Today Panchang 23 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, అష్టకష్టాలు తీర్చే కాలభైరవాష్టకం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి...
మే 23 సోమవారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 23- 05 - 2022
వారం: సోమవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, బహుళపక్షం
తిథి : అష్టమి సోమవారం సాయంత్రం 4.12 వరకు తదుపరి నవమి
వారం : సోమవారం
నక్షత్రం: శతభిషం రాత్రి 2.35 వరకు తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం : ఉదయం 10.26 నుంచి 11.58 వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.23 నుంచి 1.14 తిరిగి మధ్యాహ్నం 2.58 నుంచి 3.49 వరకు
అమృతఘడియలు : రాత్రి 7.39 నుంచి 9.11 వరకు
సూర్యోదయం: 05:30
సూర్యాస్తమయం : 06:23
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు
సోమవారం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్ర పఠించినా, కనీసం నీళ్లతో అభిషేకం చేసినా ఎన్నో సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా శంకరాచార్యులు రాసిన కాలభైరవాష్టకం మీకోసం
కాలభైరవాష్టకం
దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 1 ||
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 2 ||
శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 3 ||
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 4 ||
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగమండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 5 ||
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభీషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 6 ||
అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 7 ||
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 8 ||
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ || 9 ||
ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ |
Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి
Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!