Vastu Tips: ఇలాంటి ఇళ్లలో లక్ష్మీ ఎన్నటికీ నిలిచి ఉండదట, కారణం తెలుసా?
తెలిసీ తెలియక చేసే తప్పులు తప్పకుండా కష్టాల పాలు చేస్తాయని శాస్త్రం చెబుతోంది. వాస్తు చెప్పిన దాన్ని బట్టి కొన్ని రకాల తప్పులను లక్ష్మీ దేవి అసలు ఉపేక్షించదట.
జీవితం సౌకర్యంగా, సంతోషంగా గడిచేందుకు డబ్బు అవసరం ఉంటుంది. ఇందుకు ఐశ్వర్యాధిపతి లక్ష్మీకటాక్షం తప్పనిసరి. తెలిసీ తెలియక చేసే తప్పులు తప్పకుండా కష్టాల పాలు చేస్తాయని శాస్త్రం చెబుతోంది. వాస్తు చెప్పిన దాన్ని బట్టి కొన్ని రకాల తప్పులను లక్ష్మీ దేవి అసలు ఉపేక్షించదట. అందువల్ల ఆర్థిక కష్టాల్లోంచి బయట పడలేరని పండితులు అంటున్నారు. అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడాలంటే ముందు మనకు అవేమిటో తెలుసి ఉండడం అవసరం. అవి తెలుసుకుంటే ఇప్పటి వరకు చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు. ఇక ముందు తప్పులు జరగకుండా జాగ్రత్త పడొచ్చు. కనుక వాటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
లక్ష్మీ కటాక్షానికి వాస్తులో కొన్ని మార్గాలు సూచించారు. వాటితో పాటు లక్ష్మికి కోపం తెప్పించే కొన్ని తప్పుల గురించి కూడా ప్రస్తావించారు. ఇలా తప్పులు జరిగే చోట లక్ష్మీ ఎప్పటికీ నిలవదు. ఆర్థిక సంక్షోభాలు ఎన్నటికీ తీరవు. అంతేకాదు ఆర్థిక కష్టాల వల్ల ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక చికాకు వెంటాడుతూ ఉంటుంది. జీవితం సుఖమయంగా ఉండాలంటే ఈ తప్పులు చెయ్యకూడదు.
ఇలాంటి ఇళ్లలో లక్ష్మి నిలవదు
- బద్ధకంగా సమయం గడిపే మనుషులు మసలే ఇంట్లో లక్ష్మీ నిలిచి ఉండదు. సమయం వృథా చేస్తూ ఖాళీగా గడిపే మనుషులు ఉండే చోట లక్ష్మీ కాలు మోపదు. వారసత్వంగా కోట్లాది ఆస్తి సంక్రమించినా సరే ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటే అది అతి త్వరలో కర్పూరంలా కరిగిపోతుందట. ఆర్థిక సంక్షోభాలు తీరే మార్గమే ఉండదని శాస్త్రం చెబుతోంది.
- శుభ్రమైన ప్రదేశాలంటే లక్ష్మీ దేవికి చాలా ఇష్టం. శుభ్రమైన ప్రదేశాలను వదిలి వెళ్లనే వెళ్లదు. అపరిశుభ్ర పరిసరాలు దారిద్ర్యానికి అనవాలు. కష్టించి పనిచేసినా సరే పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే అక్కడ సిరి నిలవదు. కనుక పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యం.
- ఇతరుల సంపద మీద దృష్టి పెట్టే వారి ఇళ్లలో కూడా లక్ష్మి నిలవదు. డబ్బు సంపాదించేందుకు తప్పుడు దారుల్లో వెళ్లే వారికి కూడా లక్ష్మీకటాక్షం లభించదు. ఇతరుల మీద ఈర్ష్య పడేవారికి ఎన్నటికీ డబ్బు దొరకదు. మోసపూరితంగా సంపాదించిన డబ్బు తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చినా అది నిలవదట. త్వరలోనే ఆర్థిక కష్టాలు వెంటాడుతాయట. ఇతరులకు పడి ఏడిచే వారు తప్పక దరిద్ర్యాన్ని అనుభవిస్తారని శాస్త్రం చెబుతోంది.
- ఏ ఇంట్లో అయితే పసి పిల్లలు, స్త్రీలు, వృద్ధులు సముచిత స్థానాల్లో ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది. స్త్రీల పట్ల అనుచిత ప్రవర్తన కలిగిన కుటుంబాలు తప్పక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటారట. అలాగే వృద్ధులకు సరైన గౌరవం దొరకని ఇంట్లోనూ లక్ష్మి నిలిచి ఉండదని పండితులు చెబుతున్నారు. కనుక ఇంట్లోని పెద్దవారిని సౌకర్యంగా, గౌరవంగా, సంతోషంగా పెట్టుకునే బాధ్యత ఇంట్లోని వారిదే. అదే వారి ఇంటి సుఖసంతోషాలకు మూలం అని మరచి పోవద్దు.
Also Read: ఆయన ఆకాశం - ఆమె పుడమి, అందుకే వారి కళ్యాణం లోకకళ్యాణానికి కారకం, ప్రకృతికి పులకరింతకు ప్రతీక