఉంటే వెంటనే వాటిని బాగుచేయించాలి. నీటి వృథా ఆర్థిక నష్టానికి కారణం కాగలదు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.