Good Direction: నాలుగు దిక్కులకు ఉన్న ప్రాధాన్యం తెలుసా? ఏ దిక్కున ఏం చేస్తే ఏ ఫలితం ఉంటుందో తెలుసుకోండి.!
Good Direction: మనం ఏదైనా పని చేసినప్పుడు ముందుగా దిశలను చూసి పని చేయాలి. ఆయా దిశల ప్రకారం చేసే పని మనకు రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. మరి ఏ పని ఏ దిశలో చేయాలో తెలుసా?
Good Direction: హిందూ ధర్మంలో దిశలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి దిశకు సూర్యునితో, కాంతితో అనుబంధం ఉంటుంది. ప్రతి దిశలో కాంతి ప్రభావం వివిధ రకాల శక్తిని సృష్టిస్తుంది. దిశలను అర్థం చేసుకోకుండా మనం ఈ శక్తితో అనుసంధానమైతే, అది హాని కలిగిస్తుంది. కాబట్టి, మనం ఏ దిశలో ఎలాంటి పని చేయాలో తెలుసుకుందాం.
తూర్పు దిశ
తూర్పు దిశకు అభిముఖంగా దైవికపరమైన కార్యకలాపాలు నిర్వహించడం ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఈ దిశపై సూర్యుడు, బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ దిశలో ధర్మపరమైన కార్యక్రమాలు చేయడం ద్వారా వ్యక్తి గౌరవం, కీర్తి, జ్ఞానం పొందుతాడు. వీలైనంత వరకు తూర్పు దిక్కుకు అభిముఖంగా ఉంటూ పూజలు, ధ్యానం, అధ్యయనం చేయాలి.
Also Read : ఈ దిక్కున కూర్చుని భోంచేస్తే సంపద నష్టం
పశ్చిమ దిశ
పశ్చిమ దిశను శని గ్రహానికి సంబంధించిన దిశగా పరిగణిస్తారు. ఈ దిశ ద్వారా సంబంధాలు, కుటుంబం, ఆనందం ప్రభావితమవుతాయి. ఈ దిశగా కూర్చుని మీరు ఆహారం తీసుకోవడం వల్ల జీవితంలో సంఘర్షణను ఎదుర్కొంటారు. పడమర దిక్కున తలపెట్టి పడుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టం కూడా కలుగుతుంది. ఈ దిశ ధ్యానం, ప్రార్థనకు చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు.
ఉత్తర దిశ
సంపద పరంగా ఈ దిశను చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం ఈ దిక్కు నుంచి ఏదైనా పనిని ప్రారంభించడం, వ్యాపారం చేయడం మంచిదని చెబుతారు. ఈ దిశలో లక్ష్మీ దేవిని పూజించడం ద్వారా సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. జీవితంలో మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదురుకావు.
దక్షిణ దిశ
కుజుడు, యముడు దక్షిణ దిశకు అధిపతులుగా భావిస్తారు. ఈ దిశలో లోపాలు ఎదురైనప్పుడు, ఇంటి సభ్యుల మధ్య ఎల్లప్పుడూ విభేదాలు తలెత్తుతుంటాయి. ఆస్తి విషయంలో సోదరుల మధ్య వివాదాలు తలెత్తుతాయి. ఈ దక్షిణ దిశకు అభిముఖంగా ఉండి ఆంజనేయుడిని పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు చేకూరుతాయి. మంగళ యంత్రాన్ని ఇంట్లో ఈ దిక్కున పెడితే అన్ని సమస్యలు తొలగిపోతాయని బలంగా నమ్ముతారు.
Also Read : ఈ వాస్తు చిట్కాలతో మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది
ఈ పై నాలుగు దిక్కులు అత్యంత ప్రభావవంతమైన దిశలుగా ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్నారు. ఈ 4 దిక్కులలో ఆయా దిశల అధి దేవతలను ప్రసన్నం చేసుకునే పనులు చేస్తే దాని ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.