అన్వేషించండి

Today Panchang April 25th: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఈ రోజు పఠించాల్సిన శివ స్త్రోత్రం

కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్యపూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి...

ఏప్రిల్ 25 సోమవారం పంచాంగం

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

తేదీ: 25- 04 - 2022
వారం: సోమవారం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళ పక్షం

తిథి  :  దశమి సోమవారం రాత్రి తెల్లవారుజామున 3.52 వరకు తదుపరి ఏకాదశి
వారం : సోమవారం ( ఇందువాసరే) 
నక్షత్రం: ధనిష్ఠ రాత్రి 7.37 వరకు తదుపరి శతభిషం
వర్జ్యం : రాత్రి 2.34 నుంచి 4.07వరకు 
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.23 నుంచి 1.13 వరకు 
అమృతఘడియలు : ఉదయం 9.43 నుంచి 11.14 వరకు
సూర్యోదయం: 05:42 
సూర్యాస్తమయం : 06:13

( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)

సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. బోళాశంకరుడిని తలుచుకుంటే చాలు అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. సోమవారం రోజు శివస్త్రోత్రాలు ఏవి చదువుకున్నా మంచిదే. ఈ రోజు మీకోసం శివాష్టకం అందిస్తున్నాం. 

శివ అష్టకమ్

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానన్దభాజమ్ | 
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శఙ్కరం శంభుమీశానమీడే || 

గలే రుణ్డమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలమ్ | 
జటాజూటగఙ్గోత్తరఙ్గైర్విశాలం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||

ముదామాకరం మణ్డనం మణ్డయన్తం మహామణ్డలం భస్మభూషాధరం  తమ్ | 
అనాదిం హ్యపారం మహామోహమారం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||

తటాధోనివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశమ్ | 
గిరీశం గణేశం సురేశం మహేశం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||

గిరీన్ద్రాత్మజాసఙ్గృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహమ్ | 
పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వన్ద్యమానం శివం శఙ్కరం శంభుమీశానమీడే || 

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనమ్రాయ కామం దదానమ్ | 
బలీవర్దయానం సురాణాం ప్రధానం శివం శఙ్కరం శంభుమీశానమీడే |

శరచ్చన్ద్రగాత్రం గుణానన్దపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ | 
అపర్ణాకళత్రం చరిత్రం విచిత్రం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౭|| 

హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారమ్ | 
శ్మశానే వసన్తం మనోజం దహన్తం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||

స్తవం యః ప్రభాతే నరః శూలపాణేః పఠేత్సర్వదా భర్గభావానురక్తః | 
స పుత్రం ధనం ధాన్యమిత్రం కళత్రం విచిత్రైః సమారాద్య మోక్షం ప్రయాతి ||

ఇతి శ్రీశివాష్టకం సంపూర్ణమ్ || 

టాప్ హెడ్ లైన్స్

Surya Grahan Chandra Grahan: 13 రోజుల్లో రెండు గ్రహణాలు, ఇవి భారత రాజకీయాల దిశను మారుస్తాయా?
13 రోజుల్లో రెండు గ్రహణాలు, ఇవి భారత రాజకీయాల దిశను మారుస్తాయా?
శ్రావణమాసం: జ్యోతిర్లింగ దర్శన పుణ్యం, ఇంట్లో శివారాధనతో సకల శుభాలు!
శ్రావణమాసం: జ్యోతిర్లింగ దర్శన పుణ్యం, ఇంట్లో శివారాధనతో సకల శుభాలు!
జాతకంలో పితృ, కాలసర్ప దోషాలు తొలగించే శివపూజా విధానం!
జాతకంలో పితృ, కాలసర్ప దోషాలు తొలగించే శివపూజా విధానం!
మీకు పెళ్లైనట్టు మీకు కలొచ్చిందా ఎప్పుడైనా! దాని సంకేతం ఏంటో తెలుసా?
మీకు పెళ్లైనట్టు మీకు కలొచ్చిందా ఎప్పుడైనా! దాని సంకేతం ఏంటో తెలుసా?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget