అన్వేషించండి

Srivari Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం - ఆ ప్రచారంపై టీటీడీ క్లారిటీ, భక్తులు అపోహలు నమ్మొద్దని విజ్ఞప్తి

Tirupati News: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయంలో నూతన విధానం అంటూ జరుగుతోన్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. లడ్డూల పంపిణీ పాలసీలో ఎలాంటి మార్పు లేదని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు.

TTD Clarity On Srivari Laddu Prasadam: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నూతన విధానం అంటూ జరుగుతోన్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. లడ్డూ ప్రసాద విక్రయ విధానంపై కొన్ని మీడియా ఛానెళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. భక్తులు ఎలాంటి అపోహలు, వదంతులు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. లడ్డూ విక్రయ విధానంలో ఎలాంటి మార్పు లేదని.. బ్లాక్ మార్కెట్, దళారులను అరికట్టేందుకు చిన్న మార్పు చేసినట్లు స్పష్టం చేశారు. దర్శనం టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు ఆధార్ కార్డు నమోదుతో రెండు లడ్డూలు విక్రయిస్తామని తెలిపారు.

దర్శన టికెట్, టోకెన్ కలిగిన భక్తులకు ఉచితంగా ఒక లడ్డూతో పాటు 4 నుంచి 6 లడ్డూలు విక్రయిస్తామని చెప్పారు. కొంతమంది స్వామి దర్శనం చేసుకోకుండా లడ్డూలు కొని బయట అమ్ముతున్నారు. అలాంటి వారికి ఆధార్ తీసుకుని 2 లడ్డూలు మాత్రమే ఇస్తున్నామని పేర్కొన్నారు. సామాన్య భక్తులకు మేలు చేసే విధంగానే లడ్డూ ప్రసాద విక్రయం కొనసాగుతుందన్నారు. కాగా, తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ జారీ విధానంలో టీటీడీ (TTD) గురువారం నుంచి మార్పులు చేసినట్లు ఉదయం పెద్దఎత్తున ప్రచారం సాగింది. ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇస్తారని.. దర్శన టికెట్‌పై ఒక లడ్డూ, ఆధార్ కార్డు చూపిస్తే మరో లడ్డు ఇస్తారనే వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఖండించిన టీటీడీ దానిపై స్పష్టత ఇచ్చింది. 

మరోవైపు, లడ్డూ ప్రసాదం తయారీకి కర్ణాటక ప్రభుత్వం నెయ్యి సరఫరాను టీటీడీ మళ్లీ ప్రారంభించింది. నందిని బ్రాండ్ నెయ్యి సరఫరాను ప్రారంభించగా.. బుధవారం రాత్రి మొదటి లోడును ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య జెండా ఊపి ప్రారంభించారు. గత వైసీపీ హయాంలో ధర విషయంలో అంగీకారం కుదరక గతేడాది సెప్టెంబర్ నుంచి నెయ్యి సరఫరా నిలిపేశారు. ఇటీవల 350 టన్నుల నెయ్యి సరఫరా చేయాలని టీటీడీ కోరడంతో సరఫరాను తిరిగి ప్రారంభించినట్లు కర్ణాటక పాల సమాఖ్య అధికారులు తెలిపారు. 

లక్కీ డిప్ ద్వారా ఆ టోకెన్లు

ప్రతి శనివారం తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులకు కేటాయిస్తోన్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టోకెన్లను ఇకపై, లక్కీ డిప్ ద్వారా కేటాయించనున్నట్లు టీటీడీ తెలిపింది. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ భక్తులు తమ ఆధార్ కార్డుతో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. వీరికి సాయంత్రం 5 గంటలకు లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తామని..  టికెట్లు పొందిన భక్తుల మొబైల్‌కు మెసేజ్ పంపిస్తామని చెప్పారు. ఈ సమాచారం ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు ఆన్‌లైన్‌లో రూ.500 డిపాజిట్ చేయాలని సూచించారు. వీరు మహతి కళాక్షేత్రంలో ఆధార్ కార్డు చూపించి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ అంగప్రదక్షిణ టికెట్లు పొందవచ్చని తెలిపారు. టికెట్లు పొందిన భక్తులకు శనివారం తెల్లవారుజామున అంగప్రదక్షిణకు అనుమతిస్తామన్నారు. అనంతరం భక్తులు చెల్లించిన రూ.500 డిపాజిట్‌ను వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులు కాని భక్తులకు.. లక్కీ డిప్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు పొందిన వారికి డిపాజిట్ డబ్బులు తిరిగి చెల్లించమని చెప్పారు.

Also Read: CM Chandrababu: 'ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతి' - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget