అన్వేషించండి

Tulsi Water: తులసి నీటితో ఇలా చేస్తే మీ సమస్యలన్నీ మాయం..!

Tulsi Water: మనం భ‌గ‌వంతునికి చేసే పూజలలో తులసి ద‌ళాల‌ను ఉపయోగిస్తాము. తులసి ద‌ళాల‌ మాదిరిగానే తులసి నీరు కూడా ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా..? తులసి నీరు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Tulsi Water: హిందూ ధ‌ర్మంలో, తులసి మొక్కను ఇంటి ఆస్తిగా పరిగణిస్తారు. తులసిని క్రమం తప్పకుండా పూజిస్తారు. తులసి మొక్కను పూజించ‌డ‌మంటే మ‌హాల‌క్ష్మీ స‌మేతుడైన శ్రీ‌మ‌హా విష్ణువును పూజించ‌డ‌మేన‌ని భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లో సానుకూలత వస్తుంది. 

తులసి పూజకు కారణం
మత విశ్వాసాల ప్రకారం, తులసి మొక్కను ఇంటి పెరట్లో లేదా బాల్కనీలో ఉంచాలి. దీని ద్వారా భగవంతుని అనుగ్రహం మనపై ఉంటుంది. దీనితో పాటు ఉదయాన్నే తులసి మొక్కకు నీరు సమర్పించడం వల్ల విష్ణువు ప్రసన్నుడవుతాడు. సాయంత్రం వేళ తులసి మొక్క వ‌ద్ద‌ నేతితో దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఆ ఇంటి సభ్యులపై శ్రీ‌మ‌హా విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఉంటాయి. 

Also Read : తులసి పూజలో ఈ నియమాలు పాటించండి లక్ష్మి కటాక్షిస్తుంది

సానుకూల శ‌క్తి
 తులసి ద‌ళాల‌ను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఈ నీటిని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజానంతరం ఇల్లంతా చిలకరించాలి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది. ఇది ఇంట్లో ఉన్న ప్ర‌తికూల శ‌క్తిని నాశనం చేసి అక్కడ సానుకూల కిరణాలు వెదజల్లుతుంది. .

వ్యాపారంలో పురోగతి
తులసి ద‌ళాల‌ను నీటిలో మూడు రోజులు నానబెట్టండి. ఉదయం, సాయంత్రం పూజ తర్వాత ఈ నీటిని మీ కార్యాల‌యం, దుకాణం లేదా ఫ్యాక్టరీలో చల్లితే అక్కడున్న నెగిటివ్ శక్తి తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుంది. మీ ఆర్థిక‌ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది. ఇది పని ప్రదేశంలో మీ గౌరవాన్ని కూడా పెంచుతుంది.

శ్రీకృష్ణుని ఆశీస్సులు
తులసి దళం శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనది కాబట్టి, శ్రీకృష్ణుని బాల రూపమైన బాల కృష్ణునికి తులసి జలంతో అభిషేకం చేయాలి. ఇలా చేయ‌డం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. బాల గోపాలునికి తులసి ద‌ళాల‌ నీటితో అభిషేకం చేయడం ద్వారా, మీరు ఆయ‌న‌ విశేష అనుగ్రహాన్ని పొందుతారు. మీరు బాల‌కృష్ణుడిని తులసి నీటితో అభిషేకించిన తర్వాత, మీరు తులసి ద‌ళాల‌తో మాల సమర్పించి సాధారణ పూజ చేయవచ్చు.

Also Read : తులసి ఆకుల్లో ఎన్నో ఔషద గుణాలు - ఇలా వాడితే, ఆరోగ్యం మీ సొంతం

వ్యాధి నివారణ
ఇంట్లో ఎవరికైనా ఎక్కువ కాలం అనారోగ్యంగా ఉంటే వారిపై తులసి నీళ్లు చల్లాలి. దీంతో వ్యాధి నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని విశ్వసిస్తారు. తులసిలో ఉండే ఔషధ గుణాలవల్ల అనారోగ్యం తగ్గుతుందంటారు. తుల‌సి నీరు వ్యాధుల‌ను అరిక‌డుతుంది. అయితే, ఈ ప‌ని చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యమ‌నే విష‌యం మ‌ర‌వ‌కండి. అలాగే తులసి మొక్క ఆకులను ఎప్పుడంటే అప్పుడు తుంచకూడదు. మహిళలు తులసి మొక్కనుంచి ఆకులు తెంచకూడదంటారు పండితులు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Talli Statue: మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
Manchu Lakshmi: ఆస్తుల్లో తన వాటా తీసుకుని ముంబైలో ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మి - అన్నదమ్ముల గొడవను అక్క తీర్చే చాన్స్ లేదా ?
ఆస్తుల్లో తన వాటా తీసుకుని ముంబైలో ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మి - అన్నదమ్ముల గొడవను అక్క తీర్చే చాన్స్ లేదా ?
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Amitabh - Allu Arjun: అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?
అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Talli Statue: మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
Manchu Lakshmi: ఆస్తుల్లో తన వాటా తీసుకుని ముంబైలో ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మి - అన్నదమ్ముల గొడవను అక్క తీర్చే చాన్స్ లేదా ?
ఆస్తుల్లో తన వాటా తీసుకుని ముంబైలో ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మి - అన్నదమ్ముల గొడవను అక్క తీర్చే చాన్స్ లేదా ?
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Amitabh - Allu Arjun: అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?
అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?
Telangana Talli Statue: పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లికి అధికారికంగా విగ్రహమే లేదు - అసెంబ్లీలో సంచలన విషయం బయట పెట్టిన మంత్రి పొన్నం !
పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లికి అధికారికంగా విగ్రహమే లేదు - అసెంబ్లీలో సంచలన విషయం బయట పెట్టిన మంత్రి పొన్నం !
Bima Sakhi Yojana: 10వ తరగతి పాసైతే చాలు, మహిళలు ఇంట్లో కూర్చుని వేలల్లో సంపాదించొచ్చు! - కొత్త స్కీమ్‌ ప్రారంభం
10వ తరగతి పాసైతే చాలు, మహిళలు ఇంట్లో కూర్చుని వేలల్లో సంపాదించొచ్చు! - కొత్త స్కీమ్‌ ప్రారంభం
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Embed widget