By: ABP Desam | Updated at : 19 Apr 2022 07:32 AM (IST)
Edited By: RamaLakshmibai
Today Panchang April 19th
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 19 - 04 - 2022,
వారం: మంగళవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం
తిథి : తదియ రాత్రి 07-40 వరకు తదుపరి చవితి
వారం : మంగళవారం (భౌమవాసరే)
నక్షత్రం: విశాఖ ఉదయం 06-28 వరకు, తర్వాత అనూరాధ రాత్రి"తె" 04-42 వరకు తదుపరి జ్యేష్ట
యోగం: వ్యతీపాత రాత్రి 07-56 వరకు
కరణం : వణిజ ఉదయం 08-40 వరకు
వర్జ్యం : ఉదయం 10:13 - 11:42
అమృతఘడియలు : రాత్రి 07:04 - 08:33
దుర్ముహూర్తం : ఉదయం 08:15 - 09:04 మరల రాత్రి 10:49 - 11:35
రాహుకాలం : మధ్యాహ్నం 03:00 - 04:30
సూర్యోదయం: 05:47
సూర్యాస్తమయం : 06:11
ఈ రోజు ప్రత్యేకత: సంకట హర చతుర్థి
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: ఈ రాశివారికి ఈ రోజు అనుకోని ఖర్చులు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
సంకటహర చతుర్థి
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే
సంకటహర చతుర్థి అంటే కష్టాల నుంచి గట్టెక్కించేదని చెబుతారు. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధుల్లో ప్రధానమైనది చతుర్థి. ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండోది సంకష్టహర చతుర్థి.. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. కష్టాలు తొలగించే సంకట హర చతుర్థి వ్రతాన్ని మాత్రం ప్రతిమాసం కృష్ణ పక్షంలో.. అంటే పౌర్ణమి తరువాత 3 , 4 రోజుల్లో వచ్చే చవితిరోజు ఆచరిస్తారు. ఈరోజు వినాయకుడికి భక్తిశ్రద్ధలతో పూజచేస్తే కష్టాలు,విఘ్నాలు తొలగిపోతాయని విశ్వాసం.
Also Read: శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమే
Also Read: ఏప్రిల్ 29 న కుంభరాశిలోకి శని, ఈ ప్రభావం మీ రాశిపై ఎలాఉందో ఇక్కడ తెలుసుకోండి
Vastu Tips : ముందు ఈ వస్తువులను ఇంట్లోంచి తీసేస్తే, పురోగతి దానంతట అదే మొదలవుతుంది.!
Vastu Tips In Telugu: చనిపోయిన వారి ఫొటోలు మీ ఇంట్లో ఏ దిక్కున పెట్టారు!
Horoscope Today 30 September 2023: ఈ రాశులవారు మానసిక ప్రశాంతతకోసం ప్రయత్నించండి, సెప్టెంబరు 30 రాశిఫలాలు
Tirumala Navaratri Brahmotsavam 2023: తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాలు, ఎప్పటి నుంచి అంటే?
Importance Of Bathukamma 2023: బతుకమ్మ పండుగలో పూలకు అంత ప్రాధాన్యత ఎందుకు!
KTR vs Revanth Reddy: కాంగ్రెస్ 6 గ్యారంటీలు చూసి కేసీఆర్ కు చలి జ్వరం, కేటీఆర్ కి మతి తప్పింది - రేవంత్ రెడ్డి ఫైర్
Vasireddy Padma : ఆ టీడీపీ నేతను అరెస్ట్ చేయండి - డీజీపీకి వాసిరెడ్డి పద్మ లేఖ !
Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్ను నా రూమ్కు పిలిచి నిద్రపోయా
బీజేపీ వైఖరి నచ్చకే NDA నుంచి బయటకు వచ్చేశాం, AIDMK నేత కీలక వ్యాఖ్యలు
/body>