By: ABP Desam | Updated at : 28 Apr 2022 12:53 PM (IST)
Edited By: RamaLakshmibai
Today Panchang April 29th
ఏప్రిల్ 29 శుక్రవారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 29- 04 - 2022
వారం: శుక్రవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళ పక్షం
తిథి : చతుర్థశి శుక్రవారం రాత్రి 12.31 వరకు తదుపరి అమావాస్య
వారం : శుక్రవారం
నక్షత్రం: రేవతి సాయంత్రం 6.42 వరకు తదుపరి అశ్విని
వర్జ్యం : ఉదయం 6.28 నుంచి 08.06
దుర్ముహూర్తం : ఉదయం 8.11 నుం చి 09.01
అమృతఘడియలు : సాయంత్రం 4.15 నుంచి 5.53 వరకు
సూర్యోదయం: 05:39
సూర్యాస్తమయం : 06:15
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
శుక్రవారం అష్టలక్ష్మీ స్తోత్రం పఠిస్తే కష్టనష్టాలు తొలగి ఇంట్లో ప్రశాంతత లభిస్తుందని చెబుతారు పండితులు
అష్టలక్ష్మీ స్తోత్రం
ఆదిలక్ష్మీ
సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే
మునిగణవందిత మోక్షప్రదాయిని మంజులభాషిణి వేదనుతే |
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే
జయ జయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ ||
ధాన్యలక్ష్మీ
అయి కలికల్మషనాశిని కామిని వైదికరూపిణి వేదమయే
క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే |
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రితపాదయుతే
జయ జయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్ ||
ధైర్యలక్ష్మీ
జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే
సురగణపూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే |
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రితపాదయుతే
జయ జయ హే మధుసూదనకామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మామ్ ||
గజలక్ష్మీ
జయ జయ దుర్గతినాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే
రథగజతురగపదాతిసమావృత పరిజనమండిత లోకనుతే |
హరిహరబ్రహ్మసుపూజితసేవిత తాపనివారణపాదయుతే
జయ జయ హే మధుసూదనకామిని గజలక్ష్మి రూపేణ పాలయ మామ్ ||
సంతానలక్ష్మీ
అయి ఖగవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్తభూషితగాననుతే |
సకల సురాసుర దేవమునీశ్వర మానవవందితపాదయుతే
జయ జయ హే మధుసూదనకామిని సంతానలక్ష్మి సదా పాలయ మామ్ ||
విజయలక్ష్మీ
జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే
అనుదినమర్చిత కుంకుమధూసరభూషితవాసిత వాద్యనుతే |
కనకధరాస్తుతి వైభవవందిత శంకరదేశిక మాన్యపదే
జయ జయ హే మధుసూదనకామిని విజయలక్ష్మి సదా పాలయ మామ్ ||
విద్యాలక్ష్మీ
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే
మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతిసమావృత హాస్యముఖే |
నవనిధిదాయిని కలిమలహారిణి కామితఫలప్రదహస్తయుతే
జయ జయ హే మధుసూదనకామిని విద్యాలక్ష్మి సదా పాలయ మామ్ ||
ధనలక్ష్మీ
ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభినాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద సువాద్యనుతే |
వేదపురాణేతిహాససుపూజిత వైదికమార్గప్రదర్శయుతే
జయ జయ హే మధుసూదనకామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మామ్ ||
Also Read:
Also Read:
TTD Special Darshanam Tickets: వయోవృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ గుడ్న్యూస్ - ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
Rohini Karte 2022: రోహిణి కార్తె ప్రారంభమైంది, ఇంతకీ కార్తెలు అంటే ఏంటి
Hanuman: ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు, అసలు సిసలు వ్యక్తిత్వ వికాస గని హనుమంతుడు
Astrology: మీరు డిసెంబరులో జన్మించారా, అయితే మీరు పుట్టుకతోనే టీచర్లు, నిత్య విద్యార్థులు
Today Panchang 25 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, హనుమజ్జయంతి ప్రత్యేకత
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి