అన్వేషించండి

Vastu Tips in Telugu: నీటితో నిండిన మట్టి కుండను.. ఈ దిక్కున పెడితే లక్ష్మీ కటాక్షం!

Vastu Tips: నీటితో నిండిన మట్టికుండను ఇంట్లో ఒక నిర్దిష్టమైన దిశలో ఉంచితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చాలా మంది భావిస్తారు. ఇంట్లో ఏ దిశలో నీటితో నిండిన కుండను ఎక్కడ పెట్టాలో చూద్దాం.

Vastu Tips : వేసవికాలం వచ్చిందంటే మట్టి కుండలకు గిరాకీ పెరుగుతుంది. మట్టి కుండలోని నీరు చల్లగా ఉంటుంది. మట్టి కుండ నీరు తాగే సంప్రదాయం శతాబ్దాల నుంచి వస్తోంది. అంతేకాదు  కుండ నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మట్టికుండ ఉండటం శుభసూచిక. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు నీటితో నిండిన మట్టి పాత్రను తీసుకెళ్లడం కూడా శుభసూచిక అని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు నీళ్లతో నిండిన మట్టి కుండను ఇంట్లో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని.. పండితులు చెబుతున్నారు. అయితే దీని కోసం కొన్ని నియామాలు ఉన్నాయి. ఇంట్లో మట్టికుండను ఏ దిశలో ఉంచాలి. వాస్తు ప్రకారం ఏ దిశ సరైందో  తెలుసుకుందాం. 

ఇంట్లో నీళ్లతో నిండిన మట్టి కుండను పెట్టేందుకు సరైన దిశ ఇదే: 

⦿ వాస్తు శాస్త్రం ప్రకారం మట్టి కుండను ఇంట్లో లేదా ఆఫీసులో పెట్టాలనుకుంటే ఉత్తర దిశ సరైనదని వాస్తు పండితులు చెబుతున్నారు. 

⦿ వాస్తు ప్రకారం అగ్ని, గాలి, నీరు , భూమి, ఆకాశం అనే పంచభూతాలకు ఉత్తర దిశ నీటి మూలకానికి సంబంధించింది. 

⦿ ఉత్తర దిశలో నీటికి సంబంధించిన వస్తువులు ఉంచితే శుభ ఫలితాలు వస్తాయని శాస్త్రం చెబుతోంది. 

⦿ ఈ దిశలో మట్టికుండను ఉంచితే వరుణ దేవుడి ఆశీస్సులు కూడా మీపై ఉంటాయని పండితులు చెబుతున్నారు. 

⦿ అంతేకాదు ఈ దిశలో నీళ్ల కుండను ఉంచినట్లయితే ఆ ఇంట్లో భయం ఉండదట. 

⦿ ఉత్తర దిశలో  నీటికి సంబంధించిన వస్తువులు ఉంచితే మనం ఆరోగ్యంగా ఉంటామని శాస్త్రం అంటోంది. 

⦿ అంతేకాదు ఈ దిశలో నీటి కుండను ఉంచితే వినికిడి సామర్ధ్యం పెరుగుతుందట. 

⦿ ఇక కుటుంబంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి..కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారని వాస్తు చెబుతోంది. 

ఇంట్లో మట్టి కుండ ఉండే లక్ష్మీదేవి ఉన్నట్లే: 

⦿ చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలంటే ఇంట్లో మట్టికుండను ఉంచాలి. నీళ్లతో నిండిన మట్టికుండ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రాల్లో పేర్కొన్నారు. 

⦿ నీరు, మట్టి ఈ రెండు కూడా సంపదతో ముడిపడి ఉంటాయి. అందుకే ఇంట్లో తాగే నీటికుండను ఖాళీగా ఉంచకూడదని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా రాత్రిపూట నీటి పాత్రలను ఖాళీగా ఉంచడం అశుభం. 

⦿ ఇంట్లోకి కొత్తగా తీసుకువచ్చిన మట్టికుండను బాగా కడగాలి. కొంత సమయం నీటిని అందులో నింపి ఉంచాలి. మరుసటి ఆ నీటిని తీసి శుభ్రమైన నీరు పోయాలి. 

⦿ కొత్త మట్టికుండలో నీరు తాగే ముందు చిన్నపిల్లలకు కానీ, ముఖ్యంగా ఆడపిల్లలకు తాగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందని శాస్త్రం చెబుతోంది. 

⦿ మట్టితో చేసిన వస్తువులు జ్యోతిష్య పరిహారాలకు ఉపయోగిస్తారు. గ్రహాలను నియంత్రించడానికి, మట్టి వస్తువులను వాడుతారు. ఇంట్లో మట్టి కుండను ఉంచితే శాస్త్రం ప్రకారం బుధుడు, చంద్రుని స్థానాన్ని బలపరుస్తుంది. 

⦿ ముఖ్యంగా వంటగదిలో మట్టి కుండను ఉంచినట్లయితే దానిని స్టవ్ కు దూరంగా పెట్టండి. ఎందుకంటే అగ్ని, నీరు పక్కపక్కనే ఉండకూడదు. 

Also Read: రానున్న ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయ నాయకులు ధనం నష్టపోయినా గెలుపు పక్కా!

గమనిక: కొందరు వాస్తు నిపుణుల సూచనలు ఆధారంగా రాసిన కథనం... దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం...

టాప్ హెడ్ లైన్స్

13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
Solar Eclipse 2026: మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
Solar Eclipse 2026: సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
ఆగష్టు 12న సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
Pisces Half Year Horoscope: మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?
మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget