Yadagirigutta: యాదగిరిగుట్టలో సత్యదేవుడి వ్రతం టికెట్ పెరిగిన ధర అమల్లోకి వచ్చేసింది!
Yadagirigutta Temple News: యాదగిరిగుట్టలో సత్యదేవుడి వ్రతం టికెట్ పెరిగిన ధర శ్రావణమాసం ప్రారంభమైన శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చేంది

Sathya deva Vratham at Yadagirigutta: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రత టికెట్ ధర పెరిగింది. గతంలో 800 ఉన్న టికెట్ ధర 200 పెంచి వెయ్యి రూపాయలు చేశారు. పెంచిన టికెట్ ధర జూలై 25 శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. శ్రావణమాసం ప్రారంభమైన మొదటి శుక్రవారం సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి, దేవాదాయ కమిషనర్, ఆలయ ఈవో వెంకట్రావు దంపతులు టికెట్ కొనుగోలు చేసి వ్రతాలు ఆచరించారు. కొత్తగా నిర్మించిన ప్రసాదాల టికెట్ కౌంటర్ ను ప్రారంభించారు.
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిచెందన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని సందర్శించుకునేందుకు నిత్యం వేలాది భక్తులు తరలివస్తారు. పండుగలు, ప్రత్యేక రోజుల్లో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచిరించేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే మొన్నటివరకూ వ్రతం టికెట్ 800 ఉండగా ఇప్పుడు టికెట్ ధర 1000 కి పెంచారు. ఈ టెకెట్ పై వ్రతం చేయించుకునే భక్తులకు పూజ, ఇతర సామగ్రితో పాటు స్వామివారి శేష వస్త్రాలు, సత్యనారాయణస్వామి ప్రతిమ కూడా ఇవ్వనున్నారు.
భక్తులకు అందించే ఉచిత ప్రసాదాన్ని100 కిలోల నుంచి 300 కిలోలకు పెంచాలని నిర్ణయం తీసుకుంది యాదాద్రి దేవస్థానం. గత నెల్లోనే దాదాపు 15 రోజులు ట్రయల్ రన్ నిర్వహించి జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని జూలై 23న లెక్కించారు. గత 41 రోజులుగా భక్తులు సమర్పించిన నగదు, కానుకలను ఆలయ సిబ్బంది లెక్కించారు. మొత్తం 2 కోట్ల 45 లక్షల 48 వేల 23 రూపాయల నగదు సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకట్రావు వెల్లడించారు. దీంతో పాటు 38 గ్రాముల బంగారం, 2 వేల 800 గ్రాముల వెండితో పాటూ వివిధ దేశాల కరెన్సీ వచ్చిందని చెప్పారు.
లోక సంరక్షణార్థం ఉగ్ర నరసింహుడు ఐదు రూపాలతో వెలసిన క్షేత్రం యాదగిరిగుట్ట. అందుకే దీనిని పంచ నారసింహ క్షేత్రం అంటారు. గతంలో కొండపై 14.03 ఎకరాల ప్రాంగణాన్ని క్షేత్రాభివృద్ధిలో భాగంగా 20 ఎకరాలకు పైగా రక్షణ గోడతో విస్తరించారు. అర ఎకరంలో ఉండే ప్రధాన దేవాలయం ప్రస్తుతం 4.03 ఎకరాల్లో వెలగిపోతోంది. కృష్ణశిలతో అష్టభుజి మండప ప్రాకారాలతో పునర్నిర్మించిన పంచనారసింహ క్షేత్రం భక్తులకు దివ్యానుభూతిని కల్గిస్తోంది. ఇక్కడ సర్వదర్శనం, శీఘ్ర దర్శనం, బ్రేక్ దర్శనం ఇలా మూడు రకాల దర్శనాలుంటాయి. తెల్లవారుజామున 3.30 గంటలకు సుప్రభాత సేవతో మొదలయ్యే పూజలు రాత్రి 10 గంటలకు శయనోత్సవం వరకూ కొనసాగుతాయి.
కొండపై బస్టేషన్ వద్ద ఉన్న 4 అంతస్తుల కాంప్లెక్స్ ద్వారా ఒక్కో అంతస్తులో కాంప్లెక్స్ నుంచి వెయ్యి మంది భక్తులను రెండో మాడవీధిలో ఉన్న గోల్డెన్ క్యూ కాంప్లెక్స్‌లోకి పంపిస్తారు. అక్కడ నుంచి అయిదంతస్తుల రాజగోపురం ద్వారా తొలి మాడవీధిలోకి పంపిస్తారు. అక్కడి నుంచి మూడంతస్తుల గోపురంలోంచి గర్భగుడి స్వర్ణ ద్వారం నుంచి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. తొందరగా దర్శనం చేసుకోవాలి అనుకుంటే శీఘ్ర దర్శనం పేరిట ప్రత్యేక క్యూ ద్వారా ఆలయంలోకి ప్రవేశించే అవకాశాన్ని కల్పించారు..ఈ టికెట్ ధర 150 రూపాయలు. వీఐపీ భక్తులకోసం ఉదయం 9 నుంచి 10 , సాయంత్రం 4 నుంచి 5 సమయం కేటాయించారు. వీఐపీ దర్శనం టికెట్ ధర ఒక్కరికి 300 రూపాయలు
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















