అన్వేషించండి

Gundla Brahmeswaram Temple: అడవిలో ఆధ్యాత్మిక క్షేత్రం! అశ్వత్ధామ ప్రతిష్టించిన శివలింగం , ఏడాదికి 2 రోజులే దర్శనానికి అనుమతి!

Gundla Brahmeswara Temple: దట్టమైన అడవిలో వెలసిన క్షేత్రం. శివయ్యపై భక్తితో కుదిరినప్పుడల్లా వెళ్లి దర్శనం చేసుకుంటానంటే కుదరదు. ఏడాదికి రెండు రోజులు మాత్రమే అనుమతి. ఎక్కడుందా ఆలయం..

Gundla Brahmeswara Swamy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బండి ఆత్మకూరు మండల పరిధిలో నల్లమల అడవిలో ఉంది గుండ్ల బ్రహ్మేశ్వర క్షేత్రం. ఈ దేవాలయం ఏడాదికి రెండ రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే అటవీ అధికారుల అనుమతి తప్పనిసరి. 

దట్టమైన అడవిలో ఉన్న గుండ్ల బ్రహ్మేశ్వర ఆలయాన్ని కాకతీయ, విజయనగర రాజులు పునర్నిర్మించినట్టు శిలాశాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ పరమేశ్వరుడే బ్రహ్మేశ్వరుడి రూపంలో కొలువై ఉన్నాడు. మహాభారత కురుక్షేత్ర సంగ్రామం తర్వాత అశ్వత్థాముడు ( యుద్ధసమయం ముగిసిన తర్వాత ఉప పాండవులను చంపిన పాప ప్రక్షాళన కోసం) శ్రీకృష్ణుడి ఆదేశానుసారం గుండ్లకమ్మ నదితీరంలో శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థలపురాణం.  జన్మస్థానతీరాన శివలింగాన్ని ప్రతిష్టించాడని భక్తుల నమ్మకం. ఇక్కడ గుండ్లబ్రహ్మేశ్వరుడిగా  కొలువైన శివయ్యతో పాటూ  రాజరాజేశ్వరిదేవి, అశ్వత్థామ, వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, నవగ్రహాలను దర్శించుకోవచ్చు. 

ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే సంవత్సరానికి రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. మహా శివరాత్రి సమయంలో రెండు రోజుల పాటు భక్తులకు ప్రవేశం ఉంటుంది. అప్పుడు కూడా అటవీ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే. 

గుండ్ల బ్రహ్మేశ్వరస్వామి దేవాలయం సందర్శం కేవలం ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు ఇక్కడ ప్రకృతి మైమరపిస్తుంది. ఎన్నో వృక్షజాతులు, జంతువులు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో దాదాపు 353కి పైగా వృక్షజాతులు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.  పులులు సంచరించే ప్రదేశం ఇది...ఇంకా మచ్చలపిల్లి, దుప్పులు ఇతర అటవీ జంతువులను చూడొచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 23 పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్న లెక్క. 

ఆలయం సమీపంలో ఉన్న గుండ్లకమ్మ నది నంద్యాల, ప్రకాశం, పల్నాడు, బాపట్ల వరకూ ప్రవహిస్తుంది. ఈ నదిపై కందుల ఓబుళరెడ్డి గుండ్లకమ్మ జలాశయం ఏర్పాటు చేశారు. ఈ జలాశయంతో ప్రకాశం జిల్లా పరిధిలో ఎన్నో గ్రామాలకు తాగు, సాగునీరు అందుతోంది
 
గుండ్ల బ్రహ్మేశ్వరస్వామి దేవాలయానికి ఎలా వెళ్లాలి?

ముందుగా నంద్యాల జిల్లా వెలుగోడు చేరుకోవాలి. అక్కడి నుంచి గట్టుతండా మీదుగా నేరుగా ఈ క్షేత్రానికి ట్రాక్టర్లు సహా వివిధ వాహనాలుంటాయి.  గతంలో ఆర్టీసీ బస్సులతో పాటూ అన్ని వాహనాలు ఈ క్షేత్రానికి వెళ్లేవి. తెలుగుగంగ రిజర్వాయర్‌ నిర్మాణం,  పులుల సంరక్షణ కేంద్రంగా ఈ క్షేత్రాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించడంతో రహదారిని మూసి వేశారు. ఏటా మహాశివరాత్రి సందర్భంగా అయినా అనుమతించాలన్న భక్తుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని ఏడాదికి 2 రోజులు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. ఇంకా నంద్యాల - వెలుగోడు - ఆత్మకూరు - సంతజూటూరు  నుంచి పెద్దదేవలాపురం  మీదుగా ఈ ఆలయానికి వెళ్లొచ్చు.  ఇంకా నంద్యాల నుంచి గాజులపల్లె మీదుగా గిద్దలూరు దిగువమెట్టు నుంచి కూడా గుండ్లబ్రహ్మేశ్వరం చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి అయితే అన్ని రకాల వాహనాలు వెళతాయి. 42 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉదయం 6 గంటలు బయలుదేరి వెళ్లి సాయంత్రం 6 లోపు వచ్చేయాల్సి ఉంటుంది. అప్పటివరకూ మాత్రమే అనుమతి.  

ఒకప్పుడు కార్తీమాసం, మాఘమాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో భక్తుల సందడి ఉండేది. కానీ ఇప్పుడు అటవీ అధికారులు అనుమతి నిరాకరించడంతో ఏడాదిలో రెండు రోజులే వెళ్లే అవకాశం వస్తోంది. నిత్యం భక్తులు సందర్శించుకునే ఏర్పాట్లు చేస్తే ఆలయం అభివృద్ధి చెందుతుందంటున్నారంతా. అయితే పులుల సంరక్షణ కేంద్రం కావడంతో ఏడాదికి రెండు రోజులే అనుమతి అని అటవీ అధికారులు స్పష్టంగా చెప్పేస్తున్నారు. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
India Post Rakhi Offer 2026: రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!
రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget