అన్వేషించండి

కౌరవుల్లో పాండవ పక్షపాత ఎవరో తెలుసా? భీముడి చేతిలో మరణించిన వీరుడు అతడు!

భారతంలో లేని జీవితం మరెక్కడా లేదని అంటుంటారు. ప్రతి పాత్ర ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అయితే తెలిసిన పాత్రలు చాలా తక్కువ. తెలియని పాత్రలు అనేకం ఉన్నాయి. అలాంటి పాత్రల్లో ఒకరు వికర్ణుడు.

పాండవులంటే మహాభారత కథ నాయకులు, మంచి వారు అని, కౌరవులు అంటే ప్రతినాయకులు, చెడ్డ వారని అనే అభిప్రాయం ఉంటుంది. అయితే కౌరవుల్లో సరైన ఆలోచనా విధానంతో ధర్మబద్ధమైన జీవితం గడిపిన వారున్నారు. వారిలో యుయుత్సుడు, వికర్ణుడు లాంటి వారున్నారు. అయితే యుయుత్సుడు పాండవుల వైపు నిలబడి కురుక్షేత్ర యద్ధంలో పాల్గొన్నాడు. ధర్మబద్ధుడైనప్పటికీ వికర్ణుడు అన్నను వీడిపోలేక కౌరవుల తరపునే యుద్ధంలో పాల్గొన్నాడు. వికర్ణుడు వందమంది కురుపుత్రుల్లో మూడవ వాడు. వంద మంది సోదరుల్లో నలుగురు మాత్రమే అందరికీ తెలిసిన వారు. వారు సుయోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, చిత్రసేనుడు.

వికర్ణుడు అనే పేరు విన – కర్ణ అనే రెండు పదాలతో ఉంటుంది. కర్ణ అంటే  చెవులు అనే అర్థం. విన అంటే మాత్రం రెండు అర్థాలు ఉన్నాయి. విన అంటే విశాలమైన అని అనుకోవచ్చు, లేదా లేకుండా అని కూడా అనుకోవచ్చు.  దీన్ని బట్టి వికర్ణ అంటే రెండు అర్థాలున్నాయి. విశాలమైన చెవులు కలవాడని, అంటే ఎక్కువగా విని జ్ఞానాన్ని పొందేవాడని, మరో అర్థం చెవులు లేని వాడని అంటే ఎవరు చెప్పింది వినకుండా తనదైన స్థిరమైన అభిప్రాయం కలిగిన వాడని. వికర్ణుడిని సార్థక నామధేయుడుగా చెప్పుకోవచ్చు. ఈ రెండు అర్థాలు కూడా అతడి వ్యక్తిత్వానికి సందర్భానుసారం సరిగ్గా సరిపోతాయి. చిన్నతనం నుంచి కూడా ఎలాంటి తరతమ బేధాలు లేని వాడు. పాండవులతో కూడా సఖ్యత కలిగి ఉండేవాడు. సోదరులు చేస్తున్న కుట్రల్లో పాలు పంచుకోలేదు.

ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని ఎప్పుడూ ఉపేక్షించలేదు. వ్యతిరేకించడానికి వెనుకాడలేదు.  వికర్ణుడు మంచి విలుకాడు. అర్జునుడి లాగే గొప్ప వీరుడు. వికర్ణుడి భార్య సుదేశ్నవతి. కాశీ దేశపు యువరాణి. వికర్ణుడి కూతురు పేరు దుర్గ. కర్ణుడి కుమారుల్లో ఒకడైన సత్యసేనుడి భార్య దుర్గ పాండవ ద్వేషి. హస్తినా పురంలో మాయా జూదం ప్రారంభానికి ముందే కురువృద్ధులతో కలిసి జూదం తగదని వికర్ణుడు వారించాడు. ప్రతి సందర్భంలోనూ అంతా ధర్మబద్ధంగా సాగాలని కోరుకున్న వారిలో వికర్ణుడు కూడా ఒకడు. ద్రౌపది కి అవమానం జరుగుతున్న సందర్భంలో కూడా అలా జరగకూడదని సోదరులను వ్యతిరేకించిన ఒకేఒక కౌరవుడు వికర్ణుడు మాత్రమే.

ద్రౌపది సంధించిన ప్రశ్నలకు సమాధానం కావాలని సభను కోరి ద్రౌపది పక్షాన నిలబడింది కేవలం వికర్ణుడు ఒక్కడే. ద్రౌపది ప్రశ్నలకు సమాధానం చెప్పక పోతే తమ వంశ నాశనం తప్పదని అప్పుడే వికర్ణుడు హెచ్చరిస్తాడు. తన మాట చెల్లకపోయినా సరే ఎప్పుడూ సోదర ధర్మాన్ని కూడా విస్మరించలేదు వికర్ణుడు. యుద్ధ సమయంలో కౌరవుల పక్షానే యుద్ధం చేశాడు. తనను వ్యతిరేకిస్తున్నా కూడా సుయోధనుడు కూడా ఎప్పుడూ వికర్ణుని విస్మరించలేదు. ఎందుకంటే తమ్ముడి వీరత్వం మీద అతడికి ఉన్న నమ్మకమని చెప్పవచ్చు.

ఎన్నో దివ్యాస్త్రాల ప్రయోగం తెలిసిన వీరుడు వికర్ణుడు. పాండవులతో వీరోచిత పోరాటం చేసిన యోధులలో వికర్ణుడు కూడా ఒకడు. యుద్ధం పద్నాలుగో రోజున జయదృదుడిని చంపేందుకు అర్జునుడికి మార్గం సుగమం చేస్తున్న భీముడిని అడ్డుకునేందుకు వికర్ణుడు ప్రయత్నిస్తాడు. ఇక్కడ భీముడి చేతిలో వీరమరణం పొందాడు. వికర్ణుడి అంత్యక్రియలు కూడా భీముడే నిర్వహించాడని కొన్ని భారత కథలు చెబుతాయి. దర్మాధర్మాలు తెలిసిన వికర్ణుడు సోదరధర్మాన్ని వీడక పోవడం అనేది వికర్ణుడి విలక్షణ వ్యక్తిత్వంగా చెప్పుకోవచ్చు.  

Also read: దీపావళికి వంటింట్లో వాడే ఈ వస్తువులు మాత్రం కొనకండి, దురదృష్టం వెంటాడుతుందట

టాప్ హెడ్ లైన్స్

10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Embed widget