అన్వేషించండి

House Warming Rituals: కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు ఈ 9 పనులు తప్పనిసరి

House Warming Rituals: కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు లేదా కొత్త ఇంట్లో నివసించే ముందు గృహప్రవేశ వేడుక నిర్వహిస్తారు. గృహ ప్రవేశం చేసేటప్పుడు మీరు ఈ పనులన్నీ చేయాలి.

Griha Pravesh Rituals: చనిపోయేలోపు కనీసం చిన్న ఇల్లు కట్టుకోవాలన్నది చాలా మంది కల. కొత్త ఇల్లు కొనేటప్పుడు లేదా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మనం సంప్ర‌దాయాల‌ను, ఆచారాలను పాటించడం లేదా అనుసరించడం చాలా ముఖ్యం. మన శాస్త్రాలు, ధార్మిక గ్రంధాలు కొత్త ఇంట్లోకి ప్ర‌వేశించేట‌ప్పుడు విధిగా గృహప్రవేశ వేడుక‌ చేయాలని చెబుతున్నాయి. కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మనం ఎలాంటి ఆచారాలను పాటించాలో తెలుసా?

శుభ ముహూర్తం
కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు, శుభ దినం, శుభ ముహూర్తంతో కొత్త గృహ ప్రవేశం చేయడం చాలా ముఖ్యం. కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు, సంఖ్యా శాస్త్రం, చంద్ర దశ, క్యాలెండర్ లేదా రాశి ఆధారంగా గ్రహ ప్రవేశ ముహూర్తం నిర్ణయిస్తారు. ఏదైనా ఒక శుభదినం లేదా శుభ తిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం, శాంతి, సంతోషాలు నెలకొంటాయని హిందువుల‌ విశ్వాసం.

Also Read : ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆపేశారా, అయినప్పటికీ ఈ పనులు మాత్రం పూర్తిచేయాల్సిందే

కొత్త చీపుర్లు కొనుగోలు
మీరు నిజంగా ఇంటి నుంచి పాత మురికిని, ఇబ్బందులను తొలగించాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు పాత ఇంట్లో వాడిన‌ చీపుర్లను విసిరివేసి కొత్త ఇంటికి కొత్త చీపుర్లను తీసుకురావాలి. చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. చీపురు పట్టుకుని కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించడం. ఈ కారణంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీపురుతో ఇంట్లోకి ప్రవేశిస్తారు.

ధాన్యం
ఆహారం చాలా ప్రాథమిక విషయాలలో ఒకటి. ఈ కారణంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకువస్తారు. ధాన్యంతో కొత్త గృహ ప్రవేశం చేయడం వల్ల ఇంట్లో తిండికి లోటుండదని నమ్ముతారు. తృణధాన్యాలతో స్వీట్లు కూడా ఇంటికి తీసుకెళతారు.

కొబ్బరి చెట్టు నాటడం
కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం ఆనవాయితీ. సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైందని చెబుతారు. కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా అంటారు. హిందూమతంలో కొబ్బ‌రి చెట్టును తల్లిలా భావించి పూజిస్తారు. కొబ్బరి మొక్కతో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల లక్ష్మీ క‌టాక్షం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.

పాలు పొంగించ‌డం
హిందూ సంప్రదాయం ప్రకారం, కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, ఆ ఇంట్లోని కొత్త పొయ్యిపై పాలు కాచే ఆచారం ఉంది. ఈ ఆచారం ఆహారం సమృద్ధిగా ల‌భించేలా చూస్తుంద‌ని న‌మ్ముతారు. ఇది కొత్త ఇంటికి భ‌గ‌వంతుడి ఆశీర్వాదాన్ని తెస్తుంది. పాలను మరిగించిన తర్వాత, ఆ పాలను ఇష్టదేవతకు నైవేద్యంగా పెడతారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన అతిథులకు ఆ పాలతో తీపి వంట‌కం త‌యారు చేసి పెడ‌తారు.

ఆవుతో ప్రవేశం
కొత్త ఇల్లు కట్టినప్పుడు, ఆవు అంటే కామధేనువుని గృహ‌ప్ర‌వేశం రోజు తీసుకువెళతారు. ఈ సమయంలో ఆవును పూజించి, పూలతో, పసుపు, కుంకుమలతో అలంకరించి ఇంటి ప్రధాన ద్వారం గుండా తీసుకెళ‌తారు. ఆవును ఇంటికి తీసుకెళ్లడం ద్వారా మూడు కోట్ల మంది దేవతలు ఇంట్లోకి ప్రవేశించినట్లే అని నమ్ముతారు. తర్వాత ఆవుకు మిఠాయిలు నైవేద్యంగా పెట్టి ఆ రోజు తొలి ఆహారాన్ని ఆవుకు నైవేద్యంగా పెట్టి హారతి ఇస్తారు.

క‌ల‌శంతో పూజ‌
గృహ ప్రవేశ పూజ అనేది హిందూ దేవతలు నుంచి దీవెనలు పొందేందుకు, ఇంటిని రక్షించడానికి, సానుకూల శక్తులతో నింపడానికి నిర్వ‌హించే పవిత్రమైన కార్య‌క్ర‌మం. కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు, శక్తిని శుద్ధి చేయడానికి, ఇంటిని సానుకూల శక్తితో నింపడానికి పూజ సమయంలో కొత్త కలశాన్ని ఉంచి గణ‌ప‌తి పూజ, వాస్తు దోష పూజ, నవగ్రహ శాంతి పూజల తర్వాత హవనం నిర్వ‌హిస్తారు.

దేవుడి ప‌టం
కొత్త ఇంట్లోకి అడుగుపెట్టగానే దేవుడి ప‌టం తెచ్చి పెడతారు. కొత్త ఇంట్లోని దేవుని గదిలో భ‌గ‌వంతుడి చిత్ర‌ప‌టాన్ని ఉంచ‌డం చాలా శుభప్రదం. ఇక్కడ మీరు దేవుని చిత్ర‌ప‌టాన్ని ఏ దిశలో ఉంచాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Also Read : ఇలాంటి ఇళ్లలో లక్ష్మీ ఎన్నటికీ నిలిచి ఉండదట, కారణం తెలుసా?

దానధ‌ర్మాలు
కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు దానధర్మాలు చేస్తారు. ఈ సమయంలో సుమంగళిలకు పసుపు, కుంకుమ, కంకణాలు, వస్త్రాలు తదితరాలను వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు. పేదలకు కూడా వారికి చేతనైనంత డబ్బు, భోజనం, దుస్తులు ఇస్తారు. బ్రాహ్మణులకు భోజనం పెట్టి దుస్తులు అంద‌జేస్తారు. దీంతో పాటు కొన్ని సంప్రదాయాల్లో ఆ ఇంటి నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ బహుమతులు అందజేస్తారు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget