అన్వేషించండి

Thursday Remedies: గురువారం పసుపు ఇలా వాడితే జీవితంలో మీకు లోటు ఉండదు..!

Thursday Remedies: ఇంట్లో దొరికే కొన్ని వస్తువులు జీవితంలోని బాధలను దూరం చేస్తాయి. పసుపుకు అలాంటి శక్తి ఉంది. బృహస్పతికి సంబంధించిన సమస్యను పసుపుతో ఎలా పరిష్కరించాలో తెలుసుకోండి.

Thursday Remedies: జ్యోతిషశాస్త్రంలో బృహస్పతి కీల‌క‌ స్థానంలో ఉంటాడు. దేవతలకు అధిపతి అయిన బృహస్పతి రూపంలో ఉన్న గురుడు ముఖ్యంగా జ్ఞానానికి సంబంధించిన గ్ర‌హంగా పరిగణిస్తారు. ఈ గ్రహం ఎవ‌రినైనా పూర్తిగా అనుకూలిస్తే వారి కష్టాలన్నీ తీరిపోతాయి. అందుకే దీనికి అంత ప్రాధాన్యత ఇస్తారు. గ్రంధాలలో పసుపు, కుంకుమ‌ లక్ష్మీ దేవి, బృహస్పతి అంశాలుగా వర్ణించారు. కుంకుమపువ్వు, పసుపును ఉపయోగించి కొన్ని సాధారణ నివారణలు చేస్తే, వ్యక్తి బాధ నుంచి విముక్తి పొందుతాడు. అటువంటి కొన్ని నివారణల గురించి తెలుసుకుందాం.

Also Read : అరుదైన మౌలిక నీలం పసుపు - మనదేశంలో అంతరించిపోతున్న ఔషధం ఇది

కెరీర్‌లో పురోగతి కోసం
ఏ మాసమైనా శుక్ల పక్ష అష్టమి నాడు సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి. తూర్పు ముఖంగా కూచుని లక్ష్మీదేవిని పూజించండి. పూజలో పసుపు బంతిని ఉంచండి. లక్ష్మీ దేవిని పూజించిన తర్వాత, ఆ పసుపు బంతిని మీ అల్మారాలో ఉంచండి. ఈ రెమెడీతో కెరీర్ చాలా త్వరగా పురోగమిస్తుంది. పసుపు తిలకం నుదుటిపై ధ‌రించ‌డం శుభ ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు.

సమాజంలో ప్రతిష్ట, గౌరవం పొందేందుకు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతిచోటా విజయం, గౌరవం పొందడానికి ప్రతి గురువారం కుంకుమ తిలకం ధ‌రించాలి. ఇలా చేయడం వల్ల మనిషి జీవితంలో రూపం, సంపద, గౌరవం పొందుతాడు. దీని ద్వారా దేవతలు ప్రసన్నమై భ‌క్తుల‌ను అన్ని విధాలుగా అనుగ్ర‌హిస్తారు. పసుపును తిలకం రూపంలో విష్ణుమూర్తికి సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి.

వాస్తు దోషానికి పరిహారం
వాస్తు దోషాలను తొలగించడానికి ఈ రెండు వస్తువులను ఉపయోగించడం వల్ల ఇంట్లోని అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయి. పసుపును నీళ్లలో కలిపి రోజూ ఇంటి ప్రధాన ద్వారం మీద చల్లాలి. ఈ పరిహారంతో ఇంటి వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఫ‌లితంగా లక్ష్మీ దేవి రావడంతో ఇంట్లోని ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది.

గురువారం ప‌సుపు కొనుగోలు
వాస్తు, జ్యోతిషశాస్త్రం ప్రకారం, గురువారం పసుపు కొనడం, ఉపయోగించడం శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే ఈ రోజు పసుపు ఎవరికీ ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల భవితవ్యం పాడైపోయి పేదవాడిగా మారతారు. కాబట్టి, ఈ రోజు ఇతరులకు పసుపు ఇవ్వడం వీలైనంత వరకు మానుకోవాలి.

Also Read : ముఖానికి పసుపు రాసుకునేటప్పుడు ఈ తప్పులు మాత్రం చెయ్యకండి

చెడు దృష్టిని వదిలించుకోవడానికి
వేరొకరి చెడు దృష్టి మీ వైవాహిక జీవితాన్ని, మీ గృహ సంతోషాన్ని క్రమం తప్పకుండా ప్రభావితం చేస్తుందని మీరు గుర్తిస్తే, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీ ఇంటి ప్రధాన తలుపు వెలుపల పసుపుతో స్వస్తిక్‌ను గీయండి. ఈ పరిష్కారం మీకు ఆనందంతో పాటు అదృష్టం తెస్తుంది.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
BCCI Red Alert: ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Preity Zinta Celebrations | PBKS vs KKR మ్యాచ్ లో ప్రీతి జింతా సెలబ్రేషన్స్ వైరల్Narine Bat Inspection vs PBKS IPL 2025 | పంజాబ్ మ్యాచ్ లో నరైన్ కి షాక్ ఇచ్చిన అంపైర్లుPBKS vs KKR Match Chahal Bowling | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో పంజాబ్ కు సెన్సేషనల్ విక్టరీPBKS Highest lowest IPL 2025 | వరుస మ్యాచుల్లో రెండు వేరియేషన్స్ చూపించిన పంజాబ్ కింగ్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
BCCI Red Alert: ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
Varsha Bollamma: ప్యాంట్, పంత్, లక్నో... వర్షా బొల్లమ్మ ఎక్కడి నుంచి ఎక్కడికి ముడి పెట్టింది మావా
ప్యాంట్, పంత్, లక్నో... వర్షా బొల్లమ్మ ఎక్కడి నుంచి ఎక్కడికి ముడి పెట్టింది మావా
Gold price: 98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
Balakrishna: 'జాట్' సక్సెస్ తర్వాత బాలకృష్ణతో... 'వీర సింహా రెడ్డి' కాంబో రిపీట్!
'జాట్' సక్సెస్ తర్వాత బాలకృష్ణతో... 'వీర సింహా రెడ్డి' కాంబో రిపీట్!
EV charging station :ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఎవరైనా పెట్టుకోవచ్చా? ఎంత ఖర్చు అవుతుంది?
ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఎవరైనా పెట్టుకోవచ్చా? ఎంత ఖర్చు అవుతుంది?
Embed widget