Today Panchang April 23rd తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శని దోష నివారణ శ్లోకం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్యపూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి...

ఏప్రిల్ 23 శనివారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 23- 04 - 2022
వారం: శనివారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళ పక్షం
తిథి : సప్తమి ఉదయం 09-55 వరకు తదుపరి అష్టమి
వారం : శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం: ఉత్తరాషాఢ రాత్రి 10-09 వరకు తదుపరి శ్రవణం
వర్జ్యం : ఉదయం 07:11 - 08:41, రాత్రి 01:55 - 03:26 వరకు
అమృతఘడియలు : సాయంత్రం 04:10 - 05:39
దుర్ముహూర్తం : ఉదయం 05:43- 07:23
రాహుకాలం : ఉదయం 09:00 - 10:30
యోగం: సిద్ధి ఉదయం 07-32 వరకు
కరణం : బవ ఉదయం 09-55 వరకు
సూర్యోదయం: 05:43
సూర్యాస్తమయం : 06:13
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉంటే ఏం జరుగుతుంది
శనిదోష నివారణకు పఠించాల్సిన శ్లోకాలు
శని దోషం ఉన్నవారు సుఖశాంతులు లేకుండా బాధపడుతుంటారు.కష్ట నష్టాల నుంచి బయపడేందుకు దేవాలయాల్లో శాంతులు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే శనివారం రోజు ప్రత్యేక పూజలు మాత్రమే కాదు శనిధ్యానం చేసినా ఆ ప్రభావం తగ్గుతుందని చెబుతారు. ఇవి కేవలం శనివారం మాత్రమే కాదు నిత్యం చదువుకోవచ్చు.
శనిధ్యానం శ్లోకాలు
స్నానం చేసిన తర్వాత…
సూర్యపుత్రో దీర్ఘదేహః
విశాలక్ష శ్శివప్రియ:
మందచార: ప్రసన్నాత్మా
పీడాం దహతు మే శని:
శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే
నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం
చాయా మార్తాండ సంభూతం
తన్నమామి శనైశ్చరం!
నమస్తే రౌద్ర దేహాయ
నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ
నమస్తే సౌరాయే విభో !!
నమస్తే మంద సంజ్ఞాయ
శనైశ్చర నమోస్తు
ప్రసాదం మమదేవేశ
దీనస్య ప్రణతస్యచ!!
నమస్తే కోణ సంస్థాయ
పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ
కృష్ణాయచ నమోస్తుతే !!
నిత్యం ఈ శ్లోకాలు చదవడం వల్ల శనిదోష నివారణతో పాటూ అనుకున్న కార్యాలు నెరవేరుతాయని పండితులు చెబుతారు.
Also Read: మీన రాశిలో గురు గ్రహం సంచారం వల్ల ఈ ఐదు రాశువారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు
Also Read: రాహువు రివర్సయ్యాడు, ఈ రాశులవారు కష్టాల నుంచి బయటపడి ఆర్థికంగా బలపడతారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

