(Source: ECI/ABP News/ABP Majha)
Baby Teeth: పసి పిల్లలకు ఈ నెలల్లో దంతాలు వస్తే అశుభం - ఎవరికి కీడు? ఏం జరుగుతుంది?
పసి పిల్లల్లో దంతాలు ఏ నెలలో మొదటి సారి కనిపించాయనే దాన్ని బట్టి కూడా వారి భవిష్యత్తు గురించి శుభాశుభాల గురించి జ్యోతిషం వివరిస్తుంది.
జ్యోతిష్యం మానవ జీవితంలోని ప్రతి స్థాయిలోని విషయాలలో మంచీచెడులను గురించి చర్చిస్తుంది. పసివారు పుట్టినప్పటి నుంచి వారి ఎదుగుదలలో చూపించే మార్పులను గురించి కూడా శుభాశుభాలను వివరిస్తుంది. అలాగే శిశువులకు దంతాలు వచ్చే సమయం గురించి కూడా వివరణాత్మక సమాచారం శాస్త్రలలో ఉంది. అవేమిటో తెలుసుకుందాం.
పిల్లల ఎదుగుదలలో దంతాలు రావడం ఒక ప్రత్యేకమైంది, ముఖ్యమైంది కూడా. 5 నుంచి 8 నెలల వయసులో దంతాలు పిల్లల్లో బయటికి కనిపించడం మొదలవుతుంది. చాలా అరుదుగా 2, 3 నెలల్లోనే పళ్లు వస్తాయి, మరికొందరిలో 8 నెలల తర్వాత కొంచెం ఆలస్యంగా దంతాలు ఏర్పడుతాయి. జ్యోతిషశాస్త్రంలో పిల్లలకు ఏనెలలో దంతాలు వచ్చాయనే దాన్ని బట్టి శుభాశుభాలు ఉంటాయని పండితులు వివరిస్తున్నారు. ఏ నెలలో దంతాలు రావడం శుభప్రదం? ఏ నెలలో దంతాలు వస్తే అశుభం పండితులు ఏమంటున్నారో చూద్దాం.
ఇదే శుభప్రదం
పుట్టిన నాలుగో నెలలో పిల్లలల్లో దంతాలు బయటపడితే అంది మంచి సంకేతమట. నాలుగోనెలలో దంతాలు వస్తే ఆపిల్లల కంటే ముందు పుట్టిన తోబుట్టువులకు మేలు జరుగుతుందట. అయితే నాలుగో నెలలో దంతాలు వచ్చిన పిల్లల తల్లికి సమస్యలు రావచ్చని కూడా కొందరు పండితులు అంటున్నారు.
6,7 నెలల్లో దంతాలు కనిపించడం కూడా శుభప్రదమే. ఆరవనెలలో దంతాలు కనిపిస్తే ఆ కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు పెరుగుతాయి. ముఖ్యంగా ఏడో నెలలో దంతాలు వస్తే తండ్రి జీవితంలో శుభపరిణామాలు జరుగుతాయట.
9,10 నెలల్లో దంతాలు కనిపిస్తే అది ఆ శిశువు భవిష్యత్తుకు శుభం కలిగించే సంకేతం. పదకొండో నెలలో దంతాలు కనిపిస్తే తల్లికి మేలు జరుగుతుంది. పన్నెండో నెలలో దంతాలు మొదటిసారి కనిపిస్తే కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయట.
ఇలా జరిగితే అశుభం
పిల్లల దంతాలు రెండో నెలలో కనిపిస్తే అది మంచి సంకేతం కాదు. ఆ పిల్లల జీవితంలో సవాళ్లు ఎదురు కావచ్చు. కుటుంబ పరిస్థితులు దిగజారవచ్చు. ఎనిమిదో నెలలో దంతాలు కనిపిస్తే పిల్లలకు అనారోగ్యం కలుగుతుందని అనేందకు సూచనగా శాస్త్రం చెబుతోంది. ఇలా జరిగితే పిల్లల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం.
అదీ కాకుండా పిల్లల్లో పై పలువరుసలో దంతాలు ముందుగా రావడం కూడా అంత మంచిది కాదని శాస్త్రం వివరిస్తుంది. ఆ పిల్లల జీవితం పై చెడు ప్రభావం చూపుతుందట. అనారోగ్య సమస్యలు తరచుగా ఇబ్బంది పెట్టవచ్చని అనేందుకు సంకేతంగా పండితులు హెచ్చిరిస్తున్నారు. ఇలాంటి పిల్లల్లో చిన్న అనారోగ్యం వచ్చినా డాక్టర్ సలహా పాటించడం, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు కూడా.
Also Read : గురువారం సబ్బుతో స్నానం చేయకూడదా? జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారు?
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.