Today Panchang 20 th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి...

మే 20 శుక్రవారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 20- 05 - 2022
వారం: శుక్రవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, బహుళపక్షం
తిథి : పంచమి శుక్రవారం రాత్రి 10.21 వరకు తదుపరి షష్టి
వారం : శుక్రవారం
నక్షత్రం: పూర్వాషాడ ఉదయం 7.52 తదుపరి ఉత్తరాషాడ
వర్జ్యం : మధ్యాహ్నం 3.20 నుంచి 4.50
దుర్ముహూర్తం : ఉదయం 8.05 నుంచి 8.57 వరకు తిరిగి మధ్యాహ్నం 12.23 నుంచి 1.14 వరకు
అమృతఘడియలు : రాత్రి 12.19 నుంచి 1.49 వరకు
సూర్యోదయం: 05:31
సూర్యాస్తమయం : 06:21
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
శుక్రవారం సందర్భంగా పాఠకుల కోసం సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం
సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం
క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే।
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే॥
ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే।
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలం।
సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ।
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః॥
కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా।
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే॥
వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ।
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః॥
కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయం।
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే॥
కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే।
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ।
పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే।
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే॥
కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ।
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే॥
ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా।
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః॥
ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం।
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువం॥
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీం।
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీం॥
పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం।
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినం॥
పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినం।
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియం॥
హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్॥
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువం॥
సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనం।
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదం॥
॥ ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణమ్ ॥
Also Read: మూడు దశాబ్దాల క్రితమే మొదలైన జ్ఞానవాపి మసీదు వివాదం
Also Read: 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

