News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Today Panchang April 16: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం సహా ఈ రోజు ప్రత్యేకత , చదువుకోవాల్సిన శ్లోకం

కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్యపూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి...

FOLLOW US: 
Share:

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

తేదీ: 16 - 04 - 2022,
వారం: శనివారం

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం,  వసంత ఋతువు,  చైత్రమాసం,  శుక్లపక్షం 
తిధి         :  పూర్ణిమ: రా. 12.47 తదుపరి బహుళ పక్ష పాడ్యమి
నక్షత్రం  :   హస్త: ఉ. 8.36 తదుపరి చిత్త 
వర్జ్యం    :   సాయంత్రం. 4.27 నుంచి 6.01
దుర్ముహూర్తం   :  దుర్ముహూర్తం: ఉ.5.48 నుంచి 7.27 వరకు
అమృతకాలం   :  అమృత ఘడియలు: రా. 1.52 నుంచి 3.25 వరకు 
రాహుకాలం     :  ఉదయం  9.00 నుంచి 10.30 వరకు 
యమగండం    :  మధ్యాహ్నం 1.50 నుంచి 3.25 వరకు
సూర్యోదయం       :  ఉదయం 5.48
సూర్యాస్తమయం  :   సాయంత్రం 6.11
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి))

Also Read: ఈ రాశివారు ఈ రోజు తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
ఈ రోజు విశేషం:  చైత్ర పూర్ణిమ,  శ్రీ హనుమత్ విజయోత్సవ దినం
 హనుమంతుని జన్మ తిథి చైత్రమాసంలోనా , వైశాఖంలోనా.. ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. అయితే పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించారని అందుకే ఈ రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు. మరికొన్ని ఐతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు సహా ఎందరో రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించిన కారణంగా ఈ రోజు విజయోత్సవం జరుపుకునే సంప్రదాయం ఉందంటారు. ఉత్తరాదివారితో సహా దక్షిణాదిన తెలంగాణ ప్రాంతంలో  మాత్రం ఈ రోజునే హనుమంతుని జన్మ తిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు.

Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే

ఈ రోజు చదువుకోవాల్సిన శ్లోకం
నవగ్రహ స్తోత్రము
శ్లోకం
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
రవి 
జపాకుసుమ సంకాశం | కాశ్యపేయం మహాద్యుతిమ్
తమో రిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరం ||
చంద్ర
దధి శంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సంభవమ్
నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం ||
కుజ
ధరణీగర్భ సంభూతం | విద్యుత్కాంతి సమప్రభమ్
కుమారం శక్తిహస్తం | తం మంగళం ప్రణమామ్యహం ||
బుధ 
ప్రియంగు కలికాశ్యామం | రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం | తం బుధం ప్రణమామ్యహం ||
గురు
దేవానాంచ ఋషీణాంచ | గురుం కాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిం ||
శుక్ర 
హిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహం ||
శని 
నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం ||
రాహు 
అర్ధకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం | తం రాహుం ప్రణమామ్యహం ||
కేతు
పలాశ పుష్ప సంకాశం | తారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం | తం కేతుం ప్రణమామ్యహం ||

Also Read: వాస్తుప్రకారం ఇలాంటి స్థలం కొంటే మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది 

Published at : 16 Apr 2022 07:44 AM (IST) Tags: Day nakshtra Today Panchang April 15 thidi rahukal varjyam durmuhurtram friday Today Panchang April 16th

ఇవి కూడా చూడండి

Bhagavad Gita: అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!

Bhagavad Gita: అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!

Friday Tips: శుక్రవారం రోజు ఈ పని చేస్తే లక్ష్మీదేవి కృప‌కు పాత్రుల‌వుతారు, శుక్రుడి అనుగ్ర‌హం కూడా!

Friday Tips: శుక్రవారం రోజు ఈ పని చేస్తే లక్ష్మీదేవి కృప‌కు పాత్రుల‌వుతారు, శుక్రుడి అనుగ్ర‌హం కూడా!

Horoscope Today September 22, 2023 :ఈ రాశివారు టైమ్ వేస్ట్ చేయడంలో ముందుంటారు, సెప్టెంబరు 22 రాశిఫలాలు

Horoscope Today September 22, 2023 :ఈ రాశివారు టైమ్ వేస్ట్ చేయడంలో ముందుంటారు, సెప్టెంబరు 22 రాశిఫలాలు

Astrology : ఈ రాశివారు బాగా సంపాదిస్తారు తక్కువ ఖర్చు చేస్తారు!

Astrology : ఈ రాశివారు బాగా సంపాదిస్తారు తక్కువ ఖర్చు చేస్తారు!

Astrology : ఈ రాశివారు ఎప్పుడూ ఒకరి అధీనంలోనే ఉంటారు, ఈ రాశివారి లక్షణమే ఇది!

Astrology : ఈ రాశివారు ఎప్పుడూ ఒకరి అధీనంలోనే ఉంటారు, ఈ రాశివారి లక్షణమే ఇది!

టాప్ స్టోరీస్

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!

IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత