(Source: Poll of Polls)
Today Panchang April 20th: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం సహా ఈ రోజు ప్రత్యేకత , చదువుకోవాల్సిన శ్లోకం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్యపూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి...
ఏప్రిల్ 20 బుధవారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 20 - 04 - 2022
వారం: బుధవారం (సౌమ్యవాసరే)
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం
తిథి: చవితి సాయంత్రం 5.09 తదుపరి పంచమి
నక్షత్రం: జ్యేష్ఠ తెల్లవారుజామున 3.01 వరకూ తదుపరి మూల
వర్జ్యం: ఉదయం 10.16-11.34 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 11.33-12.23
అమృతకాలం: సాయంత్రం 6.50-8.19
రాహుకాలం: మధ్యాహ్నం 12.00-1.30
యమగండం: ఉదయం 7.30-9.00
యోగం: వరీయాన్ సాయంత్రం 4.46
కరణం: బవ ఉదయం 6.24, బాలువ సా5.09 , కౌలువ తెల్లవారుజామున 3.58
సూర్యరాశి: మేషం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం: 5.45
సూర్యాస్తమయం: 6.12
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: ఈ రాశివారు భవిష్యత్ గురించి టెన్షన్ పడతారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
ఈ రోజు( బుధవారం) ప్రత్యేకత
బుధవారం గణపతికి, అయ్యప్పస్వామికి ప్రీతికరమైన రోజు. శ్రీ మహావిష్ణువుని కూడా కొందరు ఇదే రోజు ఆరాధిస్తారు. ఎవరి భక్తి వాళ్లది.అయితే ప్రధమ పూజచేసే గణపయ్య శ్లోకాలు నిత్యం చదువుకుంటే విఘ్నాలు తొలగి విజయాలు సాధిస్తామని విశ్వసిస్తారు.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం|
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే||
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ|
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా||
మూషికవాహన మోదకహస్త
చామరకర్ణ విలంబిత సూత్ర|
వామనరూప మహేశ్వరపుత్ర
విఘ్న వినాయక పాద నమస్తే||
గజాననం భూతగణాదిసేవితం
కపిత్త జంబూఫల సారభక్షితం|
ఉమాసుతం శోకవినాశ కారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం||
సుముఖశ్చై కదందశ్చ కపిరో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాదిపః|
ధూమకేతు నరాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శూర్పకర్ణో హేరంభ స్కందపూర్వజః||
విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ
లంబోదరాయ సకలాయ జగద్ధితాయ |
నాగాననాయ శృతియజ్ఞ – విభూషితాయ
గౌరీ సుతాయ గణనాథ నమో నమస్తే ||
తొండమునేక దంతము తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలున్ మెల్లని చూపుల మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్..
Also Read:మీన రాశిలో గురు గ్రహం సంచారం వల్ల ఈ ఐదు రాశువారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు
Also Read: రాహువు రివర్సయ్యాడు, ఈ రాశులవారు కష్టాల నుంచి బయటపడి ఆర్థికంగా బలపడతారు