News
News
X

అద్దె ఇంట్లో ఉంటున్నారా? ఈ పరిహారాలతో సొంతింటి కల నెరవేరుతుంది

. సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు. వీటిని పాటిస్తే మీరు త్వరలోనే సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కల ఉంటుంది. ప్రతి ఒక్కరు సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో చాలా కష్టపడతారు. పట్టణాల్లో సొంతింటి కల చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే చాలా మంది అద్దె ఇళ్లలో జీవనం గడుపుతున్నారు. పెద్ద నగరాల్లో ఇల్లు, భూమి చాలా ఖరీదైన విషయాలు. సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు. వీటిని పాటిస్తే మీరు త్వరలోనే సొంత ఇంటిని కొనుగోలు చేయొచ్చు. ఈ పరిహారాలు జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీని తెస్తాయి. అద్దె ఇంటి నుంచి స్వంత ఇంటికి మారిపోవచ్చు.

Also Read: ఈ రాశివారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఆరంభం అంతంతమాత్రం - ద్వితీయార్థం సరిలేరు మీకెవ్వరు!

  • సొంత ఇంటి కోసం మీకు శని అనుగ్రహం కావలసి ఉంటుంది. కాబట్టి శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలి. పడమర దిక్కుగా శనిదేవుని దిక్కుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ దిశలో రోజు ఆవనూనె దీపం వెలిగించి తప్పకుండా శని స్తోత్రం చదువుకోవాలి. మనసులో ఇంటికి సంబంధించిన ఊహను ధ్యానించాలి. ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది.
  • సొంతిల్లు ఏర్పాటు చేసుకోవడమే మీ కలయితే అది నెరవేరే దారి కనిపించకపోతే వేపచెక్కతో చిన్న ఇంటిని చేసి పేద పిల్లలకు దానం చెయ్యాలి. ఇంట్లోని దేవతారాధన స్థలంలో చెక్కతో చేసిన ఇంటిని ఉంచాలి. ఇలా చెయ్యడం వల్ల సొంతింటి కల నెరవేరి ఇంటికి యజమాని అవుతారు.
  • అద్దె ఇంట్లో ఉండటం విసుగ్గా అనిపించి సొంతింటి కల ఊరిస్తుంటే మీరు ఇప్పుడు నివసిస్తున్న ఇంట్లో శ్రీయంత్రాన్ని ప్రతిష్టించి నిత్యం పూజించుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఫలితంగా మీ సొంత ఇంటి కల నెరవేరేందుకు దారి సుగమం అవుతుంది.
  • సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం తెల్లని ఆవు, దూడకు పప్పు, బెల్లం తినిపించాలి. ఇలా చెయ్యడం వల్ల జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కోరుకున్న కల నెరవేరుతుంది.
  • అద్దింటి నుంచి సొంతింటికి మారే కల కంటున్న వారు ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో పశ్చిమ దిక్కున రాగితో చేసిన అలంకరణ వస్తువును పెట్టాలి. ఇలా చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది. శని అనుగ్రహం ఉంటే సొంత ఇంటి కల సాకారం అవుతుంది.
  • మీరు నివసించే ఇంటి బాల్కని లేదా ఆరుబయట పక్షిగూటిని ఏర్పాటు చేసి అందులో నివసించేందుకు పక్షులు చేరితే వాటికి గింజలు వెయ్యడం నీళ్లు పెట్టడం వల్ల కూడా సొంత ఇల్లు చేకూరుతుంది.
  • అద్దింటి పూజా స్థలం ఈశాన్యంలో ఉండే విధంగా జాగ్రత్త పడాలి. ఉదయం సాయంత్రం ఇక్కడ పూజలు చేయాలి. ఈదిశలో నీటి కుండను ఉంచాలి. ఇలా చెయ్యడం వల్ల డబ్బు ఇంట్లోకి వస్తుంది. అందువల్ల ఇంటి కల నెరవేరే అవకాశం ఏర్పడుతుంది.
  • నవరాత్రి సమయంలో మట్టి కుండలో పాలు, పంచదార, కర్పూరం, నెయ్యి, తేనె, పెరుగు వేసి ఈ కుండను చేతిలోకి తీసుకుని దుర్గా మాత నవర్ణ మంత్రాన్ని జపించాలి. తర్వాత దుర్గా పూజ చెయ్యాలి తర్వాత నదిలో లేదా చెరువులోని నెలలో ఈ కుండను పాతిపెట్టాలి. ఇలా చేస్తున్నపుడు మిమ్మల్ని ఎవరూ చూడకుండా జాగ్రత్త పడాలి. ఇది కూడా సొంత ఇల్లు చేకూరేందుకు మంచి ఉపాయం.

Also Read:  శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ప్రశాంతత ఉండదు, కక్కలేక-మింగలేక అన్నట్టుంటుంది పరిస్థితి

Published at : 17 Mar 2023 09:22 AM (IST) Tags: Tenant New Home own house land lord

సంబంధిత కథనాలు

Astrology: మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ రాశి - నక్షత్రం వివరాలు తెలుసుకోండి!

Astrology: మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ రాశి - నక్షత్రం వివరాలు తెలుసుకోండి!

Sri Sobhakritu Nama Samvatsaram: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం

Sri Sobhakritu Nama Samvatsaram: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం

Ugadi 2023: ఉగాది ప్రత్యేకత ఏంటి, చైత్రమాస పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!

Ugadi 2023: ఉగాది ప్రత్యేకత ఏంటి, చైత్రమాస పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!

వామ్మో, మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? అవి మరణానికి సంకేతాలు

వామ్మో, మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? అవి మరణానికి సంకేతాలు

Vaishno Devi Darshan: వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇవి తెలియకపోతే ఇబ్బంది పడతారు!

Vaishno Devi Darshan: వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇవి తెలియకపోతే ఇబ్బంది పడతారు!

టాప్ స్టోరీస్

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా