అన్వేషించండి

Marriage dates in 2024: కళ్యాణ గడియలు వచ్చేస్తున్నాయ్ - జూన్‌, జులైలో పెళ్లి ముహూర్తాల తేదీలు ఇవే!

Wedding moments: హిందూ మత విశ్వాసాల ప్రకారం పెళ్లిళ్లు జరిపేందుకు వారం, తిథి, నక్షత్రం, జాతకం అన్నింటికీ పరిగణలోనికి తీసుకుంటారు. జూన్, జులై నెలలో పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి.

Wedding Dates 2024: కల్యాణం అనే కమనీయ ఘట్టం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కీలకమైంది. హిందూ మతంలో వివాహ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలున్నాయి. ఒక్కప్పుడు ఇద్దరు వ్యక్తులకు పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసేవారు. కాలక్రమేణా వివాహ ఘట్టంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్ని మార్పులు వచ్చినా పెళ్లి ముహూర్తాలకు మాత్రి ప్రతిఒక్కరూ ప్రాధాన్యత ఇస్తుంటారు.

మన దేశంలో వివాహానికి సంబంధించి పలు ప్రాంతాల్లో పలు రకాల ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తుంటారు. కొన్ని చోట్ల మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలను జరుపుకుంటే.. ఇంకొన్ని చోట్ల ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఇంకొందరైతే 16 రోజులు జరుపుకుంటారు. భారతీయ వివాహ వ్యవస్థకు ఇప్పటికే ప్రత్యేకస్థానం ఉండటానికి ఇదే కారణం. 

ఇక జ్యోతిష్యం, పంచాంగం ప్రకారం పెళ్లి వంటి ముఖ్యమైన కార్యాలకు, జాతకంలోని శుక్రుడి స్థానాన్ని కీలకంగా తీసుకుంటారు. కొత్త కాలంగా పెళ్లికి సంబంధించి మంచి ముహూర్తాలు లేవు. మూడాలు ఉండటంతో మార్చి వరకే పెళ్లిళ్ల ముహూర్తాలు పెట్టారు పురోహితులు. అయితే మరికొన్ని రోజుల్లోనే అద్భుతమైన ముహుర్తాలు రానున్నాయి. అందుకే తమ పిల్లలకు వివాహం  చేసేందుకు ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

ఈ ఏడాది ఫిబ్రవరి 11వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభమైంది. ఈ సమయం నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు పెళ్లిళ్లు జరిగాయి. అయితే ఆ తర్వాత మూఢం, శూన్యమాసం వచ్చింది. ఈ మధ్య కాలంలో వివాహాది కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత మళ్లీ శ్రావణ మాసంలోనే వివాహాలకు శుభ ముహుర్తాలు ఉన్నాయని పండితులు అంటున్నారు.

వచ్చే నెల జూన్ , జులైలో పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. జూన్ 29, శనివారం జూలై 9, మంగళవారం, జూలై 11, గురువారం, జూలై 12, శుక్రవారం, జూలై 13, శనివారం, జూలై 14, ఆదివారం, జూలై 15, సోమవారం తేదీల్లో  మాఘ, ఉత్తర ఫాల్గుణి, హస్తా, స్వాతి నక్షత్రాల వేళ శుభ ముహుర్తాలు ఉన్నాయి

అయితే తర్వాత వచ్చే చాతుర్మాసం కారణంగా ఆగస్టు 2024 నుంచి అక్టోబర్ 2024 వరకు తెలుగు ముహూర్తాలకు తేదీలు లేవని చెబుతున్నారు పురోహితులు. మళ్లీ నవంబరులో ఉత్తర భాద్రపద, రేవతి, రోహిణి, మార్గశిర, హస్త, స్వాతి నక్షత్రం వేళ వివాహానికి శుభ ముహుర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత డిసెంబర్ నెలలో కూడా వివాహాది శుభకార్యక్రమాలకు శుభ ముహూర్తాలు ఉన్నాయి. 

ఈసారి దేశవ్యాప్తంగా లక్షలాది పెళ్లిళ్లు జరగనున్నాయి. ఒక్కో ముహుర్తానికి వేలాది సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. త్వరలోనే అంటే వచ్చే నెలలోనే  వివాహాది శుభ కార్యక్రమాలకు శుభ ముహుర్తాలు ప్రారంభం కావడంతో మార్కెట్లో వ్యాపారాలు కూడా జోరందుకునే అవకాశం కనిపిస్తోంది. 

Also Read : Vastu Tips: కొత్తగా పెళ్లయ్యిందా? మీ బెడ్ రూమ్‌ను ఇలా అలంకరించుకుంటే.. సుఖం, సంపద!

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget