News
News
X

Vastu Tips: మీ వ్యాపారం లేదా సంస్థలో లాభాలు రావాలంటే ఈ దిక్కున కూర్చొండి

కార్యాలయాలు, వ్యాపార స్థలాలు కూడా వాస్తు- నియమానుసారం ఉన్నపుడే లక్ష్మీ కటాక్షం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందాం.

FOLLOW US: 
Share:

అందరూ డబ్బు సంపాదించాలనే అనుకుంటారు. ఉద్యోగమో, వ్యాపారం చేసి డబ్బు ఎంత సంపాదిస్తున్నామనే దాన్ని బట్టే మన జీవితం ఎంత వరకు విజయవంతంగా ఉందనే దాన్ని అంచనా వేస్తారు ఎవరైనా. ఇలా జీవితాన్ని విజయవంతంగా నడిపేందుకు మన సనాతన శాస్త్రాలు మనకు రకరకాల నియమాలు సూచించాయి. వాస్తు కూడా అలాంటి నియమాల శాస్త్రమే. వాస్తు నిర్మాణ శాస్త్రం మాత్రమే కాదు. వాస్తు నియమానుసారం నివసించే ప్రదేశాలు, పని ప్రదేశాలు అన్ని చోట్ల ఏర్పాటు చేసుకోవడం విజయానికి సోపానం వేస్తుంది. సాధారణంగా నివాస ప్రాంతాల నిర్మాణ సమయంలో వాస్తు గురించి తీసుకునే శ్రద్ధ.. పని ప్రదేశాల నిర్మాణ సమయంలో పెద్దగా లెక్క చేయరు. కానీ కార్యాలయాలు, వ్యాపార స్థలాలు కూడా వాస్తు నియమానుసారం ఉన్నపుడే లక్ష్మీ కటాక్షం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందాం.

Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ప్రశాంతత ఉండదు, కక్కలేక-మింగలేక అన్నట్టుంటుంది పరిస్థితి

ఏం చేసినా కలిసి రాకపోవడం, వ్యాపారంలో ఎలాంటి పురోగతి లేకపోవడం, ఆర్థిక కష్టాలు వీడకపోవడం వంటి వాటి వెనుక వాస్తుకు సంబంధించిన  కారణాలు ఉన్నాయేమో ఒకసారి చూసుకోవాలి. అదేమిటో నిర్థారణ చేసుకుంటే వాస్తు దోషాలను సకాలంలో తొలగించడం అవసరం. వ్యాపార స్థలం లేదా ఆఫీసు వంటి పని చేసే స్థలాల్లో సరైన దిశలో కూర్చుని పని చేసుకోవడం కూడా ప్రభావాన్ని చూపుతుందని పండితులు అంటున్నారు.

మీ కంపెనీకి మీరే మేనేజింగ్ డైరెక్టర్ అయితే వ్యాపారం అనుకున్నట్టు సాగడం లేదా? ఆశించిన లాభాలు కనిపించడం లేదా? కార్యాలయం లేదా వ్యాపార స్థలంలో మీరు సరైన దిశలో కూర్చోవడం లేదేమో బహుషా. లేదా మీరు కూర్చుంటున్న గదికి వాస్తుదోషాలు ఉన్నాయేమో అందువల్ల మీ కష్టానికి తగిన ఫలితం రావడం లేదేమో అనేది ఒకసారి తెలుసుకోవాలి.

కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గది దక్షిణం లేదా పశ్చిమ దిక్కున ఉండడం శుభప్రదం. ఒకవేళ ఈ విధంగా లేకపోతే అటువైపుగా ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఆగదిలో మీరు కూర్చున్నపుడు ఉత్తరం లేదా తూర్పు దిక్కుగా మీ ముఖం ఉండేట్టుగా సీటింగ్ అరేంజ్ చేసుకోవాలి. మేనేజింగ్ డైరెక్టర్ గదిలో టెబుల్ కుర్చిలు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాటు చేసుకున్నపుడు తప్పకుండా మీ టర్నోవర్ త్వరగా పెరుగుతుండడం చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది.

Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారు బాగా సంపాదిస్తారు కానీ మానసికంగా కృంగిపోతారు అంతలోనే ధైర్యంగా దూసుకెళ్తారు

ఆపీసులో విజిటర్స్ రూమ్ ఏర్పాటు చెయ్యలేకపోతే మేనేజింగ్ డైరెక్టర్ క్యాబిన్ బయట వైపు తూర్పు లేదా ఉత్తరం వైపు గొడదగ్గర కూర్చీలు ఏర్పాటు చెయ్యాలి. అప్పుడు అక్కడ కూర్చున్న వారి ముఖం పశ్చిమం లేదా దక్షిణం వైపుగా ఉంటుంది. విజిటర్స్ కూర్చునే దిశకు కూడా వాస్తు తప్పనిసరి. కార్యాలయంలో పనిచేసే ఇతర ఉద్యోగులు వారి స్థానాన్ని అనుసరించి పశ్చిమ, దక్షిణ దిక్కులలో ఆధికారుల క్యాబిన్ కు దగ్గరగా కూర్చోవాలి.

మీది దుకాణం అయితే అమ్మకానికి పెట్టే వస్తువులు దక్షిణం, పడమర, వాయవ్యం దిశ అంటే పడమర ఉత్తర గోడలు కలుసుకునే మూలలో వస్తువులు ఉంచాలి. తూర్పు, ఉత్తరాల మధ్య అంటే ఈశాన్య, తూర్పు దక్షిణాల మధ్య ఖాళీగా వదిలెయ్యాలి.

Published at : 16 Mar 2023 07:53 AM (IST) Tags: Vastu Tips vastu for office managing director cabin

సంబంధిత కథనాలు

మార్చి 26 రాశిఫలాలు, ఈ రాశులవారి మనసులో ఆనందం-తలపెట్టిన పనిలో జయం

మార్చి 26 రాశిఫలాలు, ఈ రాశులవారి మనసులో ఆనందం-తలపెట్టిన పనిలో జయం

యాదాద్రిలాగే బాసర కూడా కృష్ణశిలాశోభితం

యాదాద్రిలాగే బాసర కూడా కృష్ణశిలాశోభితం

వారఫలాలు (మార్చి 27 నుంచి ఏప్రిల్ 02): ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు

వారఫలాలు (మార్చి 27 నుంచి ఏప్రిల్ 02): ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు

Weekly Horoscope 27 March-02 April: ఈ వారం ఈ 6 రాశులవారి అదృష్టం చూసి అంతా అసూయపడతారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 02 వారఫలాలు

Weekly Horoscope 27 March-02 April: ఈ వారం ఈ 6 రాశులవారి అదృష్టం చూసి అంతా అసూయపడతారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 02 వారఫలాలు

Sri Rama Navami 2023: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!

Sri Rama Navami 2023: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా